రీఛార్జ్‌లు, షాపింగ్, మనీ ట్రాన్స్‌ఫర్ అన్నీ ఒకే యాప్‌లో.. మైజియో ఉంటే ఇక తిరుగులేదు..!
MyJio app: రిలయన్స్ జియోకు చెందిన మైజియో (MyJio) యాప్ కేవలం టెలికాం సర్వీసుల యాప్ మాత్రమేనని చాలామంది అనుకుంటారు, రీఛార్జ్‌లకే పరిమితమని భావిస్తారు కానీ మీ రోజువారీ పనుల్ని సులభతరం చేసే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఫ్రీగా అందుబాటులో ఉన్న ఈ యాప్.. మామూలు రీఛార్జ్‌ల కంటే ఎక్కువే ఆఫర్ చేస్తుంది. మైజియో యాప్‌లో ఉన్న టాప్ ఫీచర్లు ఏంటో చూద్దాం.
* UPI పేమెంట్స్
గూగుల్ పే, ఫోన్‌పే లాగానే మైజియో యాప్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు, తీసుకోవచ్చు. జియో పేమెంట్స్ బ్యాంక్ పవర్ తో ఇది పనిచేస్తుంది. ట్రాన్సాక్షన్లు కూడా ఫ్రీ. ఒక కొత్త UPI ఐడీ క్రియేట్ చేసుకుంటే చాలు. దాన్ని మీ బ్యాంకు అకౌంట్‌కి లింక్ చేసుకోవచ్చు. సింపుల్‌గా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

* రీఛార్జ్ గురించి చింత లేదు..
జియో ప్రీపెయిడ్ నంబర్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, పోస్ట్‌పెయిడ్ బిల్లులు కట్టాలన్నా ఈ యాప్ ద్వారా పని సులభంగా చేసుకోవచ్చు. జియో ఫైబర్, ఎయిర్‌ఫైబర్ రీఛార్జ్‌లు కూడా చేసుకోవచ్చు. అదీ కూడా అదనపు ఛార్జీలు లేకుండా. మీ నంబర్‌నే కాదు.. మీ ఫ్రెండ్స్ నంబర్లను కూడా సెకన్లలో రీఛార్జ్ చేయొచ్చు.
* కాలర్ ట్యూన్స్ కూడా ఫ్రీ
ఇంకో ఫీచర్ ఏంటంటే.. మైజియో యాప్‌లో ఫ్రీగా కాలర్ ట్యూన్స్ పెట్టుకోవచ్చు. వాటినే జియోట్యూన్స్ అంటారు. జియోసావన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక చిన్న చిక్కు ఉంది. ట్యూన్ నెల రోజుల్లో ఎక్స్‌పైర్ అవుతుంది. మళ్లీ యాప్‌లోనే రీయాక్టివేట్ చేసుకోవాలి.
* 100GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్..
మైజియో యాప్‌లో ఏకంగా 100GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నారు. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా ఇంత ఫ్రీ స్టోరేజ్ ఇవ్వవు. మీ ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైల్స్ అన్నీ భద్రంగా దాచుకోవచ్చు. మీ డేటా సురక్షితంగా ఉండాలంటే ఇది మంచి ఆప్షన్.
* స్పామ్ కాల్స్‌కి టాటా..
ఇష్టం లేని ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లతో విసిగిపోయారా, మీకోసం మైజియో యాప్‌లో 'డు నాట్ డిస్టర్బ్' (DND) ఫీచర్ ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు. స్పామ్ కాల్స్‌కి చెక్ పెట్టొచ్చు. కావాలంటే కొన్ని రకాల స్పామ్‌లను బ్లాక్ చేసుకోవచ్చు, ముఖ్యమైన కాల్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. సులభమైన కంట్రోల్స్ ఇందులో ఉన్నాయి.
* జియో ఫైబర్, ఎయిర్‌ఫైబర్ కనెక్షన్..
జియో ఫైబర్, ఎయిర్‌ఫైబర్ యూజర్లకు ఇది మంచి ఫీచర్. మీ కనెక్షన్‌ను మైజియో యాప్ ద్వారానే మేనేజ్ చేయొచ్చు. ప్లాన్స్ చెక్ చేసుకోవచ్చు, సబ్‌స్క్రిప్షన్ మార్చుకోవచ్చు. ఇల్లు మారితే కనెక్షన్ కూడా వేరే చోటికి మార్చుకోవడానికి రిక్వెస్ట్ పెట్టొచ్చు. అన్నీ యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి.
* జియోమార్ట్ షాపింగ్
జియోమార్ట్ షాపింగ్ చేయాలంటే.. ఇంకో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పనిలేదు. మైజియో యాప్‌లోనే జియోమార్ట్ ఉంది. కిరాణా సామాన్లు, ఎలక్ట్రానిక్స్, ఇంటికి కావాల్సిన వస్తువులు.. అన్నీ ఇక్కడ దొరుకుతాయి. పైగా డెలివరీ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. ఇవే మైజియో యాప్‌లో ఉన్న కొన్ని టాప్ ఫీచర్లు. ఎక్కువ యాప్ వద్దు వాళ్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








