రూ.35 వేల ఫోన్ బుక్ చేస్తే మైండ్ బ్లైండయ్యే గిఫ్ట్ వచ్చింది

|

మాతృదినోత్సవం సందర్భంగా కన్నతల్లికి బహుమతి ఇద్దామనుకుని బిడ్డకు ఓ ఈ కామర్స్ సైట్ దిమ్మతిరిగే షాకిచ్చింది. తల్లికి గిఫ్ట్ కోసం ఆన్‌లైన్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేసి రూ. 34,999ను డెబిట్ కార్డు ద్వారా కట్టిన ఢిల్లీ యువకుడికి పార్సిల్ కింద బండరాళ్లు వచ్చాయి. దీంతో కస్టమర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషాద ఘటన ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే, మానస్ సక్సేనా అనే యువకుడు ఆన్ లైన్లో ఓ ఈ-కామర్స్ సంస్థను సంప్రదించి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చి డబ్బు కట్టాడు.

 

ఆండ్రాయిడ్ ఫోన్లకు అసలైన సవాల్, జియోఫోన్‌‌కు గూగుల్ ఫీచర్లుఆండ్రాయిడ్ ఫోన్లకు అసలైన సవాల్, జియోఫోన్‌‌కు గూగుల్ ఫీచర్లు

రూ.35 వేల ఫోన్ బుక్ చేస్తే మైండ్ బ్లైండయ్యే గిఫ్ట్ వచ్చింది

డెలివరీ అయిన తరువాత ఫోన్ ను ఓపెన్ చేయకుండా అలాగే తీసుకెళ్లి తల్లికి బహుమతిగా ఇచ్చాడు. దాన్ని విప్పి చూడగా రాళ్లు కనిపించాయి. దీంతో ఖంగుతిన్న ఆ యువకుడు, ఫోన్ లో ఈ-కామర్స్ సైట్ ను సంప్రదించగా, తమ తప్పులేదని, ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు తీసుకున్న తరువాత, డెలివరీ బాయ్ తప్పు కూడా లేదని సదరు సంస్థ తేల్చడంతో, వసంత్ కుంజ్ పోలీసులను ఆశ్రయించాడు మానస్. కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

ఆన్ లైన్ మోసాలను ఈ విధంగా అరికట్టవచ్చు..

క్యాష్‌ ఆన్‌ డెలివరీ

క్యాష్‌ ఆన్‌ డెలివరీ

ఆన్‌లైన్‌ షాపింగ్‌పై అవగాహన లేకుంటే వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచింది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా లావాదేవీలు చేయకూడదు.

సెక్యూరిటీ గల ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో

సెక్యూరిటీ గల ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో

సెక్యూరిటీ గల ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో మాత్రమే షాపింగ్‌ చేయడం శ్రేయస్కరం. ఫిషింగ్‌ మెయిళ్లు, లింక్‌లకు స్పందించవద్దు. బ్యాకింగ్‌ లావాదేవీలు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను అందులో పంచుకోవద్దు.

ఎల్లప్పుడు అప్‌డేట్‌

ఎల్లప్పుడు అప్‌డేట్‌

పర్సనల్‌ కంప్యూటర్‌లో యాంటీ వైరస్‌, యాంటీ స్పైవేర్‌, ఫైర్‌వాల్‌ సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. సిస్టం ఎల్లప్పుడు అప్‌డేట్‌ అయ్యేవిధంగా చూసుకోవాలి. మార్కెట్లో నమ్మకమున్న సైట్లలోనే షాపింగ్‌ చేయాలి.

వస్తువును కొనుగోలు చేసేటప్పుడు
 

వస్తువును కొనుగోలు చేసేటప్పుడు

ఆన్‌లైన్‌లో ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ గురించి తెలుసుకోవాలి. దాని ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌ తదితర ప్రాథమిక వివరాలపై అవగాహన కలిగిఉండాలి. కొనుగోలు చేసే సైట్‌కు మిగతా సైట్లకు తారతామాన్ని గుర్తించాలి. తక్కువ ధర చూసి మోసపోవద్దు.

హెచ్‌టీటీపీఎస్‌

హెచ్‌టీటీపీఎస్‌

కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌జాక్షన్‌ చేసేటప్పుడు అడ్రస్‌ బార్‌లో హెచ్‌టీటీపీఎస్‌ ఉండాలి. ఒక హెచ్‌టీటీపీ అని ఉంటే ఆ సైట్‌ అంత సెక్యూర్డ్‌ కాదు.

వివరాలను..

వివరాలను..

లావాదేవీలకు సంబంధించిన వివరాలను ప్రింట్‌ లేదా స్ర్కీన్‌షాట్‌ తీసుకుని భద్రపరుచుకోవాలి. వస్తువు ధర, కొనుగోలు చేసినట్లు ధ్రువీకరించిన పత్రం, నియమ నిబంధనలను కచ్చితంగా ప్రింట్‌ తీయాలి. ఒక వేళ మోసపోతే వీటి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

లావాదేవీ పూర్తవగానే..

లావాదేవీ పూర్తవగానే..

ఒక వస్తువు కొనుగోలు లావాదేవీ పూర్తవగానే క్రెడిట్‌, డెబిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌ చూసుకోవాలి. అధికంగా నగదు డెబిట్‌ అయినా, ఇతర చార్జీలు విధించినా ఈ-కామెర్స్‌ సైట్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి.

వెబ్‌ బ్రౌజర్‌ కుకీస్ ను

వెబ్‌ బ్రౌజర్‌ కుకీస్ ను

ఆన్‌లైన్‌ కొనుగోలు చేసిన తర్వాత వెబ్‌ బ్రౌజర్‌ కుకీస్ ను క్లియర్‌ చేయాలి. కంప్యూటర్‌ను కూడా టర్న్‌ ఆఫ్‌ చేయాలి. సిస్టమ్‌కు ఇంటర్‌నెట్‌ కనెక్టయి ఉండడం వల్ల సైబర్‌ ఛీటర్లు వ్యక్తిగత సమాచారాన్ని దోచేసే ప్రమాదం ఉంది.

Best Mobiles in India

English summary
Customer Gets Marbles Instead of Oneplus 6 After Online Purchase More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X