ఫేస్‌బుక్‌ ఓనర్‌గారి రాసలీలలు?

Posted By: Staff

ఫేస్‌బుక్‌ ఓనర్‌గారి రాసలీలలు?

ఫేస్‌బుక్ సహా వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్డ్ టాప్‌లెస్ ఫోటో ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చిన సంఘటన నెట్ ప్రపంచంలో సర్వత్రా సంచలనం రేపుతోంది. ఈ ఫోటోను ఫేస్‌బుక్ ప్రొడెక్ట్ మేనేజర్

జస్టిన్ షాఫర్ ఆగష్టు 4న ఏర్పాటు చేసిన వివాహ పార్టీ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆండ్రూ బోస్‌వర్త్ ఈ ఫోటోను తన ఫేస్‌బుక్ పేజీ పై అప్‌లోడ్ చేయటంతో ఉదంతం బయటకు పొక్కింది.

అయితే కొద్ది సెకన్లలోనే ఈ ఇమేజ్‌ను ఫేస్‌బుక్ పేజీ నుంచి తొలగించారు. అప్పటికే, ప్రముఖ ఆన్‌లైన్ ఇమేజ్ షేరింగ్ పోర్టల్ ఇమ్‌గుర్(Imgur)జూకర్‌బర్గ్ టాప్‌లెస్ ఫోటోను తన సైట్‌లోకి అప్‌లోడ్ చేసకుని ప్రదర్శనకు ఉంచింది. ఈ ఫోటోను తిలకించిన లక్షల సంఖ్యలో నెటిజనులు జూకర్ బర్డ్ తప్పుడు ప్రవర్తన పై వాడివేడిగా చర్చించుకుంటున్నారు. ఇదే పార్టీకి సంబంధించిన మరో ఫోటోలో ఫేస్‌బుక్ ప్రాజెక్ట్ మేనేజర్ శామ్ లిస్సిన్ ఇబ్బందికరమైన భంగిమలో కెమెరాకు ఫోజులిస్తూ కనిపించారు.

సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థ పై తప్పుడు ప్రభావాన్ని చూపే ఈ ఫోటో పట్ల జూకర్‌బర్డ్ ఇప్పటి వరకు స్పందించ లేదు. అయితే, ఫేస్‌బుక్ ఉద్యోగులు మద్యం మత్తులో ఈ విధంగా ప్రవర్తించి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికి, ఈ ఘటన ఫేస్‌బుక్ గోప్యతా నియంత్రణలను దెబ్బతీసేదిగా ఉందని విశ్లేషకులు మండిపడుతున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting