ఇండియన్ల తూటాల దెబ్బకు బిత్తరపోయిన ఫేస్‌బుక్

Written By:

నెట్ న్యూట్రాలిటీపై ఫేస్‌బుక్ సభ్యుడు చేసిన ట్వీట్‌కు ఇండియన్లు మాటల తూటాలను పేల్చారు. ఆ ట్వీట్ కు వ్యతిరేకంగా యావధ్భారతంలోని నెటిజన్లు ఒక్కటై దుమ్మెత్తిపోశారు. వలసవాద వ్యతిరేక భావజాలంగా ఇండియాను పేర్కొంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫేస్‌బుక్‌నే ప్రశ్నార్థకంగా మార్చింది. దేశ ప్రజల నుంచి వెలువెత్తిన నిరసనకు ఫేస్‌బుక్ బోర్డ్ మెంబర్ బిత్తరపోయి తన వాదనలను వెనక్కి తీసుకుంటున్నానంటూ మళ్లీ ట్వీట్ చేశారు. అయితే దీనిపై ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Read more: ట్రాయ్ దెబ్బకు జుకర్ బర్గ్ విలవిల.. అయినా వదిలిపెట్టం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెట్ న్యూట్రాలిటీపై ఫేస్బుక్ బోర్డు సభ్యుడు చేసిన ట్వీట్

నెట్ న్యూట్రాలిటీపై ఫేస్బుక్ బోర్డు సభ్యుడు చేసిన ట్వీట్, దానిని దుమ్మెత్తిపోస్తూ నెటిజన్లు, ప్రత్యేకించి భారత నెటిజన్లు చేసిన రీట్వీట్స్‌తో ఆన్‌లైన్ అట్టుడికిపోయింది.

వివక్షాపూరిత ఇంటర్నెట్ టారిఫ్‌ను

వివక్షాపూరిత ఇంటర్నెట్ టారిఫ్‌ను అడ్డుకుంటూ .. నెట్ న్యూట్రాలిటీని పరిరక్షిస్తూ ... టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై ఫేస్బుక్ తన అక్కసును ఇంకా వెళ్లగక్కుతోంది. ఈ విధానాన్ని 'వలసవాద వ్యతిరేక' భావజాలంగా ఫేస్ బుక్ బోర్డ్ మెంబర్ మార్క్ అండ్రీసేన్ ట్వీట్ చేశారు.

మంచి అంశాలను సైతం 'వలసవాద వ్యతిరేక' భావజాలంతో

మంచి అంశాలను సైతం 'వలసవాద వ్యతిరేక' భావజాలంతో తోసిపుచ్చడం సరికాదని అన్నారు. దేశ ప్రజలకు ఇలాంటి నిర్ణయాలు ఎంతమాత్రం దోహదపడవని పేర్కొన్న ఆయన, ఈ భావజాలం దేశాన్ని ఆర్థికంగా దశాబ్దాల పాటు వెనక్కు నెడతాయని అన్నారు.

దీనిపై నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు

దేశం బ్రిటిష్ పాలనలో ఉంటేనే మంచి నిర్ణయాలు వచ్చి ఉండేవని సైతం వ్యాఖ్యానించారు. అయితే దీనిపై నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన ట్వీట్ను అండ్రీసేన్ ఉపసంహరించుకున్నారు.

తన వ్యాఖ్యలను అన్నింటినీ వెనక్కితీసుకుంటున్నట్లు

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌ను కొందరు ఇంటర్నెట్ వలసవాదంగా సైతం అభివర్ణించారు. మరి కొందరు ఈస్ట్ ఇండియా కంపెనీ వలసవాదానికి 'సరికొత్త కొనసాగింపుగా' ఫేస్‌బుక్‌ను అభివర్ణించారు. తాజా పరిణామాలతో తన వ్యాఖ్యలను అన్నింటినీ వెనక్కితీసుకుంటున్నట్లు అండ్రీసేన్ ప్రకటించారు.

వెబ్‌సైటును బట్టి వివిధ రకాల చార్జీలు

వెబ్‌సైటును బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చే యకూడదన్న నిబంధనలతో టెలికం ఆపరేటర్లు దారికి రాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తప్పవని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఇటీవల హెచ్చరించింది.

