ఈ మెయిల్ సెక్యూరీటీ కోసం..!

Posted By: Super

ఈ మెయిల్ సెక్యూరీటీ కోసం..!

 

ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ ఎక్స్ఛేంజ్‌ హోస్టర్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్‌ సేవలందిస్తున్న గ్లోబల్‌ ఔట్‌లుక్‌ ఇ-మెయిల్‌ సెక్యూరిటీ అప్‌డేషన్‌ కోసం మెకాఫీ నిర్వహిస్తున్న ఫోకస్‌ కార్యక్రమంలో తన వంతు సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గ్లోబల్‌ ఔట్‌లుక్‌ ఈ-మెయిల్‌ ప్రధాన సేవగా మైక్రోసాఫ్ట్‌ కమ్యూనికేషన్‌ సర్వీసులను అందిస్తుందని సంస్థ సిఇఒ రఘుకుమార్‌ వివరించారు.

మేము అందించే ఈ-మెయిల్‌ సర్వీస్‌తో మెకాఫీ ప్రొడక్ట్‌ 'సాస్‌' ఫిల్టరింగ్‌ సర్వీస్‌ను అనుసంధానించడం ద్వారా ఏ విధమైన హార్డ్‌వేర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌లు కొనుగోలు చేయకుండానే రక్షణను పొందవచ్చని ఆయన తెలిపారు. ఏ విధమైన బ్యాక్‌-అప్‌లను రన్‌ చేయాల్సిన అవసరం రాకుండానే అంతర్జాతీయ స్థాయి రక్షణను పొందుతూ ఈ-మెయిల్‌ ద్వారా సంభవించే ప్రమాదాల నుంచి రక్షించుకోవడం ఎలానో తెలియజేశారు. ప్రస్తుతం సవాళ్లతో కూడిన ముప్పు నుంచి రక్షించడంలో వినియోగదారులకు ఎలా సాయపడేలా ఆలోచించి గ్లోబల్‌ ఔట్‌లుక్‌తో చేతులు కలిపామని మెకాఫీ నార్త్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ ఫెర్నాండో క్వింటెరో వివరించారు.

వైరస్‌లు, స్పామ్‌లు విపరీతంగా పెరిగిపోయి, వాటిద్వారా ముప్పు పొంచివున్న నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ-మెయిల్‌ డిఫెన్స్‌ సేవలను నిశితంగా పరిశీలించి దీన్ని తయారు చేశామని తెలిపారు. సున్నితమైన సమాచారానికి తగు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా దీనిని రూపొందిచామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot