కస్టమర్స్ కోసం వినూత్నంగా బిల్ బోర్డ్ క్యాంపెయిన్

Posted By: Staff

కస్టమర్స్ కోసం వినూత్నంగా బిల్ బోర్డ్ క్యాంపెయిన్

మెక్ డోనాల్డ్స్ ఇటీవల స్వీడెన్‌లో బిల్ బోర్డ్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఆ క్యాంపెయిన్‌లో పాల్గోన్నటువంటి ఉత్సాహావంతమైనటువంటి ఔత్సాహికులు చేయల్సింది ఏమిటంటే బిల్ బోర్డ్ గేమ్‌ని తన పర్సనల్ గేమ్‌గా మార్చుకోని ఎవరైతే 30 సెకన్లులలో పూర్తి చేస్తారో అటువంటి వారికి దగ్గరలో ఉన్నటువంటి మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్ పుడ్ కూపన్స్ ప్రీగా ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతో చాలా మంది ఔత్సాహికులు ఇందులో పాల్గోని మెక్ డోనాల్డ్స్ క్యాంపెయిన్‌ని విజయవంతం చేయడం జరిగింది.

కాకపోతే ఇక్కడ మీరు గేమ్‌ని ఆడాలంటే మీ మొబైల్ ఫోన్‌లోకి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో చాలా మంది ఔత్సాహికులు ఒకింత అసహానానికి గురి కావడం జరిగింది. దీంతో మెక్ డోనాల్డ్స్ క్యాంపెయిన్ మెంబర్స్ ఫోన్ ద్వారా వెబ్ సైట్‌ అడ్రస్‌కి కనెక్ట్ అయ్యి గేమ్‌ని ఆడవలసిందిగా కోరడం జరిగింది. ఈసందర్బంలో మెక్ డోనాల్డ్స్ యాజమాన్యం మాట్లాడుతూ ఇలాంటి క్యాంపెయిన్స్ చేయడం వల్ల ప్రజలలో, ముఖ్యంగా కస్టమర్స్‌లో మెక్ డోనాల్డ్స్ ప్రత్యేకతను చాటుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాబోయే కాలంలో కూడా ఇలాంటి బిల్ బోర్డ్స్ క్యాంపెయిన్స్‌ని మొబైల్స్ ద్వారా నిర్వహించి మెక్ డోనాల్డ్స్ కస్టమర్స్‌కి అనుభూతిని ఇవ్వనుందని తెలిపారు. నిజంగా బిజినెస్‌ని అభివృద్ది చేసుకోవడానికి కొన్ని కొన్ని కంపెనీలు వాడేటటువంటి క్యాంపెయిన్స్ నిజంగా మెచ్చుకోదగ్గవి.

మెక్ డోనాల్డ్స్ బిల్ బోర్డ్ క్యాంపెయిన్ వీడియో:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting