రాత్రి జాగారానికి చెక్.. చిన్నారులను నిద్రపుచ్చే ఫోన్ అప్లికేషన్!!

Posted By: Prashanth

రాత్రి జాగారానికి చెక్.. చిన్నారులను నిద్రపుచ్చే ఫోన్ అప్లికేషన్!!

 

కొత్తగా తల్లిదండ్రులయిన వారు ఇక పై తమ పిల్లలను నిద్రపుచ్చటానికి ఆపసోపాలు పడనక్కర్లేదు... రాత్రళ్లు నిద్రమాని వారి కోసం జాగారం చేయ్యాల్సిన శ్రమ అంతకన్నా లేదు. రాత్రుళ్లు మారాం చేస్తున్న తన కవల పిల్లలను నిద్రపుచ్చటం కోసం బ్రిటన్‌కు చెందిన మాథ్యు నిఫీల్డ్ రూపొందించిన ‘వైట్ నాయిస్ అంబియన్స్’ అనే ఫోన్ అప్లికేషన్ ఇప్పుడు కొన్ని వందల దంపతుల కష్టాలను తీరుస్తుంది.

ఫోన్ లేటా టా్బ్లెట్ కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈ అప్లికేషన్ కొన్ని రిలాక్సింగ్ శబ్ధాలను వినిపిస్తుంది. తద్వారా పిల్లలు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో లక్షలాది మంది దీనిని వాడడం ప్రారంభించారు. అప్లికేషన్‌కు డిమాండ్ పెరగటంతో మాథ్యు సంవత్సారానికి దాదాపు 54 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.

ఇంటిని శుభ్రపరిచే కోకోరోబో!!

మీ ఇంట్లో ఆడవారికి రోజు రోజుకు శారీరక శ్రమ ఎక్కువవుతుందా..?, వారికి మీరు ఏ విధంగా సహాయ పడలేపోతున్నారా..?, గృహిణిలు శ్రమ భారాన్ని కాస్తలో కాస్తంతైనా తగ్గించేందుకు జపాన్ సంస్థ షార్ప్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సాంకేతికత సాయంతో ఇంటిని శుభ్రపరిచే రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ ఈ సంస్థ వృద్థి చేసింది. ఈ వాక్యూమ్ క్లీనర్ పేరు కోకోరోబో(Cocorobo).ఇంగ్లీష్, చైనీస్, జపనీస్ భాషలను ఈ డివైజ్ మాట్లాడగలదు. ఐఫోన్ ఆధారితంగా ఈ క్లీనర్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందుకు గాను, క్లీనర్‌లో నిక్షిప్తం చేసిన కోకోరోబో అప్లికేషన్‌ను ఐఫోన్‌కు అనుసంధానం చేసుకోవల్సి ఉంటుంది. ఈ సౌలభ్యతతో క్లీనర్ పనితీరును ప్రత్యక్షంగా తిలకించవచ్చు. రోబోలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్స్ క్లీనింగ్ సమయంలో ఇంట్లోని వస్తువులకు ఏ విధమైన హానిని కలగకకుండా జాగ్రత్తవహిస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot