బడ్జెక్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో MediaTek 5G చిప్‌సెట్‌!!

|

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో అన్ని రకాల బ్రాండ్ సంస్థలకు చిప్‌సెట్‌లను అందిస్తున్న ప్రముఖ మీడియాటెక్ సంస్థ ఇప్పుడు శుభవార్తను తీసుకువచ్చింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు 5G టెక్నాలజీ మీద దృష్టి పెడుతున్నది. అందుకోసం సంస్థ తన 5G చిప్‌సెట్‌ ఉత్పత్తి శ్రేణిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది.

 

మీడియాటెక్ 5G మొబైల్ చిప్‌సెట్ సిరీస్

మీడియాటెక్ 5G మొబైల్ చిప్‌సెట్ సిరీస్

మీడియాటెక్ సంస్థ ఈ నెలలో తన కొత్త 5G మొబైల్ చిప్‌సెట్ సిరీస్‌ను ఆవిష్కరించనున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆసక్తికరమైన మరొక విషయం ఏమిటంటే ఈ 5G చిప్‌సెట్‌లు ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా తీసుకువస్తున్నట్లు సంస్థ పేర్కొంది. తైవానీస్ ఫ్యాబ్ లెస్ సెమీకండక్టర్ సంస్థ ఈ ఏడాది 2020లో తన 5G చిప్‌ల రవాణా అంచనాలను సవరించింది. ఫిబ్రవరిలో దీని యొక్క అంచనాలను 200 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్చింది.

 

Also Read: Jio-Google ఒప్పందం!!! చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గడ్డు కాలం మొదలైనట్లే...Also Read: Jio-Google ఒప్పందం!!! చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గడ్డు కాలం మొదలైనట్లే...

మీడియాటెక్ 5G చిప్‌సెట్ సరసమైన ధరలో
 

మీడియాటెక్ 5G చిప్‌సెట్ సరసమైన ధరలో

సంస్థ ప్రొజెక్షన్‌ను సవరించిన తరువాత మీడియాటెక్ తన కొత్త 5G SoC లను డైమెన్సిటీ 800 మరియు డైమెన్సిటీ 600 సిరీస్‌లో విడుదల చేసింది. సంస్థ యొక్క తదుపరి చిప్‌సెట్లు మరింత తక్కువ ధరకు కూడా చేరుకోవచ్చు. పరిశ్రమ వర్గాలను ఆచర్యపరుస్తూ 5G కొత్త ప్రాసెసర్లు ఈ నెల చివరిలో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్‌ఫోన్‌లలో వస్తాయని పేర్కొంది. క్వాల్‌కామ్ ఇటీవలే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్నాప్‌డ్రాగన్ 690 5G చిప్‌సెట్‌ను విడుదల చేయడంతో మీడియాటెక్ సంస్థ దీని కంటే సరసమైన ధర పాయింట్ వద్ద వెళ్ళాలని చూస్తోంది.

 

Also Read: రక్షాబంధన్ కానుకగా ఇవ్వడానికి బెస్ట్ స్మార్ట్ ఫోన్లు,రూ.10000 ల లోపు.Also Read: రక్షాబంధన్ కానుకగా ఇవ్వడానికి బెస్ట్ స్మార్ట్ ఫోన్లు,రూ.10000 ల లోపు.

మీడియాటెక్ vs క్వాల్‌కామ్ vs శామ్‌సంగ్

మీడియాటెక్ vs క్వాల్‌కామ్ vs శామ్‌సంగ్

క్వాల్‌కామ్, హువాయి మరియు శామ్‌సంగ్ సంస్థలు 5G చిప్‌సెట్ తయారీ వ్యాపారంలో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే మీడియాటెక్ సంస్థ కూడా వీటికి పోటీగా తరువాత స్థానాలలో ఉన్నాయి. ఇది డైమెన్సిటీ 1000L, డైమెన్సిటీ 1000, డైమెన్సిటీ 800 మరియు డైమెన్సిటీ 820 సమర్పణలలో 5G చిప్‌సెట్లను ఇప్పటికే ప్రవేశపెట్టింది. సంస్థ యొక్క కొత్త సిరీస్ డైమెన్సిటీ 600 సిరీస్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇది వాణిజ్య మార్కెట్లో ప్రారంభించబడటానికి ముందే భారీ ఆర్డర్‌లతో దూసుకుపోతున్నది. ఈ నెల ముగియడానికి ఇంకా కేవలం రెండు వారాలు మిగిలి ఉండటంతో మీడియాటెక్ యొక్క కొత్త లాంచ్ గురించి అధికారిక వివరాలను త్వరలో చూడవచ్చు.

5G చిప్‌సెట్ మార్కెట్

5G చిప్‌సెట్ మార్కెట్

COVID-19 వ్యాప్తి అధికం అవ్వడంతో ప్రాసెసర్ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎంట్రీ లెవల్ ధర విభాగంలో 5G చిప్‌సెట్ ను తీసుకువచ్చిన మొదటిది సంస్థ మీడియా టెక్. ఇది ఇప్పటికే గేమింగ్ పనితీరును సరసమైన స్మార్ట్‌ఫోన్‌లలో కూడా మెరుగ్గా అందిస్తున్నది. స్పష్టంగా చెప్పాలంటే దీని యొక్క తదుపరి సరిహద్దు 5G ని బడ్జెక్ట్ ధర స్మార్ట్‌ఫోన్‌లలో కూడా అందుబాటులో ఉంచడం. షియోమి, రియల్‌మి వంటి సంస్థలు ఇందులో భాగస్వాములుగా చేరతారో లేదో అన్న విషయం ముందు ముందు చూడాలి.

Best Mobiles in India

English summary
MediaTek 5G Chipset Launching on Entry-Level Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X