Home
News

'పోర్న్ హబ్' చెల్లింపులను నిలిపివేసిన Mastercard మరియు Visa ! మరి ఎలా ?

By Maheswara

పోర్న్‌హబ్ అతిపెద్ద ఆన్‌లైన్ అడల్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఇది ప్రొఫెషనల్ మరియు వినియోగదారులు సృష్టించిన కంటెంట్ తో విస్తారమైన లైబ్రరీని అందిస్తుంది. ఇటీవల, తక్కువ వయస్సు గల బాలికలను కలిగి ఉన్న వీడియోలను హోస్ట్ చేయడంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. న్యూయార్క్ టైమ్స్ ద్వారా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఈ అడల్ట్ వీడియోల ప్లాట్‌ఫామ్ తక్కువ వయస్సు గల అమ్మాయిలను అశ్లీల వీడియోలలో చూపించడమే కాక, ఇతర కార్యకలాపాలు కూడా కొనసాగిస్తోంది. ఈ కారణంగా మాస్టర్ కార్డ్ మరియు వీసాతో సహా ప్రముఖ ఆన్ లైన్ నగదు చెల్లింపు వ్యాపారులు పోర్న్‌హబ్‌తో సంబంధాలను తెంచుకోనున్నారు.

వార్త సంస్థలకు ఇచ్చిన ప్రకటనలలో

వార్త సంస్థలకు ఇచ్చిన ప్రకటనలలో

పోర్న్‌హబ్ చెల్లింపులను ప్రాసెస్ చేయడాన్ని మాస్టర్ కార్డ్ నిలిపివేసింది. ఇకపై మాస్టర్ కార్డులను ఈ వెబ్సైటు చెల్లింపులకు ఉపయోగించడానికి అనుమతించదు. వీసా కార్డు కూడా తమ వాడకాన్ని నిలిపివేస్తోంది. ఇంకా ఈ పోర్న్ హబ్ విషయంలో తమ స్వంత దర్యాప్తును నిర్వహిస్తుందని ప్రముఖ వార్త సంస్థ నివేదించింది. వార్త సంస్థలకు ఇచ్చిన ప్రకటనలలో, పోర్న్‌హబ్‌లోని అక్రమ కంటెంట్ కారణంగా ఈ చర్య జరిగిందని రెండు సంస్థలు పేర్కొన్నాయి.

మాస్టర్ కార్డు మరియు వీసా కార్డులు

మాస్టర్ కార్డు మరియు వీసా కార్డులు

మరొక ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ ప్రకారం, పోర్న్‌హబ్, మాస్టర్ కార్డ్ మరియు వీసా నిర్ణయం తమను "నిరాశపరిచింది" అని తెలియచేసింది. వారు మాట్లాడుతూ, "ఈ వార్త  జీవనోపాధి కోసం మా వేదికపై ఆధారపడే వందల, వేల మంది మోడళ్లకు జీవనోపాధిని నష్టపరచడమేనని పేర్కొంది."

పేపాల్, పోర్న్‌హబ్ చెల్లింపులను నిలిపివేసిన ఒక సంవత్సరం తర్వాత ఈ నిర్ణయం గమనించతగ్గ విషయం. పేపాల్ చెల్లింపుల నిలిపివేత తర్వాత వినియోగదారులు కు  పేమెంట్ చేయడానికి చాల తక్కువ ఎంపికలు ఉండేవి. ఇప్పుడు మాస్టర్ కార్డు మరియు వీసా కార్డు లు కూడా చెల్లింపులు నిలిపి వేయడంతో వినియోదారులు చెల్లింపులు ఎలా చేయాలో ఆలోచించాల్సిందే.

 చట్టవిరుద్ధమైన

చట్టవిరుద్ధమైన

డీప్‌ఫేక్‌లు మరియు గర్ల్స్ డు పోర్న్  కేసు వంటి చట్టవిరుద్ధమైన మరియు ఏకాభిప్రాయం లేని కంటెంట్‌ను హోస్ట్ చేసినందుకు పోర్న్‌హబ్ కొన్నేళ్లుగా విమర్శలు ఎదుర్కొంది. అయితే టైమ్స్ నివేదిక ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పెద్ద కంపెనీలు ఈ విషయం పై చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Mastercard And Visa Stops Processing Pornhub Payments 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X