మార్కెట్‌ను షేక్ చేస్తోన్న MarQ ఆండ్రాయిడ్ టీవీలు..

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వినియోగం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది.

|

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వినియోగం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశవిదేశాలకు చెందిన అనేక బ్రాండ్‌లు వివిధ రేంజ్‌లలో స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా, ఈ జాబితాలోకి ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ అయిన MarQ చేరిపోయింది.

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో హై-క్వాలిటీ ఉత్పత్తులను అందించటమే లక్ష్యంగా ఈ ప్రయివేట్ లేబుల్ బ్రాండ్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో, 2018 వేదికగా ప్రపంచానికి పరిచయమైన ఈ బ్రాండ్ ఇండియన్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా బెస్ట్-ఇన్-క్లాస్ టెక్నాలజీలతో స్మార్ట్ టీవీలను ప్రొవైడ్ చేస్తోంది.

marq-by-flipkart-smart-tv-line-up-is-disrupting-the-indian-tv-market1

బడ్జెట్ ధర ట్యాగ్‌లలో బెస్ట్ క్వాలిటీ టీవీలను అందించాలన్న సిద్థాంతంతో మార్కెట్లోకి అడుగుపెట్టిన MarQ బ్రాండ్ 24 అంగుళాల నుంచి 65 అంగుళాల మధ్య వివిధ రేంజ్‌లలో స్మార్ట్ టీవీలను ఆఫర్ చేస్తోంది. వీటిలో అల్ట్రా హెచ్‌డి, ఫుల్ హెచ్‌డి, ఆండ్రాయిడ్ టీవీ, స్మార్ట్ ఇంకా నాన్-స్మార్ట్ టీవీ శ్రేణులు ఉన్నాయి. వీటి ధరలు రూ.7,799 నుంచి రూ.67,999 మధ్య ఉన్నాయి.

తమ వినియోగదారులకు సినీమాటిక్ మూవీ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువ చేసే క్రమంలో సోనీ, సామ్‌సంగ్, ఎల్‌జి వంటి దిగ్గజ బ్రాండ్‌లకు ధీటుగా హెచ్ డిఆర్ టెక్నాలజీ, ఏ+ గ్రేడ్ ప్యానల్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్, డిజిటల్ డాల్బీ విత్ సరౌండ్ సౌండ్ వంటి కీలక ఫీచర్లను బడ్జెట్ తో సంబంధం లేకుండా తన టీవీలతో అందిస్తోంది.

లేటెస్ట్ డిస్‌ప్లే టెక్నాలజీ..

లేటెస్ట్ డిస్‌ప్లే టెక్నాలజీ..

ఫ్లిప్‌కార్ట్ తన MarQ స్మార్ట్‌టీవీ లైనప్ ద్వారా అత్యాధునిక డిసిప్లే టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. కంపెనీ ఆఫర్ చేస్తోన్న ప్రీమియమ్ రేంజ్ టీవీలు ఏ+ గ్రేడ్ ప్యానల్స్‌ను ఉపయోగించుకుని 1.07 బిలియన్ రంగులను డిస్పర్స్ చేయగలుగుతుంది. 55 ఇంచ్ సెగ్మెంట్‌లో MarQ విడుదల చేసిన అల్ట్రా హెచ్‌డి (4కే) ఎల్ఈడి స్మార్ట్‌టీవీ HDR Precision కలర్ టెక్నాలజీతో ఎక్విప్ అయి ఉంటుంది.

ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్‌తో లోడ్ అయి ఉండే ఈ టెక్నాలజీ ఫాస్ట్ పేసిడ్ యాక్షన్ క్లిక్స్‌ను సైతం అర్థవంతమైన వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆఫర్ చేస్తుంది. ఈ టీవీలో ఏర్పాటు చేసిన 4కే ప్యానల్ 3840 x 2160 పిక్సల్ రిసల్యూషన్‌, ఫుల్ హెచ్‌డితో పోలిస్తే 4 రెట్ల రెట్టింపైన క్వాలిటీని అందిస్తోంది. ఇదే సమయంలో ఈ టీవీలో ఎక్విప్ చేసిన 4కే అప్‌స్కేలింగ్ టెక్నాలజీ ఫుల్ హెచ్‌డి కంటెంట్‌ను 4కే రిసల్యూషన్‌లోకి అప్‌స్కేలింగ్ చేసి క్రిస్ప్ వీడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

 

లీనమయ్యే రీతిలో డాల్బీ డిజిటల్ సౌండ్..
 

లీనమయ్యే రీతిలో డాల్బీ డిజిటల్ సౌండ్..

