అమెజాన్‌కు రూ.50 లక్షల కుచ్చు టోపీ పెట్టిన ఢిల్లీ కుర్రాడు!వివరాల్లోకి వెళ్తే

By Anil
|

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ఈ బిజీ బిజీ లైఫ్ లో కాళ్లు బయట పెట్టకుండానే అన్ని ఒడిలోకి వచ్చిపడుతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసేస్తున్నారు. చేతిలొ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి వస్తువునైనా తెల్లారేసరికల్లా ఇంటి ముందుకు వచ్చేస్తోంది. అయితే కొన్నిసార్లు ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు కూడా జరుగుతుంటాయి.బుక్ చేసిన ప్రొడక్ట్ కాకుండా ఇతర డమ్మి ప్రొడక్ట్ లు వచ్చేవి. దీంతో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో ప్రజలలో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ కామర్స్ సైట్లు కూడా ఇందుకు మినహాయంపు ఏమి కాదు. అందులో పనిచేసేవారు కస్టమర్ల బుక్ చేసిన ఉత్పత్తులను కాకుండా వేరే వాటిని వారికందిస్తున్న సంఘటనలు రోజూ సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఇలాంటి ఘటనే ఢిల్లీలో ఆ మధ్య సంచలనం అయింది. అమెజాన్ కి ఏకంగా రూ.50 లక్షలు టోపి పెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే......

 

2018 ఫస్ట్ సీజన్‌లో భారీగా అమ్మకాలు జరిపిన స్మార్ట్ ఫోన్స్ ఇవే2018 ఫస్ట్ సీజన్‌లో భారీగా అమ్మకాలు జరిపిన స్మార్ట్ ఫోన్స్ ఇవే

పేరు,ఊరు:

పేరు,ఊరు:

ఆ కుర్రాడి పేరు శివమ్ చోప్రా వయసు 21 తన ఊరు న్యూ ఢిల్లీ. ఒకప్పుడు హోటల్ మానేజ్మెంట్ ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం పోయాకా ఆన్ లైన్ వెబ్ సైట్లను ఫుల్ టైం గ మోసం చేయడం ఉద్యోగంగా మార్చుకున్నాడు.

మొదటి సారి ఎప్పుడు మోసం చేసాడంటే:

మొదటి సారి ఎప్పుడు మోసం చేసాడంటే:

మార్చ్ 2017 లో ఆ కుర్రాడి ఉద్యోగం పోయాకా మొదటి సారి రెండు ఫోన్లను అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసాడు.ఆర్డర్ చేసిన ఫోన్స్ ను తిరిగి డబ్బులు క్లెయిమ్ చేసుకునేవాడు.

126 ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ బుక్ చేసాడు :
 

126 ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ బుక్ చేసాడు :

ఈ కేటుగాడు ఏకంగా 126 ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ ను బుక్ చేసాడు అది కూడా రెండు నెలల వ్యవధిలోనే . ఈ కుర్రాడు ప్లే చేసిన ట్రిక్స్ కు ఎంతటి వారైన కంగుతింటారు. అతను చేసిన యాబై లక్షల నష్టం దాటినా తరువాత కూడా అమెజాన్ కు వాడు కొడుతున్న దెబ్బ తెలియలేదు. విషయం తెలుసుకొని పోలీస్లను ఆశ్రయించింది అమెజాన్.

ప్లే చేసిన ట్రిక్స్ ఏంటంటే:

ప్లే చేసిన ట్రిక్స్ ఏంటంటే:

అమెజాన్ నుంచి చాలా ఖరీదైన యాపిల్,సాంసంగ్,వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల ఫోన్స్ ను వేరే వేరే ఫోన్ నంబర్ల చిరునామాతో ఆర్డర్ పెట్టేవాడు . అతనకి సిమ్ కార్డు సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్నపాటి టెలికాం స్టోర్ ఓనర్ సహకరించాడు. సచిన్ జైన్ ఏకంగా 141 ఫ్రీ యాక్టీవ్టెడ్ సిమ్స్ ను శివమ్ చోప్రా కు ఇచ్చాడు,ఆ సిమ్స్ ను ఉపయోగిస్తూ శివమ్ ప్రొడక్ట్స్ ను కొనేవాడు. ఓ తప్పుడు చిరునామాతో తొలుత ఆర్డర్ చేసి శివమ్ సదరు ప్రోడక్ట్ డెలివరీ చేసేందుకు వచ్చే బాయ్ ఆ చిరునామా లో లేరని తెలుసుకొని కాల్ చేయగా సమీపం లో ఉండే శివమ్ తన డ్రామా కు తెరేలేపేవాడు చిరునామా మారిందని ఫలానా చోటు కి రమ్మని చెప్పి ఓ రెండు సంధులు అటు ఇటు తిప్పించి ఆ బాయ్ ను కలిసి డెలివరీ తీసుకునేవాడు.డెలివరీ బాయ్ వెళ్ళగానే అమెజాన్ కు కాల్ చేసి కాలిగా ఉన్న ఫోన్ డబ్బా తనకు ఇచ్చి వెళ్లార ని ఫిర్యాదు చేసేవాడు అప్పటికే శివమ్ డబ్బులు చెల్లించినట్టు వారి వద్ద సమాచారం ఉంటుంది కాబట్టి పాలసీ ప్రకారం వెంటనే రిఫండ్ అందుతుంది . ఇలా 126 ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ దొంగిలించాడు శివమ్ చోప్రా.

అమెజాన్ ఫిర్యాదుతో రంగం లోకి దిగిన పోలీసులు:

అమెజాన్ ఫిర్యాదుతో రంగం లోకి దిగిన పోలీసులు:

అమెజాన్ ఫిర్యాదుతో రంగం లోకి దిగిన పోలీసులు శివమ్ చోప్రా నుంచి 19 సెల్ ఫోన్స్ మరియు రూ. 12లక్షల నగదు, 40 బ్యాంకు పాసుబుక్స్ మరియు చెక్కులు సీజ్ చేసారు.

Best Mobiles in India

English summary
A 21-Year-Old Cheated Amazon Of Rs 50 Lakh By Claiming Fraudulent Refunds On 166 Smartphones!.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X