ఏపీలో ఫోన్ పేలుడు కలకలం, నిండు ప్రాణం బలి
స్మార్ట్‌ఫోన్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని నిద్రిస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
స్మార్ట్‌ఫోన్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని నిద్రిస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరా్లోకెళితే.. వాగుపల్లికి చెందిన సంగు మస్తాన్‌రెడ్డి (31)కి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. పాక్షిక దివ్యాంగుడైన మస్తాన్ ఇంట్లోనే తినుబండారాల దుకాణం పెట్టుకొని జీవినం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న ప్లగ్ బాక్స్‌కు సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి.. దాన్ని పొట్టపై ఉంచుకొని నిద్రించాడు.
ఆ సమయంలో ఫోన్ పేలింది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మస్తాన్‌రెడ్డి ఇంట్లో నుంచి పొగలు, కాలిన వాసన రావడంతో స్థానికులు లోపలికెళ్లి చూడగా మస్తాన్‌రెడ్డి చనిపోయి ఉన్నాడు. కాగా... వాగుపల్లిలో సోమవారం రాత్రి విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు గృహాల్లో టీవీలు, లైట్లు కాలిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు. కాబట్టి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఎస్‌ఐ ఉప్పు శ్రీనువాసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మొబైల్ పేలకుండా ఉండాలంటే..
మొబైల్ పేలకుండా ఉండాలంటే ఎప్పుడైనా ఛార్జింగ్ 96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. 20 శాతం కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి. అలాగే మొబైల్‌కి పౌచ్ ఉంటే తీసేసి ఛార్జింగ్ పెట్టాలి. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే 5 లేదా 10 నిమిషాల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టాలి.

మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు
మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వైఫై, హాట్ స్పాట్, సాంగ్స్, నెట్, కాల్స్, గేమ్స్ పొరపాటున కూడా వాడకూడదు. మొబైల్‌కి వచ్చిన ఛార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ ఛార్జర్‌ని కొనుక్కుని వాడాలి. 100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను వాడకూడదు.

అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే..
మీకు అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే మొబైల్ ఫోన్స్ నుంచి తీసెయ్యాలి. కొన్ని గేమ్స్, అప్లికేషన్స్ వల్ల మొబైల్ విపరీతంగా హీట్ అవుతుంది. వాటిని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేసెయ్యాలి.

మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే..
మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే వీడియో కాల్, హెవీ గేమ్స్ ఆడకూడదు. ఛార్జింగ్ అయిన తరువాత మొబైల్ హీట్ అయితే 5 నిమిషాల వరకు మొబైల్‌ని పట్టుకోకూడదు.. ప్యాంట్ జేబులో కూడా పెట్టుకోకూడదు.

మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు..
మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్‌లో మొబైల్‌ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఉంది. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి చల్లబడ్డాక ఆన్ చేయాలి.

మొబైల్ బ్యాటరీ అయిపోతే ..
మీ మొబైల్ బ్యాటరీ అయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరి తీసుకొని మార్చాలి. కొంతమంది ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్‌లో సాంగ్స్ వింటుంటారు. అలా చేయడం వల్ల చాలా రిస్క్. ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.


Click it and Unblock the Notifications








