5G మీడియాటెక్ ప్రాసెసర్ రాకకు రంగం సిద్ధం

|

ఈ ఏడాది పొడవునా మీడియాటెక్ చాలా చురుకుగా పనిచేసింది. క్వాల్‌కామ్ మరియు హువాయి వంటి ప్రసిద్ధ చిప్‌సెట్ తయారీదారులతో పోటీ పడటానికి అవసరమైన ఎటువంటి పరిస్థితులను వదిలిపెట్టలేదు. జూలై నెలలో కంపెనీ మీడియాటెక్ G90 గేమింగ్ చిప్‌సెట్‌ను ప్రారంభించింది. దీనికి గాను అందరి వద్ద నుండి చాలా ప్రశంసలు లభించాయి.

 మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్

ఇప్పుడు ఆండ్రాయిడ్ యొక్క మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ విభాగంలో తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ ద్వారా 5G ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 26 న కంపెనీ తన 5G చిప్‌సెట్‌ను ఆవిష్కరించడానికి సన్నద్ధమైంది. ఆ రోజున జరగబోయే లాంచ్ ఈవెంట్ సందర్భంగా కంపెనీ ఈ చిప్ ను ఆవిష్కరించనున్నది.

 

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865Soc రిలీజ్ ఎప్పుడో తెలుసా?క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865Soc రిలీజ్ ఎప్పుడో తెలుసా?

మీడియాటెక్ 5G ప్రాసెసర్

మీడియాటెక్ 5G ప్రాసెసర్

మీడియాటెక్ కంపెనీ ఇప్పటికే 5G కనెక్టివిటీని అందించడానికి 6GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకునే హెలియో M70 5G మోడెమ్‌ను సిద్ధం చేసింది. క్యూ 1 2020 లో చిప్‌సెట్ వాణిజ్యపరంగా వెళ్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. మీడియాటెక్ సమ్మిట్ సందర్భంగా నవంబర్ 26 న కంపెనీ దీనిని ఆవిష్కరించనున్నది. ఇది రాబోయే క్వాల్‌కామ్ చిప్‌సెట్ కంటే ముందుగానే మార్కెట్ లోకి రానున్నది. హెలియో M70 చిప్‌సెట్‌ను ఏ పరికరాలు ఉపయోగించుకోబోతున్నాయో త్వరలో తెలుపనున్నారు.

 

రోజుకు 3GB డేటాతో వోడాఫోన్ కొత్త RS.569 ప్రీపెయిడ్ ప్లాన్రోజుకు 3GB డేటాతో వోడాఫోన్ కొత్త RS.569 ప్రీపెయిడ్ ప్లాన్

డ్యూయల్-మోడ్

MT6873 చిప్‌సెట్‌తో ఎక్కువగా ఉపయోగించబడే సరసమైన హేలియో M70 SA / NSA డ్యూయల్-మోడ్ 5G మోడెమ్‌లు మరియు చిప్‌సెట్‌లో ఎక్కువగా కార్టెక్స్- A76 కోర్లు మరియు 7nm ఫిన్‌ఫెట్ ప్రాసెస్ ఉంటుంది. మునుపటి తరం MT6885 చిప్‌సెట్‌తో పోల్చినప్పుడు MT6873 పరిమాణం 25% తక్కువగా ఉంటుంది. ఏదేమైనా ఇది 2020 క్యూ 2లో భారీ ఉత్పత్తిలోకి ప్రవేశించనున్నది. కాబట్టి సంస్థ యొక్క సరసమైన 5G ప్రణాళికలు వచ్చే ఏడాది మధ్యలో రియాలిటీ అవుతాయని ఆశించవచ్చు.

 

Airtel Xstream Fibre: RS.699లకే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్Airtel Xstream Fibre: RS.699లకే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

లీకైన ఫోటోలు

లీకైన ఫోటోలు

లీకైన ఫోటోలను దగ్గరగా చూస్తే రాబోయే మీడియాటెక్ చిప్‌సెట్ MT6885Z వద్ద వస్తుందని తెలుస్తున్నది. MT6885Z చిప్‌సెట్ ప్రస్తుతం ఇప్పుడు లీక్ అయింది. ముందుగా వచ్చిన పుకార్లను విషయం లాగానే MT6885Z చిప్‌సెట్ గొప్పగా ఉన్నది. ఇది 7nm సిలికాన్ చిప్ ఆధారంగా ఉంటుంది.

 

BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్

చిప్‌సెట్ యొక్క కొన్ని ఫీచర్స్ -

చిప్‌సెట్ యొక్క కొన్ని ఫీచర్స్ -

- కార్టెక్స్- A77 CPU కోర్
- మాలి- G77 CPU కోర్
- sub-6 GHz ఫ్రీక్వెన్సీ సపోర్ట్
- మూడవ తరం AI ప్రాసెసింగ్ ఇంజిన్
- 80MP ఇమేజెస్ కెమెరా మద్దతు
- 4K 60fps వీడియో రికార్డింగ్

Best Mobiles in India

English summary
MediaTek 5G Processor Launch Event Set on November 26

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X