Apple ఫోన్ అద్భుతం.. 10 నెల‌లు నీటిలో ప‌డినా బాగా ప‌నిచేస్తోంది..!

|

యూకే ఓ Apple ఫోన్ యూజ‌ర్ కు వింత అనుభ‌వం ఎదురైంది. ప‌ది నెల‌ల కింద‌ట న‌దిలో తాను పోగొట్టుకున్న త‌న Apple స్మార్ట్ ఫోన్ మ‌ళ్లీ త‌న‌కు దొరికిన‌ట్లు తెలిపారు. ఇంత‌కీ విశేష‌మేంటంటే.. ఆ ఫోన్ ప‌ది నెల‌ల త‌ర్వాత కూడా నీటిలో ప‌డ‌క ముందు ఎలా ప‌నిచేస్తుందో అదే విధంగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మిగ్వేల్ ప‌చేకో అనే వ్య‌క్తి త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్ల‌డించాడు.

 
Apple ఫోన్ అద్భుతం.. 10 నెల‌లు నీటిలో ప‌డినా బాగా ప‌నిచేస్తోంది..!

ఇక వివ‌రాల్లోకి వెళ్తే.. యూకే లోని ఎండింగ్‌బ‌ర్గ్‌కు చెందిన ఒవేన్ డేవిస్ అనే వ్య‌క్తి గ‌తేడాది ఆగ‌స్టులో త‌న కుటుంబ స‌భ్యుల‌తో కలిసి సిండ‌ర్ ఫోర్డ్ స‌మీపంలోని వేయ్ న‌దిలో విహారానికి వెళ్లాడు. ప‌డ‌వ‌లో విహారం చేస్తుండ‌గా త‌న Apple స్మార్ట్ ఫోన్ ప్ర‌మాద‌వ‌శాత్తూ నీటిలో ప‌డిపోయింది. ఇక న‌దిలో ప‌డిన ఫోన్ దొరకదు అని బాధతో ఇంటికి తిరిగి వెళ్లాడు. ఈ క్ర‌మంలో ప‌ది నెల‌ల త‌ర్వాత‌ ఇటీవ‌ల ఆ ఫోన్ న‌ది స‌మీపంలో మిగ్వెల్ అనే వ్య‌క్తికి దొరికింది. ఎవ‌రో వ్య‌క్తి ఫోన్ దుర‌దృష్ట‌వ‌శాత్తూ న‌దిలో పోగొట్టుకున్న‌ట్లున్నాడ‌ని మిగ్వెల్ గ్ర‌హించాడు. అందులో ఆ పోగొట్టుకున్న వ్య‌క్తికి సంబంధించిన విలువైన ఫోటోలు స‌మాచారం ఉండి ఉంటాయ‌ని భావించి బాధితుడికి ఎలాగైనా ఫోన్ తిరిగి అందించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

నీటితో త‌డిచిన మొబైల్‌ను ఆర‌బెట్టి ఆ త‌ర్వాత ఛార్జ్ చేసి ఆన్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో ఆ ఫోన్ యథావిధిగా సాధార‌ణ ఫోన్ మాదిరిగానే ఆన్ అయింది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ ఫోన్ బాధిత వ్య‌క్తికి చేర్చే ప‌నిలో భాగంగా మిగ్వెల్ త‌న ఫేస్‌బుక్ పేజీలో ఈ న‌దిలో దొరికిన ఫోన్ కు సంబంధించిన విష‌యాన్ని రాసుకొచ్చాడు. అది కాస్తా వైర‌ల్‌గా మారి డేవిస్ వ‌ర‌కూ చేరింది. చివ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ప‌లువురి సాయంతో ఆ ఫోన్ య‌జ‌మాని డేవిస్ త‌న మొబైల్‌ను తాను ద‌క్కించుకోగ‌లిగాడు.

Apple ఫోన్ అద్భుతం.. 10 నెల‌లు నీటిలో ప‌డినా బాగా ప‌నిచేస్తోంది..!

ఈ సందర్భంగా డేవిస్ బీబీసీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మిగ్వెల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక దొర‌క‌ద‌ని అనుకున్న త‌న ఫోన్‌ను తనకు చేరవేసిన నెటిజన్లకు థ్యాంక్యూ చెప్పాడు. త‌న ఫోన్ న‌దిలో ప‌డి 10నెలలు దాటినా అది పని చేస్తుండ‌టంపై డేవిస్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా నెటిజ‌న్లు కూడా 10 నెల‌లు నీటిలో ప‌డి ప‌ని చేస్తున్న ఆ మొబైల్ పై బ్రాండ్‌పై అభినంద‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో విడుద‌లైన అన్ని iPhone లు IP68 రేటింగ్‌తో త‌యారు చేయ‌బ‌డ్డాయి, అంటే అవి 30 నిమిషాల వరకు మంచినీటిలో ప‌డినా యథావిథిగా ప‌ని చేస్తాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌లో మాత్రం 10 నెలలు నీటి అడుగున ఉండి కూడా ఇంకా పని చేయడం ఖచ్చితంగా ఒక అద్భుతం మరియు చాలా తరచుగా జరగదు అని నెటిజ‌న్లు అంటున్నారు. అయితే, ఆ ఐఫోన్ ఏ మోడ‌ల్ అనేది తెలియ రాలేదు.

 
Apple ఫోన్ అద్భుతం.. 10 నెల‌లు నీటిలో ప‌డినా బాగా ప‌నిచేస్తోంది..!

ఏప్రిల్‌లో మొబైల్ సేల్స్ లో Apple గ్లోబ‌ల్ టాప్‌:
ఏప్రిల్ నెల‌లో గ్లోబ‌ల్ మార్కెట్‌లో అత్య‌ధిక మొబైల్స్ అమ్మిన బెస్ట్ సెల్లింగ్ ఫోన్ల జాబితాలో తొలి స్థానాన్ని సాధించింది. ఈ మేర‌కు కౌంట‌ర్‌పార్ట్ అనే సంస్థ ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇత‌ర టెక్ దిగ్గ‌జాల‌తో పోలిస్తే ఏప్రిల్ నెల‌లో యాపిల్ సంస్థ అత్య‌ధిక ఫోన్లు అమ్ముడైన‌ట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో షావోమీ, శాంసంగ్ మొబైల్ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. కాక‌పోతే, యాపిల్ గ‌తేడాది మాదిరిగానే తొలి స్థానం సాధించ‌డం విశేషం. ఈ ఏడాది మార్చిలో అన‌గా 2022 మొదటి త్రైమాసికంలో కూడా ఐఫోన్ 13 మ్యాక్స్ మరియు ఐఫోన్ 13 అత్యధికంగా అమ్ముడైన డివైజ్‌లుగా ఉన్నాయని వెల్లడించింది.

యాపిల్‌కు చెందిన మొత్తం ఐదు మోడ‌ల్స్ టాప్ సెల్లింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఫోన్ 13 గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5.5 శాతం వాటాతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో iPhone 13 Pro Max ప్రారంభ ధర రూ. 1,27,900 వద్ద విక్రయిస్తోంది.

Best Mobiles in India

English summary
Man Drops iPhone In River, Finds It After 10 Months in Working Condition

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X