చానెల్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి !
గూగుల్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. గత ఆదివారం అమెరికాలోని మౌంటెయన్ వ్యూలో కాలిఫోర్నియా పోలీసులు ఒక యూట్యూబ్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వాటర్ విల్లేలోని గూగుల్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడి స్టాఫ్ ను
గూగుల్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. గత ఆదివారం అమెరికాలోని మౌంటెయన్ వ్యూలో కాలిఫోర్నియా పోలీసులు ఒక యూట్యూబ్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వాటర్ విల్లేలోని గూగుల్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడి స్టాఫ్ ను బెదిరించినట్లు కేసు నమోదు చేశారు.

కారణం ఏమిటంటే తన యూట్యూబ్ అకౌంట్ ను గూగుల్ సిబ్బందే కావాలని డిలీట్ చేసారని ఆరోపిస్తూ ఆగంతకుడు దాడి చేశాడు. అయితే నిజానికి అతని భార్యనే కావాలని డిలీట్ చేసినట్లు తర్వాత తెలిసింది.

మానసిక సమస్యలు
33 సంవత్సరాల కైల్ లాంగ్ కు మానసిక సమస్యలు ఉన్నట్లు తెలిసింది. అతనికి బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లు అంతే కాదు అతడు 2002లో తన స్నేహితుడి హత్య కేసులో కూడా కైల్ లాంగ్ నిందితుడిగా పేర్కొన్నారు.

పనికిమాలిన పోస్ట్స్
అలాగే 2015లో సైతం కారును అత్యంత తక్కువ వేగంతో నడిపిన కేసులో సైతం కైల్ లాంగ్ నిందితుడిగా ఉన్నారు.

భార్య సమంతా లాంగ్
అతని భార్య సమంతా లాంగ్ సైతం తన భర్త పనికిమాలిన పోస్ట్స్ చేస్తున్నారని అందుకే తొలగించినట్లు తెలిపారు. తన పిల్లలు ఇలాంటివి చూడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు సమంతా తెలిపారు.

గూగుల్ స్టాఫ్ తనకు తెలియకుండా..
అయితే గూగుల్ స్టాఫ్ తనకు తెలియకుండా యూట్యూబ్ చానెల్ ను డిలీట్ చేసినట్లు కైల్ లాంగ్ సిద్ధంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే కైల్ లాంగ్ గూగుల్ హెడ్ క్వార్టర్స్ మౌంటెయిన్ వ్యూ సమీపంలో సాన్ బ్రూనో వద్ద ఒక వాహనంలో మూడు బేస్ బాల్ బ్యాట్స్ లభించాయి.

గత సంవత్సరం కూడా
ఇక గత సంవత్సరం కూడా యూట్యూబ్ ఆఫీసుపై నసీమ్ నజాఫీ అనే మహిళ కూడా సెమి ఆటోమేటిక్ పిస్టల్ తో దాడికి యత్నిస్తూ దొరికిపోయింది. కాగా ఉద్యోగుల భద్రత విషయంలో గూగుల్ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని యూట్యూబ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








