సిమ్ స్వాప్ : 6 మిస్డ్ కాల్స్ తో 1.86 కోట్లు నొక్కేశారు

|

ఈ కాలం లో సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోయారు . వీటికి తోడు సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేయడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చెయ్యడం, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్ చేయడంలాంటివి చేస్తున్నారు. అలాగే బ్యాంకు నుంచి చేస్తున్నామని చెప్పి , OTP లు తెలుసుకుని అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటిని పక్కన పెట్టి , కొత్తగా మళ్ళి ఒక కొత్త సైబర్ లూఠీ చేస్తున్నారు కేటుగాళ్లు.సిమ్ స్వాప్ అనే సైబర్ క్రైమ్ తో రెచ్చిపోతున్న సైబర్ దొంగలు.. క్షణాల్లో బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు.ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటే చోటు చేసుకుంది. ముంబై లోని ఒక బిజినెస్‌మ్యాన్‌కి అర్ధరాత్రి పూట ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయి అంతే బ్యాంక్ అకౌంట్లోని రూ.1.86 కోట్లు మాయమయ్యాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 

జనవరి 10న మార్కెట్లోకి రానున్న షియోమి 48మెగాపిక్స‌ల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌..!

ముంబైకి చెందిన షా టెక్స్‌టైల్ బిజినెస్ చేస్తుంటాడు....

ముంబైకి చెందిన షా టెక్స్‌టైల్ బిజినెస్ చేస్తుంటాడు....

ముంబైకి చెందిన షా టెక్స్‌టైల్ బిజినెస్ చేస్తుంటాడు. ఆయన మొబైల్ నంబర్‌కి కంపెనీకి చెందిన బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయ్యి ఉంది . డిసెంబర్ 27 అర్ధరాత్రి అతడి ఫోన్‌కు రెండు నంబర్ల నుంచి ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఉదయాన్నే లేచి ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నించగా కుదర్లేదు. దీంతో సిమ్ బ్లాక్ అయ్యిందని గుర్తించిన షా వెంటనే కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి ఆరా తీశాడు. అయితే వారు మాత్రం మీ రిక్వెస్ట్ మేరకే సిమ్ బ్లాక్ చేసి కొత్త సిమ్ ఇచ్చామని చెప్పారు. దీంతో వెంటనే బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్లోని బ్యాలెన్స్ ఎంతుందో కనుక్కోగా అప్పటికే రూ.1.86 కోట్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 ఖాతాలకు మళ్లించారు. బ్యాంక్ సిబ్బంది కష్టపడి రూ.20 లక్షలను వెనక్కి రాబట్టగలిగారు. మిగతా మొత్తాన్ని అప్పటికే విత్ డ్రా చేసేశారు. షా యూనిక్ సిమ్ నంబర్‌ను యాక్సెస్ చేసిన మోసగాళ్లు సిమ్ స్వాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

సిమ్ స్వాప్ ఎలా చేస్తారంటే..?

సిమ్ స్వాప్ ఎలా చేస్తారంటే..?

మీ మొబైల్ నెంబర్ బ్యాంకు అకౌంటుకి...

మీ మొబైల్ నెంబర్ బ్యాంకు అకౌంటుకి లింక్ అయ్యిందో లేదో హ్యాక్ చేయడం ద్వారా తెలుసుకుంటారు . మీ మెసేజులు చదివి బాలన్స్ వుందో లేదో తెలుసకుంటారు .

తమ దగ్గరున్న నెంబర్ల మొబైల్ నెట్ వర్క్...
 

తమ దగ్గరున్న నెంబర్ల మొబైల్ నెట్ వర్క్...

ఇక ఆ తరువాత తమ దగ్గరున్న నెంబర్ల మొబైల్ నెట్ వర్క్ ముందుగా జీరో లెవల్ కి తీసుకొస్తారు సైబర్ దొంగలు. నెట్ వర్క్ ఫెయిల్ అయిన తర్వాత కస్టమర్ కేర్ పేరుతో కాల్ వస్తుంది.

మీ మొబైల్ నెట్ వర్క్ లో ప్రాబ్లం...

మీ మొబైల్ నెట్ వర్క్ లో ప్రాబ్లం...

అది కూడా మీ మొబైల్ నెట్ వర్క్ లో ప్రాబ్లం ఉంది. కీ ప్యాడ్ లోని నెంబర్ 1 ను నొక్కమని వాయిస్ వినిపిస్తుంది. అది నిజమే అనుకొని 1ని ప్రెస్ చేస్తే మొబైల్ నెట్ వర్క్ ఒక్కసారిగా జీరో లెవల్ కి వెళ్తుంది.

 ఒక మాల్ వేర్ ని మొబైల్ కి పంపిస్తారు...

ఒక మాల్ వేర్ ని మొబైల్ కి పంపిస్తారు...

ఆ టైంలోనే ఒక మాల్ వేర్ ని మొబైల్ కి పంపిస్తారు. దీంతో మొబైల్లో ఉన్న డేటాతో పాటు అంతకుముందు చేసిన ట్రాన్ క్షాషన్స్ డీటైల్స్, OTPలు కూడా సైబర్ నేరగాళ్లకు వెళ్తాయి. దీంతో ఆ నెంబర్ తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ లను ఖాళీ చేస్తారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Man loses Rs 1.86 crore to missed calls: What you must know about this latest banking fraud.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X