అంగారకుడిపై నీటిజాడ..!

Posted By: Staff

అంగారకుడిపై నీటిజాడ..!

 

మానవ మనుగడకు ఎంత అవసరమైన నీరు అంగారక గ్రహం పై ఉండొచ్చన్న నిపుణులు అంచనాలు నిజమయ్యాయి. అంగరాకుడి పై పరిశోధనలను ప్రారంభించిన క్యూరియాసిటీ రోవర్ మరో సంచలన విషయాన్ని మానవాళికి తెలిపింది. అరుణ గృహం పై నీటి జాడల్ని క్యూరియాసిటీ రోవర్ గుర్తించింది. అంగారకుడి పై ఒకప్పుడు తీవ్రస్థాయిలో నీటి ప్రవాహం ఉండేదని చేప్పేందుకు బలమైన ఆనవాళ్లను రోవర్ తన శక్తివంతమైన కెమెరాలలో బంధించింది. అంగరాకుడి పై నీటి జాడలకు సంబంధించిన ఆధారాలు ఇంతకు ముందుకూడా లభ్యమైనా, ప్రస్తుతం ప్రాచీన ప్రవాహమార్గానికి సంబంధించిన రాళ్ల తాజా చిత్రాలు లభ్యమవడం ఇదే తొలిసారని ఈ సందర్భంగా నాసా తెలిపింది.

ఈ ప్రవాహాంలో కొట్టుకొచ్చిన రాళ్ల పరిమాణం, ఆకారాన్ని బట్టి.. అక్కడ నీరు క్షణానికి 3 అడుగుల వేగంతో ప్రవహించేందని, చీలమండ నుంచి తుంటిస్థాయి వరకు దాని లోతు ఉండేదని అంచనా వేస్తున్నట్లు క్యూరయాసిటీ పరిశోధకుల్లో ఒకరైన విలియం డైట్రిచ్ పేర్కొన్నారు. జల జాడను గుర్తించిన ప్రదేశం గేట్ క్రేటర్ ఉత్తర భాగం, మౌంట్ షార్ప్ అడుగు భాగం మధ్య ఉన్నట్లు చెప్పారు.

క్యూరియాసిటీ తన ప్రధాన కెమెరా ద్వారా తీసిన ఫోటోల్లో ‘హోటాహ్’, ‘లింక్’ అనే రాళ్లకు సంబంధించిన చిత్రాలను పరిశీలిస్తుండగా ఈ అంశం బయటపడింది. వీటిని పరిశీలిస్తే నివాసయోగ్యమైన వాతావరణంతో కూడిన సుదూరప్రవాహం ఉండి ఉండొచ్చని తెలుస్తోందని మార్స్ సైన్స్ లేబరేటరీ ప్రాజెక్టు శాస్త్రవేత్త జాన్ గ్రోట్జింగర్ పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting