ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే దాని జిరాక్స్ కాపీ పంపారు

Posted By:

 ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే దాని జిరాక్స్ కాపీ పంపారు

ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యవంతంగా ఉంది కదా అని ఓ షాపర్ ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ ఈబే‌లో ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేసారు. తీరా అక్కడ జరిగిందేంటంటే, వందల పౌండ్లు ఖరీదు చేసే ల్యాప్‌టాప్‌కు బదులుగా ఓ జిరాక్స్ కాపీ మాత్రమే ఆ వ్యక్తికి అందింది. పాల్ బారింగ్‌టన్ (38) ఓ ఆక్షన్‌లో £1,500 విలువ చేసే టాప్ రేంజ్ యాపిల్ మాక్‌బుక్‌ను £300కు సొంతం చేసుకున్నారు. అయితే ఆ సంతోషం కొద్ది రోజులు కూడా మిగల్లేదు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఇంటికి వచ్చిన తన ఆర్డర్‌ను ఎంతో ఆత్రుతతో తెరిచి చూసిన బారింగ్‌టన్ చూసిన ఆ ప్యాకింగ్‌లో ల్యాప్‌టాప్‌కు బదులుగా జిరాక్స్ కాపీ ఉండటాన్ని చూసి బిత్తరపోయాడు. పాల్ ఈ  ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసేందుకు తన సర్ప్ బోర్డ్‌ను కూడా అమ్మేసాడు. ఈ ఘటన పై ఈబే అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ పాల్ బారింగ్‌టన్ సంఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు సంబంధించిన కారణాలను క్షున్నంగా దర్యాప్తు చేస్తున్నామని త్వరలో పాల్‌కు నగదును రీఫండ్ చేస్తామని ఆయన తెలిపారు.

English summary
Man orders laptop on eBay and gets a photocopy of it instead. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot