కర్ణాటక సీఎంపై అసభ్యకర పోస్టు, పోలీసుల అదుపులో యువకుడు

నేటి యువతకు సోషల్‌ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు. ఇక స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక సోషల్ మీడియా లో క్షణక్షణం అప్‌డేట్లు చేయటం ఓ అలవాటుగా మారిపోయింది.

By Anil
|

నేటి యువతకు సోషల్‌ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు. ఇక స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక సోషల్ మీడియా లో క్షణక్షణం అప్‌డేట్లు చేయటం ఓ అలవాటుగా మారిపోయింది.ఇక్కడివరకు అంత బాగానే ఉన్న కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాను చాలా మిస్ యూజ్ చేస్తున్నారు. పేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు trolls పేజీలు కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తుంటాయి. ముక్యంగా సినిమా హీరోల trolls రాజకీయనాయుకుల trolls ఎక్కువుగా కనిపిస్తుంటాయి. హీరో సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు లేదా రాజకీయనాయకులు వారు చేసిన పని నచ్చకపోయినప్పుడు వారిని టార్గెట్ చేస్తూ పేస్ బుక్ లో trolls చేస్తూనే ఉంటారు. అయితే రెండు రోజుల క్రితం మంగళూరు కు చెందిన ఓ కుర్రాడు Kudla Trolls పేజీ లో కర్ణాటక ముఖ్య మంత్రి కుమార స్వామి ని టార్గెట్ చేస్తూ అనేక పోస్ట్ లు చేసి జైలు పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే....

24 ఏళ్ళ ప్రశాంత్ పూజారీ ......

24 ఏళ్ళ ప్రశాంత్ పూజారీ ......

మంగళూరుకు చెందిన 24 ఏళ్ళ ప్రశాంత్ పూజారీ పేస్ బుక్ లోని Kudla Trolls పేజీకి administrator.అయితే కర్ణాటక పోలీసు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం మంగళూరులో ఈ కుర్రాడ్ని అరెస్ట్ చేసారు.

టార్గెట్ చేయడానికి గల కారణం....

టార్గెట్ చేయడానికి గల కారణం....

రాష్ట్ర బడ్జెట్ మరియు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ల పై ప్రజలకు సరైన సమాధానం ఇవ్వని కారణంగా కర్ణాటక ముఖ్య మంత్రి కుమార స్వామి ని టార్గెట్ చేస్తు పేస్ బుక్ లోని Kudla Trolls పేజీ లో చాలా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్ట్ చేసాడు.

 

 

సుయో మోటు కేసును నమోదు చేసి....
 

సుయో మోటు కేసును నమోదు చేసి....

అయితే ఈ పోస్ట్ అల్లర్లకు ప్రేరిపించే విదంగా ఉన్నాయి అని అందువల్ల ప్రశాంత్ పూజారీ పై సుయో మోటు కేసును నమోదు చేసాము అని ఒక CCB అధికారు తెలిపారు.అలాగే ఐపిసి 153 సెక్షన్(అల్లర్లకు దారి తీసే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం) మరియు 504 (శాంతి ఉల్లంఘనను ప్రేరేపించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానపరచడం) కింద అరెస్ట్ చేసారు.

2016లో అప్పటి ముఖ్య మంత్రి  సిద్ది రామయ్య యొక్క.......

2016లో అప్పటి ముఖ్య మంత్రి సిద్ది రామయ్య యొక్క.......

ఒక ముఖ్య మంత్రి ని పేస్ బుక్ లో ట్రాల్ చేస్తూ అరెస్ట్ అవ్వడం కర్ణాటక లో ఇది రెండవసారి. మొదటి సారి 2016లో విజయపుర కు చెందిన అమరేశ్ వాళి అప్పటి ముఖ్య మంత్రి సిద్ది రామయ్య యొక్క ఫోటోను అవమానకరంగా మార్చి ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం వల్ల అరెస్ట్ చేయడం జరిగింది.

 

 

 

Best Mobiles in India

English summary
mangaluru-man-arrested-derogatory-fb-post-against-cm-kumaraswamy.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X