128జీబి ఫ్లాపీ డిస్క్..

Written By:

ఫ్లాపీ డిస్క్.. ఈ కంప్యూటర్ స్టోరేజ్ డివైస్‌కు సంబంధించి నేటి యువతరానికి అంతగా అవగాహనలేకపోవచ్చు. కంప్యూటర్లు అందుబాటులోకి తొలినాళ్లలో ఫ్లాపీ డిస్క్ కీలక పాత్రపోషించింది. మీడియా డ్రైవ్‌లా ఉపయోగపడే ఈ పరికరాన్ని కంప్యూటర్‌లోని డేటా అలానే ప్రోగ్రామ్‌లను స్టోర్ చేసేకునేందుకు వినియోగించే వారు. ఫ్లాపీ‌ డిస్క్ కేవలం 1.44 మెగాబైట్‌ల డేటాను మాత్రమే స్టోర్ చేయగలదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీడీ రోమ్ డిస్క్ అలానే ఫ్లాష్ డ్రైవ్‌లతో పోలిస్తే ఇది చాల తక్కువ.

128జీబి ఫ్లాపీ డిస్క్..

Source : Dr. Moddstine Youtube

అయస్కాంత సిద్ధాంతం ఆధారంగా స్పందించే ఈ ఫ్లాపీ డ్రైవ్లకు కాలం చెల్లిపోయింది. మోడ్రన్ డే కంప్యూటర్లు ఈ ఫ్లాపీ డిస్క్‌లను సపోర్ట్ చేయటం లేదు. వీటి స్థానాన్ని భర్తీ చేసిన ఫ్లాష్ స్టోరేజ్ డివైస్‌ల సామర్థ్యం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కాలిఫోర్నియాకు చెందిన మైక్రోడియా అనేక కంపెనీ ఏకంగా 512 జీబి సామర్థ్యం గల మైక్రోఎస్డీ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాన్‌డిస్క్ వంటి కంపెనీలు 200జీబి సామర్థ్యంతో కూడిన ఫ్లాష్ స్టోరేజ్ డివైస్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

Read More : లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?

యూట్యూబ్‌కు చెందిన Dr. Moddstine తన ఐబీఎమ్ ఆప్టివా డెస్క్‌టాప్ కోసం ఏకంగా 128జీబి సామర్థ్యం గల ఫ్లాపీ డిస్క్‌ను అభివృద్థి చేసుకున్నారు. కేవలం 1.44 ఎంబీ డేటాను మాత్రమే సేవ్ చేయగిలిగే అవుట్ డేటెడ్ ఫ్లాపీ డిస్క్ డ్రైవ్‌ను అంత సమర్థవంతంగా తీర్చిదిద్దగలిగారన్న సందేహం మీలో కలుగుతోంది కదూ..? చాలా సింపుల్ అండి. ఈ తెలివైన ఇంజినీర్ తన పాత ఫ్లాపీ డిస్క్‌లో చిన్న మార్పులు చేసి 128జీబి ఎస్డీ కార్డ్‌ను పొందుపరిచారు. అంతే, 1.44 ఎంబీ సామర్థ్యం గల ఫ్లాపీ డిస్క్ ఏకంగా 128జీబి ఫ్లాపీ డిస్క్‌లా మారిపోయింది.

Read More : ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

English summary
Man Creates a 128 GB Floppy Disk. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot