అభిమానుల కోసం ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్‌బర్గ్ మెయిల్ లెటర్‌

Posted By: Staff

అభిమానుల కోసం ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్‌బర్గ్ మెయిల్ లెటర్‌

ఫేస్‌బుక్ ఓ పెద్ద సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్. ప్రపంచంలో అతి తక్కువ కాలంలో ఎంతో ఎత్తుకి ఎదిగినటువంటి సోషన్ నెట్ వర్కింగ్ వెబ్ సైటే అంటే ఠక్కున చెప్పే సమాధానం ఫేస్‌బుక్. అలాంటి పెద్ద సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌కి సిఈవో అయినటువంటి మార్క్ జూకర్‌బర్గ్ చాలా సింపుల్‌గా ఉంటారు. అంతేకాదండోయ్ తనకు సంబంధించినటువంటి పర్సనల్ పనులు తానే దగ్గరుండి మరీ చూసుకుంటారు. అలాంటి సంఘటన మీకోసం.. మార్క్ జూకర్స్ బర్గ్ ఇటీవల కొత్తగా ఓ మెయిల్ లెటర్‌ని తయారు చేయించారు. ఈ మెయిల్ లెటర్ ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులకు పంపడం కోసం తన కంపెనీలో పని చేస్తున్నటువంటి డిజైనర్ బెన్ బ్యారీ చేత స్వయంగా దగ్గరుండి మరీ తన ఇంట్లో డిజైన్ చేయింటారు.

ఈ సందర్బంలో డిజైనర్ బెన్ బ్యారీ మాట్లాడుతూ ఫేస్‌బుక్‌లో మార్క్ జూకర్‌బర్గ్ పర్సనల్‌గా పంపేటటువంటి స్టోరీలు చాలా ఉంటాయి. అందులో చాలా మంది సెలబ్రిటీస్ జూకర్‌బర్గ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాస్తుంటారు. అలాంటి వారందరికి తిరిగి జూకర్‌బర్గ్ కూడా తిరిగి కృతజ్ఞతాభావంతో సమాధానం చెప్పేందు కోసం ఈ మెయిల్ లెటర్ తయారు చేయడం జరిగిందని వెల్లిడంచారు.

ఇక ఈ సీల్ విషయానికి వస్తే చూడడానికి చాలా అందంగా అన్ని వెబ్ డిజైన్స్ మాదిరే రూపోందించడం జరిగింది. ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ యజమాని అయినటువంటి జూకర్‌బర్గ్ ప్రత్యేకంగా దీనిని రూపోందించడం జరిగింది. ఈ సీల్ వల్ల జూకర్స్‌బర్గ్ ఫ్యాన్స్ మెయిల్స్ కొన్ని స్ఫెషల్ మెయిల్స్‌గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ సీల్ వల్ల ఫ్యాన్స్‌లో ఇగో భావాలు కూడా వస్తాయని అన్నారు. ఏదిఐతేనేం ఇక మీదట మార్క్ జూకర్‌బర్గ్ సీల్ మనం చూడబోతున్నాం అన్నమాట.

Mark Zuckerberg Personalized Stationery:



Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot