ఛార్జింగ్ పెట్టి పాటలు విన్నాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు

తరచుగా వెలుగుచూస్తోన్న స్మార్ట్ ఫోన్స్ పేలుడు ఘటనలు వినియోగదారులని ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఒక ఘటన మరిచిపోక ముందే మరొక ఘటన చోటుచేసుకుంటున్న వైనం వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

|

తరచుగా వెలుగుచూస్తోన్న స్మార్ట్ ఫోన్స్ పేలుడు ఘటనలు వినియోగదారులని ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఒక ఘటన మరిచిపోక ముందే మరొక ఘటన చోటుచేసుకుంటున్న వైనం వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గతంలో మలేషియా క్రాడిల​ ఫండ్‌ కంపెనీకి నజ్రీన్‌ హసన్‌(45) సీఈఓ తన గదిలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిన విషయం తెలిసిందే .ఇదిలావుండగా తాజాగా మలేషియా లో ఇటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది . ఈ ఘటనలో Mohammed Aidil Azzahar Zaharin ఓ 16 ఏళ్ళ అబ్బాయి తన మొబైల్ ను ఛార్జింగ్ పెట్టి పాటలు వింటూ నిద్రపోయాడు కరెంటు షాక్ కొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే....

ఇక కంటి గ్లాసెస్‌తో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చుఇక కంటి గ్లాసెస్‌తో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు

Mohammed Aidil Azzahar Zaharin

Mohammed Aidil Azzahar Zaharin

మలేషియాలోని నెగెరీ సెమ్బిలాన్ రాష్ట్రంలో రెంబావ్ పట్టణం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.Mohammed Aidil Azzahar Zaharin అనే 16 కుర్రాడు నిద్రపోయేటప్పుడు హెడ్ ఫోన్స్ చెవి పెట్టుకొని నిద్రపోయాడు.

ఆ కుర్రాడి చెవిలోలో నుంచి వస్తున్న రక్తం...

ఆ కుర్రాడి చెవిలోలో నుంచి వస్తున్న రక్తం...

మరుసటి రోజు ఆ అబ్బాయి తల్లి నిద్రలేపడానికి వచ్చినప్పుడు ఆ కుర్రాడి చెవిలోలో నుంచి వస్తున్న రక్తం చూసి షాక్ కి గురై డాక్టర్ ని ఇంటికి పిలిపించింది.చాల సేపు క్రితమే ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పడంతో ఆ తల్లి సొమ్మసిల్లింది.

కరెంటు  షాక్ తగిలి చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది....
 

కరెంటు షాక్ తగిలి చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది....

ఒంటి పై ఎటువంటి దెబ్బ లేకపోవడం కేవలం చెవిలో నుంచి రక్తం రావడంతో పోస్టుమార్టం చేసారు. అందులో ఆ అబ్బాయి కి కరెంటు షాక్ తగిలి చనిపోయాడని నివేదికలో వెల్లడైంది.

తాకినప్పుడు తనకి  ఒక చిన్న విద్యుత్ షాక్...

తాకినప్పుడు తనకి ఒక చిన్న విద్యుత్ షాక్...

బాధితుడు యొక్క సోదరుడు అతను కేబుల్ తాకినప్పుడు తనకి ఒక చిన్న విద్యుత్ షాక్ తగిలింది అని చెప్పాడు.

 

 

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు

ఈ నేపథ్యంలో ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను ప్రోత్సహించకండి.మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు. దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

 

overheat

overheat

ఫోన్‌లో అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌ను బ్రౌజ్

ఇంటర్నెట్‌ను బ్రౌజ్

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌

బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌

ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లను

కనెక్టువిటీ ఫీచర్లను

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి. వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది

చార్జ్ అవుతోన్న సమయంలో

చార్జ్ అవుతోన్న సమయంలో

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

ఎక్కువ సేపే గేమ్స్

ఎక్కువ సేపే గేమ్స్

ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Boy, 16, is electrocuted while wearing headphones as his phone was plugged in to a charger in Malaysia.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X