నచ్చిన అమ్మాయిని వశం చేసుకోవడానికి గుడ్లగూబను బలి ఇచ్చిన వ్యక్తి
టెక్నాలజీ ఇంతలా దూసుపోకుతున్న ప్రజలు ఇంకా చేతబడి వంటివి నమ్ముతున్నారు.
టెక్నాలజీ ఇంతలా దూసుపోకుతున్న ప్రజలు ఇంకా చేతబడి వంటివి నమ్ముతున్నారు.ఇప్పటి వరకు దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందన్న మూఢనమ్మకంతో గుడ్లగూబలను బలిచ్చిన పలు ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకున్నాయి.ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది.తనకు నచ్చిన ఓఅమ్మాయిని వశీకరణ చేసుకునేందుకు ఓ వ్యక్తి ఒక గుడ్లగూబను బలిచ్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే....

ఓ అమ్మాయిని ఇష్టపడిన కన్హయ్య ....
సుల్తాన్ పురికి చెందిన కన్నయ్య (40) ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓ అమ్మాయిని ఇష్టపడిన కన్హయ్య ఆమె కూడా ఇష్టపడేలా చేసుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలో ఓ తాంత్రిక విద్యను యూట్యూబ్ లో చూసిన అతను ఓ గుడ్లగూబను బలి ఇవ్వాలనుకున్నాడు.

ఓ గుడ్లగూబను ఇంటికి తీసుకొచ్చి....
ఓ గుడ్లగూబను ఇంటికి తీసుకొచ్చి మొదటగా కత్తితో దాని కాళ్లను కట్ చేశాడు. ఆ తర్వాత ఇతర అవవయవాల్లో గుండుసూదులు గుచ్చి, ప్రాణాలు తీశాడు. ఈ ఘటనకు సంబంధించి అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కన్నయ్య పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, అతని ఇంట్లోని కూలర్ నుంచి గుడ్లగూబ కబేళాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడ్లగూబ శరీరంలో గుండుసూదులను గుచ్చడం వల్లే అది చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను....
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా కన్నయ్య తీశాడు. ఆ వీడియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం గుడ్లగూబను ఎంత మొత్తానికి కొనుగోలు చేశాడు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో మాత్రం.....
విచారణలో మాత్రం అనారోగ్యంతో కదలలేని స్థితిలో గుడ్లగూబ తనకు కనిపించిందని అందువల్లే దాన్ని ఇంటికి తీసుకొచ్చానని కన్నయ్య తెలిపాడు. అయితే, గుడ్లగూబకు ఎలాంటి అనారోగ్యం లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది.


Click it and Unblock the Notifications