McAfee యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ మకాఫీ ఆత్మహత్య చేసుకున్నాడు!

|

McAfee యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ మకాఫీ బుధవారం బార్సిలోనాకు సమీపంలోని జైలులోని తన యొక్క గదిలో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడు. జాన్ మెకాఫీని అమెరికాకు రప్పించడానికి స్పానిష్ కోర్టు ఆమోదం తెలిపిన కొద్ది గంటలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. క్రిప్టోకరెన్సీ ప్రమోటర్ జాన్ మెకాఫీ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు.

 

జాన్ మెకాఫీ

జాన్ మెకాఫీ మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గతంలో కూడా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లకు పేరుగాంచిన జాన్, స్పానిష్ కూడా జైలులో ఆత్మహత్య చేసుకుని విషాదకరమైన మరణాన్ని పొందారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే తనని బతికించే ప్రయత్నం చేసారు. అయితే జైలు సిబ్బంది ప్రయత్నాలు ఫలించలేదు. జైలు యొక్క వైద్య బృందం మరణం చివరకు వారి మరణాన్ని ధృవీకరించిందని ప్రాంతీయ కాటలాన్ ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. జాన్ మెకాఫీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు మరియు అతన్ని ఎందుకు జైలులో పెట్టారో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Reliance Jio AGM ఈవెంట్‌ ప్రారంభం కానున్నది!! లైవ్ చూడాలని ఉందా??Reliance Jio AGM ఈవెంట్‌ ప్రారంభం కానున్నది!! లైవ్ చూడాలని ఉందా??

క్రిప్టోకరెన్సీ
 

క్రిప్టోకరెన్సీ మరియు టేనస్సీలోని రాజకీయ సమస్యల కారణంగా మెకాఫీ స్పెయిన్‌లో జైలు పాలయ్యాడు. అయితే పన్ను సంబంధిత నేరంపై 75 ఏళ్ల మెకాఫీని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ జాతీయ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ విషయం తెలిసిన కొద్ది సేపటికే జాన్ మెకాఫీ ఆత్మహత్యకు పాల్పడడం షాక్ ని ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన విచారణలో టేనస్సీలోని ప్రాసిక్యూటర్లు కూడా ఆయనపై వచ్చిన అభియోగాలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని పేర్కొన్నట్లు తెలిసింది.

స్పానిష్ క్యాబినెట్

మెకాఫీ యొక్క బాడీని కుటుంబ సభ్యులకు అందించడం కోసం కోర్టు ఉత్తర్వులలో భాగంగా అవసరమయ్యే ఏదైనా చివరి అప్పగింతల ఉత్తర్వులకు స్పానిష్ క్యాబినెట్ అనుమతి అవసరం. గత అక్టోబర్‌లో బార్సిలోనా అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న మెకాఫీని జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. క్రిప్టోకరెన్సీలను ప్రోత్సహించేటప్పుడు ఆదాయాన్ని నివేదించడంలో విఫలమైన తరువాత అదే నెలలో మెకాఫీపై ఆదాయ పన్ను సంబంధిత నేరం కూడా టేనస్సీలో దాఖలైంది. స్పానిష్ అధికారులు ప్రస్తుతం మెకాఫీ సెల్ వద్ద ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మకాలు లేక iPhone తయారీ నిలిపివేసిన Apple ? ఇక తర్వాత ఏంటి ...?అమ్మకాలు లేక iPhone తయారీ నిలిపివేసిన Apple ? ఇక తర్వాత ఏంటి ...?

మెకాఫీ

మెకాఫీ జీవనశైలిని పరిశీలిస్తే కనుక అతను విలాసవంతమైన జీవనశైలిని అనుభవించే వారిలో ప్రసిద్ధి చెందాడు. 2015 లో డబ్ల్యుబిబిజె-టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెకాఫీ ఆయుధాలు ఉన్నప్పుడు మాత్రమే సుఖంగా ఉన్నానని చెప్పాడు. జాక్ మకాఫీ ఎల్లప్పుడూ తన చేతిలో లోడ్ చేసిన తుపాకీని కలిగి ఉండాలని కోరిక అన్నట్లు టీవీ స్టేషన్ నివేదించింది. మకాఫీ ఒకసారి టీవీ స్టేషన్‌తో మాట్లాడుతూ "నా పడకగదిలో ఆయుధాలు కలిగి ఉండటం అంటే నాకు తక్కువ భద్రతను కలిగి ఉండడమే కాకుండా సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది." అని తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
McAfee Antivirus Software Founder Died in a Spanish Prision

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X