గూగుల్ అభివృద్థికి పాటుపడుతున్న మేధావులు

|

1998లో ప్రారంభించబడిన గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్‌. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ. గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న పలువురు మేధావుల గురించి తెలుసుకుందాం...

 

సెర్చ్ ఇంజన్ ‘గూగుల్' చాలా మందికి ఓ ఆన్‌లైన్ మార్గదర్శిగానే సుపరిచతం. మనకు తెలియన ఎన్నో వెసలబాటులను గూగుల్ కల్పిస్తోంది. గూగుల్ అనేకమైన ఉపయోగకర సదుపాయాలను కల్పిస్తోంది.

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

Larry Page CEO and Co-Founder

గూగుల్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన లారీపేజ్ 1973 మార్చి 26న అమెరికాలో జన్మించారు. కంప్యూటర్ శాస్త్రవేత్తగా, ఇంటర్నెట్ ప్రారిశ్రామికవేత్తగా లారీపేజ్‌కు మంచి గుర్తింపే ఉంది. ఈయన వ్యక్తిగత నికర ఆస్తి అంచనా US$20.3 బిలియన్లు. ఫోర్బ్స్ రూపొందించిన అమెరికా మొదటి 400 మంది కుబేరుల జాబితాలో లారీ పేజ్ 13వ స్థానంలో ఉన్నారు.

 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

Eric E. Schmidt Executive Chairman

ప్రస్తుతం గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఎరిక్ E.ష్మిత్ 1955 ఏప్రిల్ 27న జన్మించారు. ఎరిక్ ష్మిత్ 2001 మార్చిలో గూగుల్ డైరెక్టర్ల మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001 ఆగష్టు నుంచి 2011 వరకు గూగుల్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ష్మిత్ 138వ స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తి విలువ $8.3బిలియన్లు. లెక్స్ ప్రోగ్రామ్‌ను ష్మిత్ రచించారు.

 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు
 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

Sergey Brin, Co-Founder

గూగుల్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్జీ బ్రిన్ 1973 ఆగష్టు 21న జన్మించారు. కంప్యూటర్ శాస్త్రవేత్తగా, ఇంటర్నెట్ ప్రారిశ్రామికవేత్తగా సెర్జీ బ్రిన్‌కు గుర్తింపు ఉంది. లారీపేజ్‌కు బ్రిన్ మంచి మిత్రుడు. 2013 లెక్కల ప్రకారం సెర్జీ బ్రిన్ నికర ఆస్తి విలువ $24.4 బిలియన్లు.

 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

David C. Drummond

డేవిడ్ సీ. డ్రమ్మాండ్, గూగుల్ కార్పొరేట్ డెవలప్‌మెంట్ విభాగానికి సీనియర్ ఉపాధ్యక్షునిగా, చీఫ్ లీగల్ అధికారిగా 2006 నుంచి బాధ్యతలు నిర్వరిస్తున్నారు. 2002లో ఈయన గూగుల్‌లో చేరారు.

 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

Nikesh Arora

నికేష్ ఆరోరా గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా చీఫ్ బిజినెస్ అధికారిగా విధులు నిర్వరిస్తున్నారు. ఈయన 2004లో గూగుల్‌లో చేరారు. గూగుల్ కంపెనీలోని అనేక విభాగాల్లో అరోరా పనిచేసారు.

 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

Patrick Pichette

పాట్రిక్ పిక్‌హిట్టీ గూగుల్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా, చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా బాధ్యతలులు నిర్వహిస్తున్నారు. ఈయన గూగుల్‌లో చేరకముందు మెకిన్సే & కంపెనీ మరియు బెల్ కెనడా కంపెనీలలో పనిచేసారు.

 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

Alan Eustace

అలాన్ ఎస్టాసీ 2011 నుంచి గూగుల్ ఇంక్ సీనియర్ వైస్‌‌ ప్రెసిడెంట్ ఆఫ్ నాలెడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 2006 నుంచి 2011 వరకు అలాన్ గూగుల్ పరిశోధనా విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ఈయన 2002లో గూగుల్‌లో చేరారు.

 

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

గూగుల్ అభివృద్ధికి పాటుపడుతున్న మేధావులు

Salar Kamangar

సలార్ కామాన్గర్, యూట్యూబ్ సీఈఓ అలానే గూగుల్ వీడియో విభాగానికి సీనియర్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన గూగుల్ 9వ ఉద్యోగి. టెహ్రాన్ (ఇరాన్)లో జన్మించిన సలార్ బైలాజికల్ సైన్స్ విభాగంగో బ్యాచిలర్ పట్టాను పొందారు.

 

కావల్సిన ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ల శోధన:బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ల్యాప్‌టాప్ కోసం వెదుకుతున్నారా..? మీకు నచ్చిన గాడ్జెట్‌ను మెచ్చిన ధరల్లో మీ ముందుచేందుకు గూగుల్ సరికొత్త సెర్చ్ ఆప్షన్‌ను అందిస్తుంది. ఉదాహరణకు మీరు కోరకుంటున్న స్మార్ట్‌ఫోన్ రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య ఉండాలనుకుందాం. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ‘ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రూ5000...10000'అని టైప్ చేసినట్లయితే సంబంధిత సెర్చ్ ఫలితాలు ప్రత్యక్షమవుతాయి.

డాలర్ టూ రూపాయి : రూపాయి మారకపు విలువలను గూగుల్ సెర్చ్‌లో సులువుగా ఇంకా ఖచ్చితమైన సంఖ్యతో తెలుసుకోవచ్చు. మైళ్ల నుంచి కిలో మీటర్ల వరకు : మైళ్లకు, కిలోమీటర్లకు మధ్య వ్యత్యాసాన్నిఈ ప్రత్యేకమైన గూగల్ సెర్చ్ ఫీచర్ స్పష్టంగా సూచిస్తుంది. కచ్చితమైన కాలమానం: కచ్చితమైన కాలమానాన్ని తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బాక్సులో time india అని టైప్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X