ఫేస్‌బుక్ వర్సెస్ ఆపిల్, ముదిరిన మాటల యుద్ధం

Written By:

టెక్ దిగ్గజం ఆపిల్ అలాగే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ మధ్య ఫేస్‌బుక్ భద్రతపై టిమ్ కుక్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫేస్‌బుక్‌ బిజినెస్‌ మోడల్‌పై ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ చేసిన విమర్శలను మార్క్‌ జుకర్‌బర్గ్‌ తిప్పికొట్టారు. తమ అడ్వర్‌టైజింగ్‌-సపోర్టెడ్‌ బిజినెస్‌ మోడల్‌నుఫేస్‌బుక్ అధినేత సమర్థించుకున్నారు. అడ్వర్‌టైజింగ్‌-సపోర్టెడ్‌ బిజినెస్‌ మోడల్‌ ఒక్కటే, తమ సర్వీసులు కొనసాగించడానికి మార్గమని అభిప్రాయపడ్డారు. టిమ్ కుక్ ని ఉద్దేశించి మీరు ఏదీ చెల్లించనప్పుడు మీ మాటల్ని పట్టించుకోం. మీ మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆగ్రహంగా పేర్కొన్నారు. ఒకవేళ తమ బిజినెస్‌ మోడల్‌ కింద యూజర్లపై ఛార్జీలను విధిస్తే, ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌కు చెల్లించుకోలేరని,ఫేస్‌బుక్‌ ఎదుర్కొనే ఒకానొక సమస్యల్లో ఇది ఆదర్శవాదమైనదేనని, ప్రజలను కనెక్ట్‌ చేయడంపై తాము ఫోకస్‌ చేసినట్టు తెలిపారు.

నోకియా 6 ఇప్పుడు రూ.12,999కే!

ఫేస్‌బుక్ వర్సెస్ ఆపిల్, ముదిరిన మాటల యుద్ధం

కాగ, ఆపిల్‌ కంపెనీకి ఫేస్‌బుక్‌ పరిస్థితి రాదని, ఎందుకంటే కస్టమర్‌ డేటాను ఆధారం చేసుకుని ఆపిల్‌ ప్రకటనలను విక్రయించదని టిమ్‌ కుక్‌ విమర్శించారు. ఫేస్‌బుక్‌ బిజినెస్‌ మోడల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను జుకర్‌ బర్గ్‌ తిప్పికొట్టారు. ఫేస్‌బుక్‌ తప్పిదాన్ని బహిరంగంగా ఒప్పుకున్న జుకర్‌బర్గ్‌, ప్రస్తుతం సమస్యలను తీర్చడానికి కొన్నేళ్ల సమయం పడుతుందన్నారు. ఫేస్‌బుక్‌లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే.

డేటా లీక్‌ను హైలెట్‌ చేసిన జుకర్‌బర్గ్‌, ప్రస్తుతం యూజర్లు ప్రమాదాలు, దుష్ప్రభావాలపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఈ తప్పిదాన్ని తాము ఒప్పుకుంటున్నాం, కానీ దీన్ని పరిష్కరించడానికి కొన్ని సంవత్సరాల సమయమైతే పడుతుందని చెప్పారు. మూడు లేదా ఆరు నెలల్లో సరిచేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశముందని ఆయన అన్నారు.

English summary
Mark Zuckerberg hits back at Tim Cook More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot