వాట్సప్‌లో కిడ్నీ బేరం, ధర రూ. 1.6 కోట్లకు పైగానే !

సోషల్ మీడియా ద్వారా సమాజానికి ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు జరుగుతోంది.

|

సోషల్ మీడియా ద్వారా సమాజానికి ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు జరుగుతోంది. ఏకంగా కోట్లకు పైగా మోసాలు జరుగుతున్నాయి, సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సప్, ఫేస్‌బుక్, ఇంకా ఇతర ఫ్లాట్ ఫాంల్లో ఈ మోసాలు యథేచ్చగా జరుగుతున్నాయి. మేం విదేశాల్లో ఉం టున్నాం. మాకు అత్యవసరంగా కిడ్నీలు కావాలి. ఒక్కో కిడ్నీకి రూ.2 కోట్ల వరకు చెల్లించేందుకైనా సిద్ధం అంటూ గతంలో ఓ నైజరీయిన్ ముఠా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విధంగా ఇప్పుడు వాట్సప్ మోసం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకెళితే..

 

ఈ సినిమాపై జోకులను చూస్తే ఆ సినిమానే మరచిపోతారుఈ సినిమాపై జోకులను చూస్తే ఆ సినిమానే మరచిపోతారు

ఓ వ్యక్తి ఇంటర్నెట్ యాడ్ ద్వారా కిడ్నీ అమ్మాలని చూసి పోలీసులకు చిక్కాడు....

ఓ వ్యక్తి ఇంటర్నెట్ యాడ్ ద్వారా కిడ్నీ అమ్మాలని చూసి పోలీసులకు చిక్కాడు....

బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్ యాడ్ ద్వారా కిడ్నీ అమ్మాలని చూసి పోలీసులకు చిక్కాడు. Columbia Asia Hospitalలోని ఓ సీనియర్ డాక్టర్ పేరు మీద ఇంటర్నెట్లో కిడ్నీ కావాలనే ప్రకటన చూసిన అతను తనకు డబ్బులు అవసరం ఉందని కిడ్నీ అమ్ముతానని నన్ను సంప్రదించమని కోరాడు.

 కిడ్నీ దానం చేస్తే దాదాపు. 1.6 కోట్లను...

కిడ్నీ దానం చేస్తే దాదాపు. 1.6 కోట్లను...

ఈ యాడ్ లో కిడ్నీ దానం చేస్తే దాదాపు. 1.6 కోట్లను ఇస్తామని ఉంది. దీంతో బెంగుళూరుకు చెందిన వ్యక్తి కిడ్నీ అమ్మేందుకు రెడీ అయ్యారు. కాగా ఇతని పేరు MB Somashekarగా గుర్తించారు. ఇతను స్టెనో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నట్లు తెలిసింది.

 యాడ్ చూసిన తరువాత ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది...
 

యాడ్ చూసిన తరువాత ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది...

అతను యాడ్ చూసిన తరువాత ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Dr Arun Wesley David పేరు మీద ఈ యాడ్ వచ్చిందని అతను Columbia Asia Hospitalలో Renal Transplant Surgery HoDగా పనిచేస్తున్నట్లు యాడ్ లో దర్శనమిచ్చిందని ఆ వ్యక్తి తెలిపారు.

వీరిద్దరి మధ్యలో మరొక వ్యక్తి రాయబారం...

వీరిద్దరి మధ్యలో మరొక వ్యక్తి రాయబారం...

వీరిద్దరి మధ్యలో మరొక వ్యక్తి రాయబారం నడిపినట్లు అతను చెప్పిన విషయాలను బట్టి తెలుస్తోంది. హస్పిటల్ లో పనిచేస్తున్న Aprajita Dhal అనే transplant coordinator ఈ వ్యవహారాన్ని వాట్సప్ ద్వారా డీల్ చేసినట్లు తెలుస్తోంది.

 

 

వీరిద్దరి మధ్య వాట్సప్ ఛాటింగ్ జరిగిందని...

వీరిద్దరి మధ్య వాట్సప్ ఛాటింగ్ జరిగిందని...

వీరిద్దరి మధ్య వాట్సప్ ఛాటింగ్ జరిగిందని, వివిధ తేదీల్లో దీనికి సంబంధించిన డీల్ జరిగిందని పోలీసులకు అతను తెలిపిన విషయాల్లో తెలుస్తోంది. అయితే ఆ వెబ్ సైట్ పేరు యుఆర్ఎల్ మాత్రం బయటకు రాలేదు. అవి తనకు గుర్తులేదని అతను చెబుతున్నాడు.

కాగా ఈ విషయాన్ని చూసిన అసలు డాక్టర్...

కాగా ఈ విషయాన్ని చూసిన అసలు డాక్టర్...

కాగా ఈ విషయాన్ని చూసిన అసలు డాక్టర్ Dr Arun Wesley David ఖంగుతిన్నాడు. ఇదంతా మోసమని వాట్సప్ మెసేజ్ లతో నాకు సంబంధం లేదని ఇదంతా ఎవరో కావాలని చేశారంటూ కేసును ఫైల్ చేశారు.

సైబర్ క్రైం పోలీసులు...

సైబర్ క్రైం పోలీసులు...

సైబర్ క్రైం పోలీసులు Information Technology Act of 2000 ప్రకారం అండర్ సెక్షన్ 66(c),66(D)కింద కేసు నమోదు చేశారు. 120B (criminal conspiracy) 468 (forgery for purpose of cheating), 420 (cheating), 471 (using as genuine a forged document) వంటి సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.

సోషల్ మీడియాలో ఇటువంటి మోసాలు....

సోషల్ మీడియాలో ఇటువంటి మోసాలు....

సోషల్ మీడియాలో ఇటువంటి మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని లేకుంటే మోసగాళ్ల భారీన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ రాకెట్ ముఠాలు చాలానే ఉన్నాయని కాబట్టి వాటిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని వారు సూచిస్తున్నారు

Best Mobiles in India

English summary
Man falls for WhatsApp ad and tries to sell kidney for Rs 1.6 crore. This is what happened next.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X