అడల్ట్ వెబ్సైట్లలో బాస్ ఫోన్ నెంబర్ ఉంచిన ఉద్యోగి! ఎందుకో తెలిస్తే....!

By Maheswara
|

ఈ లాక్ డౌన్ కారణంగా సాధారణ కూలి నుండి ఆఫీసుల్లో కూర్చొని పనిచేసే ఉద్యోగస్తులవరకు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు.ఇలాంటి సమయాలలో ఉద్యోగస్తులకు అయితే ఆదుకునేందుకు ప్రోవిడెంట్ ఫండ్ డబ్బు ఉంటుంది.అలాంటి ప్రోవిడెంట్ ఫండ్ డబ్బు పై ఆశలు పెట్టుకున్న ఒక వ్యక్తి ,తన ప్రావిడెంట్ ఫండ్ ను క్లియర్ చేయడంలేదని తన యజమానిపై మండిపడ్డాడు.ఇది అతని పాలిట ఎలాంటి మలుపులు తిరిగిందో చదవండి.

మహమ్మారి తర్వాత చెల్లింపు
 

మహమ్మారి తర్వాత చెల్లింపు

బెంగళూరు లో రియాల్టీ కమ్ కాఫీ ట్రేడింగ్ కంపెనీలో ఉద్యోగి గా పనిచేస్తున్న హరిప్రసాద్ జోషి అనే వ్యక్తి తన యజమాని అయిన అవినాష్ ప్రభు పై తన కోపాన్ని ప్రదర్శించాడు.

చాలా కాలంగా, జోషి తన పిఎఫ్ మొత్తాన్ని విడుదల చేయమని తన యజమానిని కోరుతున్నాడు. అయితే, లాక్డౌన్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని ప్రభు, జోషికి చెప్పారు.

చెల్లింపు చేస్తామని బాస్ హామీ

చెల్లింపు చేస్తామని బాస్ హామీ

మునుపటి బిజినెస్ హెడ్ కూడా అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ మహమ్మారి ముగిసిన తర్వాత చెల్లింపు చేస్తానని ప్రభు జోషికి హామీ ఇచ్చాడు.

అయినప్పటికీ, జోషికి డబ్బు అవసరం ఉన్నందున వేచి ఉండటానికి ఇష్టపడలేదు. గత కొన్ని వారాలలో, వారి టెలిఫోనిక్ సంభాషణల సమయంలో ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది.

బాస్ ఉద్యోగిని బెదిరించాడు

బాస్ ఉద్యోగిని బెదిరించాడు

వాదనల సమయంలో, ప్రభు తాను జోషికి డబ్బు చెల్లించనని పేర్కొన్నాడు మరియు అతను చేయగలిగినది చేసుకోమని బెదిరించాడు.దీనితో ఆవేశానికి గురియైన జోషి తానూ కూడా తనయాజమానికి బెదిరింపు ఫోన్లు చేయడం ప్రారంభించాడు.

ఫోన్ నంబర్లను డేటింగ్ వెబ్‌సైట్లలో
 

ఫోన్ నంబర్లను డేటింగ్ వెబ్‌సైట్లలో

తనకు,భార్య కు మరియు పిల్లలకు అసంబద్ధమైన, అసహ్యకరమైన ఇమెయిల్‌లను పంపాడని ఆరోపించారు. అతను వారి ఫోన్ నంబర్లను డేటింగ్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడని మరియు వారి పేర్లలో సెక్స్ బొమ్మలను కూడా ఆర్డర్ చేశాడు అని ప్రభు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు జోషిపై కేసు నమోదు చేసి, అతనిపై భారత శిక్షాస్మృతి (ఐపిసి) తో పాటు ఐటి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతను ఉపయోగించిన మొబైల్ నంబర్ ద్వారా నిందితులను ట్రాక్ చేస్తామని పోలీసులు తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Man Shared His Boss Phone Number For Escort Services, Read why ? 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X