భారత్‌లో మోటరోలా తయారీ యూనిట్

Posted By:

 భారత్‌లో మోటరోలా తయారీ యూనిట్

మన అవసరాలకు అవసరమైన వస్తువులను మనమే తయారు చేసేుకుని, ఉపయోగించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చిన ‘మేక్ -ఇన్-ఇండియా' నినాదానికి రోజురోజుకు ప్రాముఖ్యత పెరుగుతోంది.

 భారత్‌లో మోటరోలా తయారీ యూనిట్

అభివృద్థి పరంగా భారత్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ఇప్పటికే సామ్‌సంగ్, సోనీ, ఫోర్డ్ వంటి గ్లోబల్ కంపెనీలు తమ మద్దతును ప్రకటించగా, తాజాగా ఈ జాబితాలోకి మైక్రోసాఫ్ట్ అలానే మోటరోలాలు చేరాయి. ఈ రెండు గ్లోబల్ తయారీ కంపెనీలు త్వరలోనే భారత్‌లో తయారీ యూనిట్‌లను నెలకొల్పనున్నాయి.

 భారత్‌లో మోటరోలా తయారీ యూనిట్

భారత్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో మోటరోలా 3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. మోటరోలాకు చెన్నైలో ఓ ఫ్యాక్టరీ ఉన్నప్పటికి వ్యయాన్ని తగ్గించుకునేందుకు గూగుల్ 2013లో ఈ ఫ్యాక్టరీని మూసివేసింది. ఇటీవల మోటరోలా మొబైల్ విభాగాన్ని లెనోవో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Make In India: Microsoft, Motorola May Start Local Manufacturing Soon. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot