నివ్వెరపరిచే నిజాలు: చిన్న పిల్లల రక్తంతో బ్యాటరీలు

దిగ్గజ కంపెనీలు చిన్న పిల్లల రక్తంతో బ్యాటరీలు తయారుచేస్తున్నాయని సర్వే చెబుతున్న వాస్తవాలు ఇప్పుడు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి.

By Hazarath
|

టెక్ గాడ్జెట్లలో వాడే ముడి పదార్థాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక మంది లైక్ చేస్తోన్న కోబాల్ట్ ,లిధియం ,అయాన్ బ్యాటరీల్లో వాడే పదార్థం ఎక్కడ నుంచి వస్తోంది. ఆ కేంద్రంలో పనిచేసే కార్మికులు ఎవరు..? ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు తమ ముడిసరుకును ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇలా ఎన్నో అంశాల మీద ఆధారపడిన ఒకే ఒక అంశం ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా చేస్తోంది. దిగ్గజ కంపెనీలు చిన్న పిల్లల రక్తంతో బ్యాటరీలు తయారుచేస్తున్నాయని సర్వే చెబుతున్న వాస్తవాలు ఇప్పుడు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి.

Read more : ప్రపంచంలో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు..

ప్రముఖ టెక్ గాడ్జెట్లలో వాడే ముడి పదార్థాలు

ప్రముఖ టెక్ గాడ్జెట్లలో వాడే ముడి పదార్థాలు

ప్రముఖ టెక్ గాడ్జెట్లలో వాడే ముడి పదార్థాలు బాల కార్మికుల కష్టాల్లోని భాగాలేనని ఓ తాజా నివేదిక వెల్లడించింది. వారి రక్తంతోనే ఈ బ్యాటరీలు తయారవుతున్నాయని ఆ నివేదిక వెల్లడించిన వాస్తవాలు ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి.

టరీల్లో ప్రముఖంగా వాడే పదార్థం

టరీల్లో ప్రముఖంగా వాడే పదార్థం

ప్రపంచంలో అత్యధిక భాగం జనం ఆదరిస్తున్నకోబాల్డ్, లిథియం అయాన్ బ్యాటరీల్లో ప్రముఖంగా వాడే పదార్థం సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో చిన్న తరహా మైనింగ్ కేంద్రాలనుంచి వస్తుందని, ఈ కేంద్రాల్లో పని చేసే కార్మికులు సుమారు ఏడు సంవత్సరాల వయసులోపు వారే ఉంటారని సర్వే చెప్తోంది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఆపిల్, శామ్సంగ్, సోనీ, మైక్రోసాఫ్ట్ తయారీదారులు కాంగో డెమొక్రెటిక్ రిపబ్లిక్ గనులనుంచి కోబాల్డ్ ను సేకరిస్తున్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి.

కొత్త టెక్నాలజీని వాడుకుంటూ ఆనందిస్తున్న కోట్లమంది జనాభాలో

కొత్త టెక్నాలజీని వాడుకుంటూ ఆనందిస్తున్న కోట్లమంది జనాభాలో

కొత్త టెక్నాలజీని వాడుకుంటూ ఆనందిస్తున్న కోట్లమంది జనాభాలో ఏ ఒక్కరూ ఆ విషయాన్ని ఆలోచించరని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవహక్కుల పరిశోధకుడు.. మార్క్ డమ్మెట్ ఓ ప్రకటనలో తెలిపారు. వారికి కావాల్సింది టెక్నాలజీ కొత్తగా ఏం వస్తుందా అని మాత్రమేనని ఆయన చెబుతున్నారు.

కళాత్మకంగా అమ్మకాలు జరిపే ఆ వస్తువుల వెనుక

కళాత్మకంగా అమ్మకాలు జరిపే ఆ వస్తువుల వెనుక

షాపింగ్ మాల్స్ లో పేర్చి, కళాత్మకంగా అమ్మకాలు జరిపే ఆ వస్తువుల వెనుక.. ఇరుకైన సొరంగాల్లో... రాళ్ళ సంచులు మోస్తూ, బాల్యం మసకబారుతోందని, శాశ్వత ఊపిరితిత్తుల సమస్యలకు ఆ బాలకార్మికులు గురౌతున్నారని ఆయన అన్నారు. చిన్న పిల్లలు తమ జీవితాలను అక్కడ పనంగా పెడుతున్నారని ప్రానాలను సైతం కోల్పోతున్నారని ఆయన వెల్లడించారు.

