Home
News

81.5 కోట్ల మంది భారతీయుల డేటా లీక్.. డార్క్‌వెబ్‌లో ఆధార్‌ సహా కీలక వివరాలు..!

భారత దేశ చరిత్రలో భారీ స్థాయిలో ప్రజల వ్యక్తిగత డేటా లీక్‌ (Massive data breach in india) అయినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన సైబర్‌ సిక్యూరిటీ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. 81.5 కోట్ల ప్రజల డేటా ప్రస్తుతం డార్క్‌ వెబ్‌లో లీకైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రజల పేర్లు, ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌, ఆధార్‌, పాస్‌పోర్టు వివరాలు ఉన్నట్లు సమాచారం.

తొలిసారిగా..: అక్టోబర్‌ 9న ఈ డేటా లీక్‌ గురించి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. Pwn0001 అనే యూజర్‌ తన వద్ద 81.5 కోట్ల భారతీయుల సమాచారం ఉందని, అందులో ఆధార్‌, పాస్‌పోర్టు్ వంటి వివరాలు ఉన్నాయని చెబుతున్నాడు. ఈ వివరాలను $80,000కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

Massive data breach

డేటా లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పరీక్షలు చేసిన సమయంలో ఐసీఎంఆర్‌ - ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సేకరించిన సమాచారం కావచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా సమయంలో సేకరించిన డేటా వైద్య ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ సహా నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్ల వద్ద ఉందని.. అయితే డేటా ఎక్కడ నుంచి లీకైందనే సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు.

డార్క్‌ వెబ్‌లో లీకైన్‌ డేటాలో పేర్లు, తండ్రి పేరు, ఫోన్‌ నంబర్‌, పాస్‌పోర్టు, ఆధార్‌ నంబర్‌, శాశ్వత, తాత్కాలిక అడ్రస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇదే అతి పెద్ద డేటా లీక్‌గా (80 crore indians personal data leaked) అభిప్రాయపడుతున్నారు. ఈ లీకేజీపై కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ ఆఫ్‌ ఇండియా... ఐసీఎంఆర్‌ను అప్రమత్తం చేసింది.

ఈ సంవత్సరం జూన్‌లో టెలిగ్రామ్ మెసెంజర్‌ ద్వారా కరోనా సమయంలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన CoWin వెబ్‌సైట్‌లోని డేటా లీకైనట్లు తెలిసింది. ఇందులో ముఖ్యంగా వీవీఐపీలు సహా ఇతర ప్రముఖుల వ్యక్తిగత సమాచారం లీక్‌ అయింది. గత సంవత్సరం డిసెంబర్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌లోని కొన్ని కంప్యూటర్లను హ్యాక్‌ చేసిన హ్యాకర్లు.. రూ.200 కోట్ల క్రిప్టో కరెన్సీని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో పరీక్షలు, వ్యాక్సిన్‌ తీసుకున్న సమయంలో పేరు, అడ్రస్, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ వంటి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. కరోనా సమయంలో ఈ డేటాకు గట్టి భద్రత కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లీక్‌ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది.

అనంతరం పలు సందర్భాల్లో ఈ డేటా లీక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా 81.5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే గతంలో టెలిగ్రామ్ ద్వారా కొవిన్‌ డేటా లీకేజీ తర్వాత.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Massive data breach 81.5 crore indians personal data leaked in dark web
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X