Youtube టాస్క్‌లతో అదనపు ఆదాయం సంపాదించవచ్చని చెప్పారు... ఏకంగా రూ.56.7 లక్షలు దోచుకున్నారు..!
దేశంలో సైబర్ నేరాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని ఆశపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకొని అమాయకులకు వల వేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ తరహా ఘటనలో (Youtube Tasks Scam) 57 ఏళ్ల వ్యక్తి ఏకంగా రూ.56.7 లక్షల కోల్పోయారు.
హిందూ కథనం ప్రకారం ఈ నెల 10వ తేదీన పుత్తూరులో బుక్‌స్టోర్ నడుపుతున్న 57 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ టాస్క్‌లు చేయడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చన్నది ఆ మెసేజ్ సారాంశం. దీనిపై స్పందించిన బాధితుడు.. సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను వారికి పంపించారు.

అలా సైబర్ నేరగాళ్ల వలకు 57 ఏళ్ల వ్యక్తి చిక్కాడు. దీంతో మరింత నమ్మకం కలిగించే విధంగా సైబర్ నేరగాళ్లు వ్యవహరించారు. తొలుత రూ.123 మరియు రూ.492 చెల్లించి తాము చెప్పిన టాస్క్‌లు పూర్తిచేయాలని సూచించింది. అందుకు కొంత లాభాలను బాధితుడికి అందించారు. దీంతో సైబర్ నేరగాళ్లను పూర్తిగా నమ్మిన బాధితుడు.. వారు చెప్పిన విధంగా మరో టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు.
దీంతో తాము మరింత ఎక్కువ ఆధారం వచ్చేలా చేస్తామంటూ బాధితుడికి ఆశలు కల్పించారు. అందుకోసం కొంత నగదును డిపాజిట్ చేయాలని సూచించారు. అందుకు అంగీకరించిన బాధితుడు.. సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా.. వారి బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేశాడు. అనంతరం దీనిపై సుమారు రూ.52 వేల వరకు లాభాల రూపంలో తిరిగి పొందాడు.
దీంతో మరింత ఆశపడిన బాధితుడు.. తన అకౌంట్లు, స్నేహితుల అకౌంట్‌ల నుంచి నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు నగదు బదిలీ చేశాడు. అలా ఏకంగా రూ.56.7 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు అకౌంట్‌లకు బదిలీ చేశాడు. అయితే అందుకు సంబంధించిన లాభాలను వారు బాధితుడి అకౌంట్‌కు బదిలీ చేయలేదు.
అనంతరం సైబర్ నేరగాళ్ల ను సంప్రదించేందుకు 57 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం చేశాడు. వారు అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించ్చవచ్చనే ఆశతో అనేక మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. హోటల్ రివ్యూ, యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం వంటి టాస్క్‌ల పేరుతో మోసపోతున్నారు. వాట్సా్ప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే గుర్తుతెలియని నంబర్‌ల నుంచే మెసెజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ తరహా టాస్క్‌ల పేరుతో వచ్చే మెసేజ్‌లు నిజమో కాదో తెలుకొనేందుకు ప్రయత్నం చేయండి. దీంతోపాటు బ్యాంకు అకౌంట్ వివరాలు, UPI వివరాలు వెల్లడించకూడదు. ఎటువంటి అనుమానాస్పదంగా అనిపించినా, సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేయాలి.


Click it and Unblock the Notifications