భూగర్భ సొరంగాల్లో ఈ మైనర్లు బేసిక్ టూల్స్ ను

భూగర్భ సొరంగాల్లో ఈ మైనర్లు బేసిక్ టూల్స్ ను

భూగర్భ సొరంగాల్లో ఈ మైనర్లు బేసిక్ టూల్స్ ను ఉపయోగించి సుమారు 12 గంటల పాటు పనిచేస్తే వారికి ఒకటినుంచి రెండు డాలర్లు చెల్లిస్తారని రిపోర్టులు చెప్తున్నాయి. దీని కోసం వారు తిండి తిప్పలు నిద్ర అన్నీ మరచిపోయి ఆ గనుల్లో పనిచేస్తున్నారని ఎంతో ప్రమాదకరంగా జీవితాన్ని గడుపుతున్నారని నివేదిక నిజాలను నిగ్గు తేల్చింది.

సొరంగాల్లో మిగిలిపోయిన రాళ్ళు, కోబాల్ట్ ను

సొరంగాల్లో మిగిలిపోయిన రాళ్ళు, కోబాల్ట్ ను

సొరంగాల్లో మిగిలిపోయిన రాళ్ళు, కోబాల్ట్ ను చిన్నారులు వెలికి తీస్తే... దాన్ని మధ్యవర్తులు అమ్మకాలు జరిపి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సింహభాగం చైనాకే ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

భారీ లోడ్ లు మోసుకెళ్ళే ఈ గనుల్లో

భారీ లోడ్ లు మోసుకెళ్ళే ఈ గనుల్లో

భారీ లోడ్ లు మోసుకెళ్ళే ఈ గనుల్లో సుమారు 40,000 మంది పిల్లలు రోజుకు పన్నెండు గంటలపాటు పనిచేస్తున్నట్లుగా 2014 లోనే యునిసెఫ్ అంచనా వేసింది. పిల్లల కోసం పోరాడుతున్న సంస్థలన్నీ ఇప్పుడు ఏమైపోయాయో తెలియని పరిస్థితి.

చైనా, దక్షిణ కొరియాల్లోని బ్యాటరీ తయారీదారులు

చైనా, దక్షిణ కొరియాల్లోని బ్యాటరీ తయారీదారులు

ఈ పదార్థాలను ఎగుమతి దారులునుంచి చైనా, దక్షిణ కొరియాల్లోని బ్యాటరీ తయారీదారులు కొనుగోలు చేసి, వాటి ఉత్పత్తులను ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన టెక్ కంపెనీలకు సప్లై చేస్తున్నట్లు ఆమ్నెస్టీ వివరిస్తోంది. దిగ్గజ కంపెనీలకు దాని వెనుక కష్టం కన్నా అది బాగా ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నాయని చెబుతున్నారు,

అయితే శామ్సంగ్, సోనీ సహా... పలు కంపెనీలు

అయితే శామ్సంగ్, సోనీ సహా... పలు కంపెనీలు

అయితే శామ్సంగ్, సోనీ సహా... పలు కంపెనీలు ఈ విషయాన్ని నిర్థారించేందుకు, అంగీకరించేందుకు నిరాకరించాయి.ఈ విషయంపై మేము ఇప్పుడు ఏమీ మాట్లాడలేమని విషయాన్ని నిర్థారించుకున్న తరువాతే మేమే దీనిపే స్పందిస్తమాని అంటున్నారు.

కాగా యాపిల్ సంస్థ మాత్రం

కాగా యాపిల్ సంస్థ మాత్రం

కాగా యాపిల్ సంస్థ మాత్రం కోబాల్ట్ సహా బ్యాటరీ పదార్థాల సరఫరా వెనుక బాలకార్మికులు ఉన్నారా లేదా అన్న విషయాలను గుర్తిస్తామని తెలిపింది. ఒక వేళ ఉంటే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇలా ఎగుమతి అయిన కోబాల్ట్ ను ప్రత్యేకంగా

ఇలా ఎగుమతి అయిన కోబాల్ట్ ను ప్రత్యేకంగా

ఇలా ఎగుమతి అయిన కోబాల్ట్ ను ప్రత్యేకంగా ఏ కంపెనీలు ఎటువంటి ఉత్సత్తుల్లో వినియోగిస్తున్నాయో నివేదికలు గుర్తించలేకపోయాయని... ఇది చింతించాల్సిన విషయమని మానవహక్కుల పరిశోధకుడు డమ్మెట్ విచారం వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా బాల కార్మికులు మాత్రం చీకటి గనుల్లో

ఏది ఏమైనా బాల కార్మికులు మాత్రం చీకటి గనుల్లో

ఏది ఏమైనా బాల కార్మికులు మాత్రం చీకటి గనుల్లో మగ్గిపోతున్నారని నివేదిక నిగ్గు తేల్చింది.పై బాలకార్మికులపై పోరాడుతున్న సంస్థలు ఈ విషయంపై మరింతగా స్పందిచాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Material In Your Smartphone May Have Been Mined By Children

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X