ఒబామా ఫోటోతో నల్గొండ వాసి మొబైల్ కనెక్షన్!!

Posted By: Prashanth

ఒబామా ఫోటోతో నల్గొండ వాసి మొబైల్ కనెక్షన్!!

 

టెలికాం ఆపరేటర్లు తమ కనెక్షన్లను పెంచుకునే క్రమంలో నిబంధనలను గాలికొదేలుస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్దు నియామకం చేస్తున్న థర్డ్ పార్టీ సేల్స్ సిబ్బంది సరైన నిర్ధారణ పత్రాలు లేకుండానే కనెక్షన్లను కేటాయిస్తున్నారు. వీరి అలసత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ మన రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ఫోటోతో నల్గొండకు చెందిన ఓ వ్యక్తి మొబైల్ కనెక్షన్ పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ నివాసి ఎమ్.ప్రసాద్(21), అమెరికా అధినేత ఫోటోను

ఫ్రూఫ్‌గా సమర్పించి 9177523297 నెంబరు గల మొబైల్ కనెక్షన్‌ను పొందారు.

విషయం తెలుసుకుని రంగంలోకి దిగన నల్గొండ ఎస్పీ నవీన్ గులాటీ సదరు వ్యక్తి మొబైల్ కనెక్షన్‌ను నిలుపుదల చెయ్యటంతో పాటు విచారణకు ఆదేసించారు. కనెక్షన్ పొందే సమయంలో ప్రసాద్ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోకాపీని థర్డ్‌పార్టీ సేల్స్ సిబ్బందికి సమర్పించారు. విచారణ చేపట్టిన పోలీసు బృందం సదరు వ్యక్తి లైసెన్స్ నకిలీదిగా నిర్థారించింది.

ఈ విధమైన సంఘటనలు పునారవృతం కాకుండా టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నింబధనలను మరింత కఠినతరం చెయ్యాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలలోకి తెస్తే ఈ రకమైన లొసుగులను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కనెక్షన్ పొందేందుకు ఫిక్సుడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి సంబంధిత చందాదారు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting