ప్రియురాలిని బేరం పెట్టిన ప్రియుడు, ebayలో వైరల్ అయిన లిస్టింగ్!
వాళ్లిదరి మధ్య చోటు చేసుకున్న చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలో మారి ఇంటర్నెట్ అంతటా వైరల్‌గా మారిపోయింది.
వాళ్లిదరి మధ్య చోటు చేసుకున్న చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలో మారి ఇంటర్నెట్ అంతటా వైరల్‌గా మారిపోయింది. తనను కొట్టిందన్న కారణంగా ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసాడు. eBay సేల్‌లో వైరల్ అయిన ఈ లిస్టంగ్‌ను 24 గంటల్లో 81,000 మంది వీక్షించటంతో పాటు 68 లక్షల వరకు వెచ్చించి ఆమెను సొంతం చేసుకునేందుకు 100 వరకు బిడ్‌లు దాఖలయ్యాయట.

యూజడ్ కార్ అంటూ..
Metro UK రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం, డేల్ లీక్స్ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ పై కోపంతో ఈ లిస్టింగ్‌ను క్రియేట్ చేసాడు. పోస్ట్ డిస్ర్కిప్షన్‌లో యూజడ్ కార్ పేరుతో ఆమెను సంబోధించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ కెల్లీ గ్రీవ్స్ర్ ఓ రైడింగ్ షాపులో అందరి ముందు తనను పిరుదుల పై తన్నిందని, ఈ కారణంగానే తన పై కోపం పెంచుకుని ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని పూనుకున్నానని లీక్స్ తెలిపాడు.

మనుషులను విక్రయించటం చట్టవిరుద్థం..
ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన ఈ లిస్టింగ్‌ను సైట్‌లో పోస్ట్ అయిన కొద్ది గంటల తరువాత eBay తొలగించింది. మానవ శరీరం భాగాలతో పాటు ఇతర అవశేషాలను తమ వెబ్‌సైట్‌లో విక్రయించటం పూర్తిగా విరుద్ధమని ఈబే తెలిపింది. డేల్ లీక్స్ చేసిన ప్రాంక్‌ను సోషల్ మీడియా యూజర్లు తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంటే, డేల్ కెల్లీ జంట మాత్రం ఈ వ్యవహారాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది.

రెస్సాన్స్ చూసి షాక్ తిన్నాం..
కెల్లీని ఈబేలో అమ్మకానికి పెట్టిన తరువాత నవ్వు ఆపుకోలేపోయాను, ఎందుకు ఊరికే నవ్వుతున్నవంటూ కెల్లీ నన్ను నిలదీసింది. ఆ తరువాత జరిగినదంతా చెప్పేసాను. తొలత ఈ విషయాన్ని ఆమె లైట్‌గా తీసుకుంది, ఆ తరువాత యూరోప్, అమెరికా ఇంకా ఆస్ట్రేలియాల నుంచి మెసేజెస్ రావటాన్ని చూసి ఇద్దరం పూర్తిగా షాక్ తిన్నామని డేల్ తెలిపారు.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు..
గతంలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షడు నవాజ్ షరీఫ్ కూడా ఈబేలో అమ్మకానికి వచ్చారు. ఆయన ఈబేలోకి రావడం ఏందీ అని అశ్చర్యపోతున్నారా..ఈబేలో ఆయన ఫోటో పెట్టి ఈయన్ని అమ్మబడును అంటూ ప్రకటన ఇచ్చారు. అంతే కాకుండా పనికిరాని నవాజ్ షరీఫ్‌ని ఎవరైనా కొనుగోలు చేయానులనుకుంటే కొనుగోలు చేయవచ్చంటూ అక్కడ మెసేజ్ కూడా పెట్టారు. ఈయన ధరను రూ.63 లక్షలుగా ఫిక్స్ చేసారు.


Click it and Unblock the Notifications








