ఫేస్‌బుక్ పోర్న్ వీడియోల నుండి జాగ్రత్త..

Posted By: Prashanth

ఫేస్‌బుక్ పోర్న్ వీడియోల నుండి జాగ్రత్త..

 

2004వ సంవత్సరంలో మార్క్ జూకర్స్ బర్గ్ కో-ఫౌండర్‌గా ఫ్రారంభించిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' అనతి కాలంలో 800 మిలియన్ యూజర్స్‌ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాలంలో ఫేస్‌బుక్ స్కామ్‌లతో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది. అటువంటి వాటిని ఎదుర్కోనేందుకు గాను ఫేస్‌బుక్ కొత్త కొత్త ఫీచర్స్‌ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

గత మార్చిలో ఫేస్‌బుక్‌లో ఇటాలియన్ జర్నలిస్ట్ 'మారికా ప్రుస్కో' స్కామ్‌ని ముందుగా పాఠకులకు వివరిస్తాను. ఇటాలియన్ టివిలో జర్నలిస్ట్ 'మారికా ప్రుస్కో' తన బ్రెస్ట్‌ని చూపేటటువంటి వీడియో ఫేస్‌బుక్‌లో హాల్ చల్ చేసింది. ఈ వీడియోలో మీరు ఏమైనా చూడదలచుకుంటే దీనిపై క్లిక్ చేయండి.. అంటూ ఎప్పుడైతే దీనిపై యూజర్స్ క్లిక్ లేదా లైక్ చేయగానే మీకు సంభంధించిన స్నేహితులు అందరి వాల్స్‌లో పోస్ట్ అవడం జరిగేది.

ఆలా ఫేస్‌బుక్ మొత్తం ఓ స్పామ్ మాదిరి విస్తరించింది. ఎలాగోలాగో ఈ విషయం తెలుసుకున్న ఫేస్‌బుక్ యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకుంది. ఇదంతా ఇప్పడు యూజర్స్‌కు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే , సాధారణంగా యూజర్స్ పోర్న్ సినిమాలు, వీడియోలు అంటే ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోని పాఠకులను ఆకర్షించేందుకు స్కామ్ చేసేవారు ఇలాంటి ఛీఫ్ ట్రిక్స్‌ని ప్రదర్శిస్తుంటారు. దీనిని బట్టి రెండవ సారి ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు పాఠకుల కోసం ప్రత్యేకంగా ఈ ఆర్టికల్‌ని ప్రచురించడం జరుగుతుంది.

ఎవరైతే యూజర్స్ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారో వారు పాస్ వర్డ్స్‌ని అత్యంత జాగ్రత్త పరచుకోవాలి. పాస్ వర్డ్ ఎవరైనా హాక్ చేస్తే మీ వాల్‌పై ఇబ్బింది కలిగించే పోస్టులను పోస్ట్ చేయడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot