ఈ అప్లికేషన్ మీ ఫోన్‌లో ఉంటే 40 దేశాలకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు!

Posted By: Prashanth

ఈ అప్లికేషన్ మీ ఫోన్‌లో ఉంటే 40 దేశాలకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు!

 

విదేశాల్లో ఉన్న మీ స్నేహితులతో మాట్లాడేందుకు టాక్‌టైమ్ రూపంలో అధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారా..?, మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నట్లయితే పైసా ఖర్చు లేకుండా ఇండియా, కెనాడా, అమెరికా, బ్రిటన్ సహా 40 దేశాలకు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ‘క్రౌడ్ కాల్’ (Crowd Call) అనే అప్లికేషన్ ఇందుకు తోడ్పడుతుంది. ఈ అప్లికేషన్‌‍ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో ఉచితంగా మొబైల్ సంభాషణలను సాగించవచ్చు.

అప్లికేషన్‌ను ఉపయోగించే విధానం:

1.) ముందుగా క్రౌడ్ కాల్ అప్లికేషన్‌ను సంబంధిత సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్ లింక్: http://crowdcall.me/

ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.socialdial.crowdcall.app

ఐవోఎస్ అప్లికేషన్ స్టోర్ లింక్: http://itunes.com/app/crowdcall

2.) ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం మీ మొబైల్ నెంబర్‌ను అడిగిన చోట ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

3.) అప్లికేషన్ ట్యాబ్‌లో ఏర్పాటు చేసిన కాంటాక్ట్ బాక్స్‌లో మీరు కాల్ చేయాలనుకుంటున్న సదురు వ్యక్తి ఫోన్ నెంబర్‌ను ఐఎస్‌డి కోడ్‌తో సహా ఎంటర్ చేసి కాల్ బటన్‌ను ప్రెస్ చేయండి.

4.) కొద్ది సెకన్లలోనే వాయిస్ సూచనలతో కూడిన ఓ అంతర్జాతీయ కాల్ మీ ఫోన్‌కు వస్తుంది. ఈ కాలర్ చేసే వాయిస్ నిబంధనలను అనుసరిస్తూ మీ ఫోన్‌లోని 1 నెంబర్‌ను డయల్ చేయండి. కొద్ది సెకన్లలోనే మీ కాల్మీ మిత్రునికి కనెక్ట్ చేయబడుతుంది.

ఈ అప్లికేషన్ ద్వారా ఒకేసారి 20 మంది ప్రపంచంలో ఎక్కడినుంచైనా కాన్ఫిరెన్స్ కాల్స్ నిర్వహించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot