పేలిన Redmi 5A స్మార్ట్‌ఫోన్ తృటిలో తప్పిన ప్రమాదం
చైనా కంపెనీ షియోమికి చెందిన రెడ్‌మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...
చైనా కంపెనీ షియోమికి చెందిన రెడ్‌మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే....శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని మార్కెట్‌కాలనీకి చెందిన రావుల సురేశ్ అనే కుర్రాడు నాలుగు నెలల క్రితం ఓ ప్రముఖ మొబైల్ దుకాణంలో Redmi 5A స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యాహ్నం సెల్‌ఫోన్ అకస్మాత్తుగా స్విచ్‌ఆఫ్ కావడంతో పాటు ఆ సెల్‌ఫోన్ నుం చి చిన్నపాటి శబ్దం వస్తుండడంతో ఆ సెల్‌ఫోన్‌ను చూపించేందుకని వెంటనే ఓ సెల్‌ఫోన్ రిపేర్‌షాపుకు వెళ్లాడు.

షర్ట్ పాకెట్ లో నుంచి ఆ సెల్‌ఫోన్‌ను తీసి షాపులోని టేబుల్‌పై పెడుతుండగానే....
షర్ట్ పాకెట్ లో నుంచి ఆ సెల్‌ఫోన్‌ను తీసి షాపులోని టేబుల్‌పై పెడుతుండగానే ఒక్కసారిగా సెల్‌ఫోన్ నుంచి మంటలు వచ్చాయి.అది గమనించిన సురేశ్‌తో పాటు షాపు నిర్వాహకుడు వెంటనే బయటకు పరుగెత్తుతుండగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో చుట్టుపక్కల షాపుల నిర్వాహకులు ఏమి జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు.

ఏ మాత్రం ఆలస్యం చేసినా ....
సురేశ్ ఏ మాత్రం ఆలస్యం చేసినా అతని జేబులోనే ఆ సెల్‌ఫోన్ పేలి ఉండేది. ఒకవేళ అదే జరిగితే సురేశ్ ప్రాణానికే ముప్పు వాటిల్లేది. దీంతో సురేశ్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు
ఈ నేపథ్యంలో ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను ప్రోత్సహించకండి.మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు. దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

overheat
ఫోన్‌లో అవసరంలేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌ను బ్రౌజ్
3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

బ్యాక్ గ్రౌండ్ యాప్స్
ఫోన్‌లో అవసరంలేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం
ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లను
నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి. వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

చార్జ్ అవుతోన్న సమయంలో
ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

ఎక్కువ సేపే గేమ్స్
ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