నెట్ న్యూట్రాలిటీకి మద్దతు పలికిన ట్రాయ్

అంతక్రితం నెట్ న్యూట్రాలిటీకి మద్దతు పలికిన ట్రాయ్ .. డేటా సర్వీసులకు కంటెంట్‌ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చేయడం కుదరదని, అలా చేస్తే భారీ జరిమానాలు తప్పవని నిబంధనలు విడుదల చేసింది.

ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు నిరాశపర్చాయని

నెట్ న్యూట్రాలిటికీ మద్దతుగా ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు నిరాశపర్చాయని సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్బర్గ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. కొన్ని డేటా సర్వీసులను ఉచితంగా అందించే తమ వంటి సంస్థల పథకాలకు ఈ నిబంధనల వల్ల ఆంక్షలు, అడ్డంకులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.

ట్రాయ్ దెబ్బకు ఫేస్‌బుక్ అల్లకల్లోలం

ఇక ట్రాయ్ దెబ్బకు ఫేస్‌బుక్ అల్లకల్లోలమవుతోంది. ట్రాయ్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫేస్‌బుక్ బోర్డు సభ్యుడు మార్క్ ఆండ్రసన్ చేసిన వ్యాఖ్యల పట్ల దాని సీఈవో జుకర్ బర్గ్ వివరణ ఇచ్చారు. ఆండ్రసన్ వ్యాఖ్యలను జుకర్ బర్గ్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు.

ఆండ్రసన్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా నిరాశపరిచాయని

ఆండ్రసన్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా నిరాశపరిచాయని జుకర్బర్గ్ తాజాగా కామెంట్ చేశారు. ఫ్రీ బేసిక్స్ను ట్రాయ్ వ్యతిరేకించడంతో ఫేస్‌బుక్ సభ్యుడైన ఆండ్రసన్ ఆ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఫ్రీ బేసిక్స్‌ను సమర్థిస్తూ తన ఎఫ్బీ అకౌంట్లో కామెంట్‌ను పోస్టు చేశాడు. వలసవాదుల పట్ల భారత్ తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని ఆండ్రసన్ తన పోస్టులో అన్నాడు.

ఆండ్రసన్ వ్యాఖ్యల పట్ల జుకర్బర్గ్ సీరియస్

ఆండ్రసన్ వ్యాఖ్యల పట్ల జుకర్బర్గ్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత జుకర్ బర్గ్ వత్తిడితో అండ్రెసన్ ఆ వ్యాఖ్యలను డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పాడు. భారత్‌పై ఆండ్రసన్ చేసిన వ్యాఖ్యలు ఫేస్‌బుక్ ఉద్దేశాలు కావని జుకర్ బర్గ్ తన లేఖలో స్పష్టం చేశాడు.

వ్యక్తిగతంగా తనకు భారత్‌పై ప్రత్యేక అభిమానం

జుకర్ బర్గ్‌తో పాటు వ్యక్తిగతంగా తనకు భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. భారత్లో ఇటీవల టూర్ చేశానని, అక్కడి ప్రజల మానవత్వం, స్పూర్తి, విలువలు తనకు ప్రేరణ ఇచ్చాయన్నారు.

ప్రజలందరూ తమ అనుభవాలను పంచుకోవాలన్న ఉద్దేశం

ప్రజలందరూ తమ అనుభవాలను పంచుకోవాలన్న ఉద్దేశం ఉంటేనే పురోగతి సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు జుకర్ బర్గ్ ఆ పోస్టులో తెలిపాడు.

పైత్యంతో చేసిన కామెంట్లు

పైత్యంతో చేసిన కామెంట్లు వెనక్కి తీసుకుంటున్నానంటూ మెసేజ్ 

ఇండియాను పొగుడుతూ మరో ట్వీట్

ఇండియాను పొగుడుతూ మరో ట్వీట్ 

జుకర్ బర్గ్ దెబ్బకు ఇండియాను అంటే ఇష్టమని ట్వీట్

జుకర్ బర్గ్ దెబ్బకు ఇండియాను అంటే ఇష్టమని ట్వీట్ 

ఫేస్‌బుక్‌ని సభ్యుల వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ

ఫేస్‌బుక్‌ని సభ్యుల వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇంటర్నెట్‌లో ఉద్యమం మొదలైంది. అందరూ దీనిని వ్యతిరేకించాలని ఉద్యమబాట పడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Marc Andreessen Offends India Defending Facebook’s Free Basics
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot