Home
News

AIతో ఒక్క రాత్రిలోనే 1000 ఉద్యోగాలకి అప్లై.. తెల్లారేసరికి షాకింగ్ ఫలితాలు..

By Ram Kumar

ఇంటర్నెట్ ప్రపంచంలో AI సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా AI సత్తాను చాటే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నెటిజన్ తన ఉద్యోగ వేటలో విప్లవాత్మక మార్పులు చేశాడు.

AI సహాయంతో రాత్రికి రాత్రే ఏకంగా 1,000 ఉద్యోగాలకి దరఖాస్తు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నిద్ర లేచేసరికి అతనికి దాదాపు 50 ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు వచ్చాయి. దాంతో ఆశ్చర్య పోవడం అతడి వంతయింది. అంతేకాదు, ఈ విషయం రెడిట్‌ వేదికగా పంచుకున్నాడు. అతని రెడిట్‌ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Man Uses AI to Apply to 1 000 Jobs Overnight  Wakes Up to Stunning Results

* అసలు ఏం జరిగిందంటే..

సదరు వ్యక్తి ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత బాట్‌ను అభివృద్ధి చేశాడు. ఈ బాట్‌ అతడి ప్రొఫెషనల్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ విశ్లేషించి మరీ ఉద్యోగ ప్రకటనలకు సరిపోల్చింది. అంతేకాదు, ఒక్కో ఉద్యోగానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా సీవీ (Curriculum Vitae), కవర్ లెటర్‌ను రూపొందించింది.

రిక్రూటర్లు అడిగే సాధారణ ప్రశ్నలకు కూడా ఈ బాట్‌ సమాధానాలు ఇచ్చేలా ప్రోగ్రామ్ చేశాడు. ఆటోమేటిక్‌గా అప్లికేషన్లను సబ్మిట్ చేసే బాధ్యత కూడా దీనిదే. చాలా కంపెనీలు ఉద్యోగాల కోసం వచ్చే దరఖాస్తులను ఆటోమేటిక్‌గా స్క్రీనింగ్ చేసే విధానాన్ని అనుసరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, ఈ ఏఐ బాట్‌ అతడి అప్లికేషన్లను సులువుగా ఆ స్క్రీనింగ్ టెస్ట్స్ క్లియర్ చేసేలా చేసింది. ఈ టెస్టులన్నీ క్లియర్ చేయాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. అలాంటిది ఈ AI బాట్ మాత్రం సింగిల్ నైట్ లో పూర్తి చేసి అతడికి ఎంతో టైమ్‌ సేవ్ చేసింది.

* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీ రోల్

ప్రస్తుతం ఉద్యోగ నియామక ప్రక్రియలో ఏఐ పాత్ర పెరుగుతోంది. కంపెనీలే కాదు, ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు కూడా ప్రక్రియలను సులభతరం చేసుకోవడానికి ఆటోమేషన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, AI సామర్థ్యాలు ఉపయోగిస్తే కెరీర్ ఇంట్రాక్షన్స్‌లో హ్యూమన్ టచ్ తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, AI సామర్థ్యాలతో పాటు హ్యూమన్ వాల్యూస్, క్రియేటివిటీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ రెడిట్‌ యూజర్ అభిప్రాయపడ్డాడు. అప్పుడే అర్థవంతమైన పని వాతావరణాన్ని మనం కొనసాగించగలమని ఆయన సూచించాడు.

* నెటిజన్ల రియాక్షన్

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు తెరలేపింది. కొందరు ఉద్యోగ దరఖాస్తుల కోసం AIని ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కంపెనీలు రెజ్యూమ్‌లను స్క్రీన్ చేయడానికి AIని ఉపయోగిస్తుంటే, దరఖాస్తుదారులు ఏఐని ఉపయోగించడం ద్వారా పోటీని సమం చేయవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఇంకొందరు ఈ పద్ధతిని తాము కూడా ట్రై చేస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే, నియామక పద్ధతులు ఎక్కువగా ఆటోమేషన్‌పై ఆధారపడటం సరికాదని కొందరు విమర్శించారు.

ఏది ఏమైనా, ఈ సంఘటన ఉద్యోగ వేటలో ఏఐ అబ్బురపరిచే సామర్థ్యాన్ని బయటపెట్టింది. నిరుద్యోగులు శ్రమ లేకుండా అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇది పనికొస్తుందని తెలిసిపోయింది. మున్ముందు రిక్రూట్మెంట్ డొమైన్‌లో ఏఐ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Man's AI-powered application to 1,000 jobs yielded 50 interviews, showcasing technology's disruptive impact on recruitment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X