ఐఫోన్ ఆర్డర్ చేస్తే చెక్కలొచ్చాయ్!

Posted By:

పూణేకు చెందిన దర్శన్ కాబ్రా, ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద రెండు ఐఫోన్ 4ఎస్ యూనిట్‌లను ఆర్డర్ చేసాడు. అయితే, అతనుకు ఐఫోన్‌లకు బదులుగా చెక్క ముక్కలు అందాయి. అదృష్టవశాత్తూ దర్శన్ ‘క్యాష్ ఆన్ డెలివరీ' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటంతో డెలివరీ సిబ్బందికి డబ్బు చెల్లించాల్సిన పనిలేకుండా పోయింది.

ఐఫోన్ ఆర్డర్ చేస్తే చెక్కలొచ్చాయ్!


మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

పూణేలోని ఔంద్ ప్రాంతానికి చెందిన దర్శన్ డిసెంబర్ 7వ తేదీన ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద రెండు ఐఫోన్ 4ఎస్  యూనిట్‌లను ఆర్డర్ చేసారు. ఈ రెండు ఫోన్‌ల ఖరీదు రూ.40,508. ఫోన్‌లను బుక్ చేసుకునే సమయంలో ‘క్యాష్ ఆన్ డెలివరీ' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటంతో డిసెంబర్ 11న దర్శన్ ఇంటికి స్నాప్‌డీల్ డెలివరీ సిబ్బంది ఆర్డర్‌ను తీసుకువచ్చారు.

దర్శన్ వారి ముందే పార్శిల్‌ను తెరిచిచూడటంతో ఫోన్‌లకు బదులుగా చెక్క ముక్కలు పార్సిల్ బాక్స్‌లో కనిపించాయి. క్యాష్ ఆన్ డెలివరీ కావటంతో దర్శన్ సదరు స్నాప్‌డీల్ డెలివరీ బృందానికి డబ్బు చెల్లించలేదు.

source:Times of india

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Man orders iPhones, Snapdeal delivers pieces of wood. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot