Home
News

ఇండియా కుర్రాడు వాట్సప్‌లో బగ్ పట్టాడు,భారీ బహుమానం కొట్టాడు

By Gizbot Bureau

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ లో యూజర్ ప్రయివసీకి భంగం కలిగించే ఓ బగ్ ని కనిపెట్టిన మణిపూర్ కుర్రోడు జోలెన్ సౌగాజం ప్రతిభను ఫేస్ బుక్ గుర్తించింది. ఈ బగ్ కనుగొన్నందుకు గానూ 22 ఏళ్ల సివిల్ ఇంజినీర్‌ జోనెల్ సౌగాయిజంకు ఫేస్‌బుక్ సంస్థ 5000 డాలర్లు బహుమానం ప్రకటించింది. అంతేకాదు ఆయన పేరును ఫేస్‌బుక్ హాల్‌ఆఫ్ ఫేమ్‌ 2019లో చేర్చింది.

ఇండియా కుర్రాడు వాట్సప్‌లో బగ్ పట్టాడు,భారీ బహుమానం కొట్టాడు

మొత్తం 94 మందికి హాల్‌ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించగా అందులో జోనెల్ స్థానం 16గా ఉంది. ఇది వరకే కేరళలోని అళపుజకు చెందిన 19 ఏళ్ళ విద్యార్థి కె.ఎస్.అనంతకృష్ణకు కూడా వాటసప్ బగ్ కనుగొన్నందుకు గానూ ఫేస్‌బుక్ 34 వేల నగదు బహుమతితో బాటు ప్రతిష్టాత్మక ' హాల్ ఆఫ్ ఫేమ్ ' లో ఇతనికి చోటు కల్పిస్తామని హమీ కూడా ఇచ్చింది. ఇప్పుడు మణిపూర్ కుర్రోడికి కూడా ఆఫర్ దక్కింది.

 ఆడియో కాల్‌ను వీడియో కాల్‌లోకి

ఆడియో కాల్‌ను వీడియో కాల్‌లోకి

వాట్సప్ యాప్‌లో వాయిస్ కాల్ సందర్భంగా రిసీవర్‌కు తెలియకుండానే లేదా వారి ఆమోదం లేకుండానే ఈ బగ్ కాలర్ ఆడియో కాల్‌ను వీడియో కాల్‌లోకి మార్చడాన్ని జోనెల్ కనుగొన్నాడు. ఆ సమయంలో రిసీవర్ ఏమి చేస్తున్నాడో వీడియో ద్వారా స్పష్టంగా కనిపించేది. అంటే ఇది వ్యక్తిగత నిబంధనలు అతిక్రమించడమే అని జోనెల్ వెల్లడించాడు. ఈ బగ్‌ను కనుగొన్న వెంటనే ఫేస్‌బుక్‌ సంస్థకు తెలిపినట్లు వెల్లడించాడు.మార్చిలో ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు జోనెల్ తెలిపాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీమ్ ఈ సమస్యను 15 నుంచి 20 రోజుల్లో చక్కబెట్టింది.

5వేల డాలర్లు బహుమానం

5వేల డాలర్లు బహుమానం

జోనెల్ తమ దృష్టికి తీసుకొచ్చిన బగ్‌పై బాగా స్టడీ చేసి 5వేల డాలర్లు బహుమానంగా ఇవ్వాలని భావించినట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ-మెయిల్ ద్వారా తనకు సమాచారం పంపినట్లు జోనెల్ ధృవీకరించాడు. తన రిపోర్టును ఫేస్ బుక్ సెక్యూరిటీ టీమ్ ఆమోదించి.. ఈ బగ్ విషయంలో తగు ‘ సవరణలు ‘ చేసిందని వెల్లడించాడు. ఇతనికి ఈ-మెయిల్ పంపుతూ.. 5 వేల యుఎస్ డాలర్ల బహుమతిని పంపుతున్నట్టు, ఇతని పేరును ఫేస్ బుక్ హౌస్ అఫ్ ఫేమ్ లిస్టులో చేర్చుతున్నట్టు ప్రకటించింది.

19 ఏళ్ళ విద్యార్థి కె.ఎస్.అనంతకృష్ణ

19 ఏళ్ళ విద్యార్థి కె.ఎస్.అనంతకృష్ణ

కేరళలో అళపుజకు చెందిన 19 ఏళ్ళ విద్యార్థి కె.ఎస్.అనంతకృష్ణకు ఫేస్ బుక్ ధన్యవాదాలు తెలిపింది. వాట్సాప్ లో యూజర్ కి తెలియకుండానే అతని ఫైళ్లను, సమాచారాన్ని ఇతరులు పూర్తిగా తొలగించే ఓ బగ్ ను ఈ కుర్రాడు కనుగొన్నాడు. బీటెక్ స్టూడెంట్ అయిన అనంతకృష్ణ .. ఈ బగ్ గురించి ఫేస్ బుక్ కి తెలియజేసి.. దీనికి పరిష్కార మార్గాన్ని కూడా వివరించాడట.

 80 వ స్పాట్ లో అనంతకృష్ణ పేరు

80 వ స్పాట్ లో అనంతకృష్ణ పేరు

దీనిపై రెండు నెలల పాటు నిశితంగా అధ్యయనం చేసిన ఫేస్ బుక్ ఇతని తెలివికి ఆశ్చర్యపోయి.. అతడ్ని సత్కరించాలని నిర్ణయించింది. అనంతకృష్ణకు 34 వేల నగదు బహుమతితో బాటు ప్రతిష్టాత్మక ‘ హాల్ ఆఫ్ ఫేమ్ ‘ లో ఇతనికి చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది ఫేస్ బుక్ థ్యాంక్స్ లిస్టులోని 80 వ స్పాట్ లో అనంతకృష్ణ పేరు చోటు చేసుకుంది. ఇందుకు అనంతకృష్ణ కూడా ఫేస్ బుక్ కి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇతను కేరళలోని సైబర్ సెల్ లో ఈ విద్యార్థి తన వంతు సేవలందిస్తున్నాడు.

2014లో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు

2014లో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు

ఇదిలా ఉంటే వాట్సప్ యాప్‌ను ఫేస్‌బుక్ సంస్థ 2014లో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.వాట్సాప్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్ కూడా ప్రయత్నించింది. గూగుల్ ఆఫర్ చేసిన డీల్ విలువ 10 బిలియన్ డాలర్లు. ప్రపంచ ఎస్ఎంఎస్ వాల్యుమ్‌ను వాట్సాప్ ఎస్ఎంఎస్ వాల్యుమ్ ఎప్పుడో అధిగమించేసింది. బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపిన వివరాల మేరకు ఫేస్‌బుక్, వాట్సాప్ డీల్ కుదరటానికి రెండు సంవత్సరాల పట్టిందట. ఈ డీల్ కు సంబంధించి తొలసారిగా జూన్ 2012లో మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ సీఈఓ జాన్ కౌమ్ కు ఫోన్ చేసారట. చివరాఖరుకు వీరిద్దరి మధ్య డీల్ ప్రేమికుల రోజున ఒకే అయ్యిందట.

Best Mobiles in India

English summary
Manipur engineer detects WhatsApp bug that breaches privacy, enters Facebook Hall of Fame
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X