ఒక్క ఫోటోతో ఎమ్మెల్యే టికెట్ పోయింది

Written By:

అత్యుత్సాహానికి పోయి ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసినందుకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ నే పోగోట్టుకుంది. లడ్డు లాంటి అవకాశం కాళ్ల దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోయింది. తన ఫోటోనే ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తావా అంటూ పార్టీ అధినేత ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిరాకరించారట. ఇంతకీ ఇది ఏ పార్టీ..ఎవరు ఎవరి ఫోటోను పెట్టారనేగా మీ డౌటు..అయితే ఇంకెందుకాలస్యం న్యూస్ చదివేయండి మరి.

read more :సోషల్ మీడియాను కుదిపేస్తున్న అబద్దపు ప్రచారం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో తనకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఓ ఫొటోను

ఫేస్‌బుక్‌లో తనకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన అభ్యర్థి టికెట్ ను బీఎస్పీ అధినేత్రి మాయావతి రద్దు చేసింది.

క్రమశిక్షణ పేరిట ఆమె ఈ చర్యలను

క్రమశిక్షణ పేరిట ఆమె ఈ చర్యలను తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో 2017 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ఇదే స్థానం నుంచి గతంలో సంగీత భర్త ధర్మేంద్ర చౌదరీ

ఈ ఎన్నికల్లో అట్రౌలీ నియోజకవర్గంలో సంగీతా చౌదరీ అనే మహిళకు సీటు ఇచ్చి బరిలోకి దించాలని పార్టీ వర్గాలు భావించాయి. ఎందుకంటే ఇదే స్థానం నుంచి గతంలో సంగీత భర్త ధర్మేంద్ర చౌదరీ పోటీ చేశాడు.

అతడు గత ఏడాది జనవరి నెలలో హత్యకు

కానీ, అతడు గత ఏడాది జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆయన భార్య సంగీతతో భర్తీ చేయాలని మాయావతి భావించారు.

తన కాళ్లను పట్టుకుంటూ సంగీత, ఆమె పిల్లలు

ఈలోగా, తన కాళ్లను పట్టుకుంటూ సంగీత, ఆమె పిల్లలు దండం పెడుతున్న ఫొటోను ఫేస్ బుక్ లో సంగీత పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

మాయావతిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు

మాయావతిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సంగీతకు ఇక ఆ సీటు ఇవ్వకూడదని నిర్ణయించి రద్దు చేశారు.

తాను కావాలని ఆ ఫొటోను పెట్టలేదని

అయితే, తాను కావాలని ఆ ఫొటోను పెట్టలేదని, ఆమె తనతో ఉన్నట్లుగా కనిపిస్తే విజయం వరిస్తుందని చెప్పే ఉద్దేశంతోనే ఆ ఫొటోని ఫేస్‌బుక్‌లో పెట్టానని సంగీత చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా అత్యుత్సాహంతో

ఏది ఏమైనా అత్యుత్సాహంతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోతో ఇప్పుడు ఆమె లబోదిబోమనే పరిస్థితి. చేతాలారా ఎమ్మెల్యే టికెట్ చేజార్చుకున్నట్లయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Wrie mayawati cancels ticket after candidates feet touching photos on facebook
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot