Home
News

PAN కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా.. ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

భారత్‌లో ప్రస్తుతం పాన్‌ కార్డు, ఆధార్‌, ఓటర్‌, రేషన్‌ సహా ఇతర కార్డులను సులభంగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయగలుగుతున్నాం. దీంతోపాటు అనేక ప్రభుత్వ సేవల వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా పూర్తి సమాచారాన్ని ఆయా శాఖల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ పరిస్థితిని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నెటిజన్లను మభ్యపెట్టి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్‌ లేదా ఇతర మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఓ సైబర్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా పాన్‌ కార్డు దరఖాస్తు (PAN Card) చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఏకంగా రూ.7.7 లక్షలు కాజేశారు. ఈ ఘటన కాన్పూర్‌లో జరిగింది.

man lost RS7 7 lakh during pan card online application

అమెరికాలో నివసిస్తున్న తన మనవడి కోసం ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ప్రయత్నం చేశారు. అయితే దరఖాస్తు సమయంలో వచ్చిన కొన్ని సందేహాలు వచ్చాయి. దీంతో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికి తీసుకున్నారు. అనంతరం ఆ నంబర్‌కు కాల్‌ చేసి, తమ సమస్యను వారికి వివరించారు.

కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జి్క్యూటివ్‌గా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు.. పాన్‌ కార్డు దరఖాస్తు చేసుకొనేందుకు మరో వ్యక్తికి చెందిన ఆధార్‌, పాన్‌, బ్యాంకింగ్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. నిజమైన అధికారులని భావించి.. సైబర్‌ నేరగాళ్లు కోరిన వివరాలు అందించారు.

అయితే కాసేపటికే అతని బ్యాంకు అకౌంట్ నుంచి రెండు లావాదేవీల్లో రూ.1,40,071 మరియు రూ.6,30,071 చొప్పున నగదు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు. చివరికి సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాన్‌ 2.0 కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంటే కొత్తగా వచ్చే కార్డులు QR కోడ్‌లను కలిగి ఉంటాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం పాన్ కార్డులు కలిగి ఉన్నవారు.. కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. పాత కార్డులు కూడా పనిచేస్తాయని స్పష్టం చేసింది.

పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే సమయంలో పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. NSDL, UTIITSL వంటి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేయాలి. నకిలీ వెబ్‌సైట్‌ల కారణంగా URL ను పూర్తిగా పరిశీలించండి. అనుమానాస్పదంగా అనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

దీంతోపాటు PAN కార్డుకు అప్లై చేసే సమయంలో బ్యాంకింగ్‌ వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ప్రభుత్వ అధికారులమంటూ వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారికి ఎటువంటి కీలక సమాచారం షేర్ చేయకూడదు.

ఏదైనా పొరపాటు కారణంగా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. లేదా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో అయిన ఫిర్యాదు చేయాలి. లేదా సైబర్ క్రైమ్ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
man lost RS7.7 lakh during pan card online application process and check how to avoid scams
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X