ఫ్లిప్‌కార్ట్ తన MarQ టవీల ద్వారా హైక్వాలిటీ క్వాలిటీ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఉద్దేశ్యంతో శక్తివంతమైన 20 వాట్ స్పీకర్లను తన స్మార్ట్ టీవీలలో లోడ్ చేస్తోంది. ఈ స్పీకర్స్ వినసొంపైన రీతిలో మల్టీ-డైమెన్షనల్ సౌండ్ అవుట్ పుట్‌ను విడుదల చేస్తూ థియేటర్ తరహా సౌండ్ అనుభూతులను పంచుతాయి. ఈ స్పీకర్లలో ఎక్విప్ చేసిన డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ బూమింగ్ సౌండ్ సిగ్నేచ‌ర్‌ను క్రియేట్ చేసిన లివ్వింగ్ రూమ్ నలుమూలలకు ఆడియోను వ్యాపింపజేస్తుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి...

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి...

ఫ్లిప్‌కార్ట్ తన MarQ టవీల ద్వారా అతుకులు లేని బిగ్‌స్ర్కీన్ మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్‌ను చేరువ చేసేందుకుగాను ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఎంపిక చేసుకుంది. కొన్ని వాటిలో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ఉపయోగించుకుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ఈ ఓఎస్ పై రన్ అయ్యే టీవీలు 43- ఇంచ్, 49 -ఇంచ్, 55- ఇంచా, ఇంకా 65 - ఇంచ్ సైజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్ పవర్డ్ స్మార్ట్ టీవీలలో స్మార్ట్ గూగుల్ అసిస్టెంట్ సౌకర్యంతో పాటు అడ్వాన్సుడ్ వాయిస్ కంట్రోల్ రిమోట్ వస్తుంది.

ఇక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ఈ ఓఎస్ పై రన్ అయ్యే టీవీలు 32 ఇంచ్, 40 ఇంచ్, 43 ఇంచ్, 55 ఇంచ్ ఇంకా 65 ఇంచ్ స్ర్కీన్ సైజుల్లో లభ్యమవుతాయి. వీటిలో 55 ఇంచ్ మోడల్ అయిన 55HSUHD, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రీలోడెడ్ యాప్స్ అందుబాటులో ఉంటాయి.వీటితో ముగింపంటూ లేని కంటెంట ప్లేబ్యాక్‌ను ఆస్వాదించే వీలుంటుంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంతో ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న MarQ టీవీలు ప్రత్యేకమైన VEWD యాప్ స్టోర్‌తో ఎక్విప్ అయి ఉంటాయి. ఈ యాప్‌లో మొత్తం 1500 టీవీ యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి నాన్-స్టాప్ కంటెంట్‌ను డెలివరీ చేస్తుంటాయి.

సైజ్ వేరియంట్స్..

ఫ్లిప్‌కార్ట్ తన MarQ ప్రీమియమ్ ఆండ్రాయిడ్ టీవీలను 55 ఇంచ్ 65 ఇంచ్, 49 ఇంచ్ ఇంకా 43 ఇంచ్ స్ర్కీన్ సైజుల్లో విక్రయిస్తోంది. ఇక లైనక్స్ ఓఎస్ టీవీల విషయానికి వచ్చేసరికి 32 ఇంచ్, 40 ఇంచ్, 43 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్ సైజుల్లో అందుబాటులో ఉంటాయి.

 

 

 

వీటి ధరలను పరిశీలించినట్లయితే..

వీటి ధరలను పరిశీలించినట్లయితే..

మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ డాల్బీ 32 ఇంచ్ (80 సెంటీమీటర్ల) హెచ్‌డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ధర రూ.12,999, మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ డాల్బీ 40 ఇంచ్ (100.5 సెంటీమీటర్ల) ఫుల్ హెచ్‌డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ధర రూ.18,999. మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ డాల్బీ 43 ఇంచ్ (109సెంటీమీటర్ల) ఫుల్ హెచ్‌డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ధర రూ.21,999. మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ డాల్బీ 55 ఇంచ్ (140సెంటీమీటర్ల) అల్ట్రా హెచ్‌డి (4కే) స్మార్ట్ ఎల్ఈడి టీవీ ధర రూ.35999. మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ డాల్బీ 65 ఇంచ్ (165సెంటీమీటర్ల) అల్ట్రా హెచ్‌డి (4కే) స్మార్ట్ ఎల్ఈడి టీవీ ధర రూ.62,999.

Best Mobiles in India

English summary
MarQ by Flipkart Smart TV line-up is disrupting the Indian TV market.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X