Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 12 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మేడారం జాతరలో జియో 4జీ ఆఫర్లు, జియోఫోన్ కొనేందుకు ప్రత్యేక స్టాళ్లు !
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో జియో తన 4జీ డిజిటల్ సేవలతో భక్తులకు కనువిందు చేయనుంది. ఈ ఆదివాసీ మహా జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు జియో మొబైల్ సేవలను ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు జియో సకల ఏర్పాట్లను చేస్తోంది. ఈ మేరకు తెలంగాణా జియో సీఈఓ కె.సి.రెడ్డి జియో సేవలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. వినియోగదారులకు చేరవ కావాలన్నదే జియో లక్ష్యమని తెలిపారు.

జాతరకు హాజరయ్యే భక్తులకు..
ఈ జాతరకు హాజరయ్యే భక్తులకు 4జీ మొబైల్ సేవలను నిరంతరాయంగా అందించేందుకు అక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలలో కూడా భక్తులకు జియో నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో పేర్కొంది.
Image source : sakshi

డిజిటల్ విప్లవాన్ని..
ఈ జాతరలో పాల్గొనేందుకు తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రానుండటంతో జియో సేవలను అందించాలని నిర్ణయించుకున్నామని, దీంతో పాటు డిజిటల్ విప్లవాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని జియో చెబుతోంది.
Image source : sakshi

జియో ఫోన్ ఈ స్టాళ్లలో..
ఇక జియో ఫోన్ ఈ స్టాళ్లలో కనువిందు చేయనుంది. కొత్తగా జియోఫోనే కొనేందుకు జాతరలో జియో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

సంచలన ఆఫర్ రూ.49ను..
దీంతో పాటు ఇటీవలే జియోఫోన్ వినియోగదారులకు ప్రవేశపెట్టిన సంచలన ఆఫర్ రూ.49ను జాతరలో ప్రత్యేక స్టాళ్లలో అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 49 చెల్లించి నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా మాట్లాడేందుకు ఈ ఆఫర్ వీలు కల్పిస్తోంది.

జియో ఫోన్ ఫీచర్లు
2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

బీఎస్‌ఎన్‌ఎల్ విస్తృత ఏర్పాట్లు..
ఇక మేడారం జాతర కోసం బీఎస్‌ఎన్‌ఎల్ విస్తృత ఏర్పాట్లు చేసింది. వరంగల్ నుంచి మేడారం వరకు 22 టవర్ల ద్వారా 2జీ, 3 జీ సేవలు అందిస్తున్నట్లు, మేడారంలో ప్రత్యేకంగా 17 తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం నరేంద్ర వెల్లడించారు.

భక్తులందరికీ వైఫై సేవలు..
తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సౌజన్యంతో భక్తులందరికీ వైఫై సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వైఫై సేవల కోసం 20 హాట్‌స్పాట్‌లు, 80 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వినియోగదారుడు రోజుకి 500 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు నరేంద్ర పేర్కొన్నారు.

ఓటీపీ ద్వారా వైఫై సేవలు..
భద్రత కోసం ట్రాయ్ నిబంధన ప్రకారం ఓటీపీ ద్వారా వైఫై సేవలు అందుబాటులో ఉంటాయని, ఒకేసారి 20 వేల మంది, 24 గంటల్లో 3 లక్షల మంది వైఫై సేవలు వినియోగించుకునేలా పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వానికి, ఎన్పీడీసీఎల్, మీడియా కోసం ప్రత్యేక లీజ్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
source: sakshi
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470