5G అప్‌గ్రేడ్ ఫీచర్లతో మీడియాటెక్ కంపెనీ కొత్త ప్రాసెసర్‌ను ప్రకటించింది!! పూర్తి వివరాలు ఇవిగో

|

స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి కావలసిన చిప్‌సెట్‌లను అందించడంలో మార్కెట్లో క్వాల్‌కామ్ సంస్థకు మీడియాటెక్ కంపెనీ గట్టి పోటీని ఇస్తోంది. క్వాల్‌కామ్ సంస్థ ఇటీవల 5g ఫీచర్లతో రెండు స్నాప్‌డ్రాగన్ చిప్‌లను విడుదల చేసింది. దీనికి పోటీగా ప్రముఖ తైవానీస్ చిప్‌సెట్ తయారీదారు మీడియాటెక్ దాని డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్‌లలో కొత్త చిప్‌సెట్‌ను విడుదల చేసింది. దీని యొక్క లాంచ్ తో మార్కెట్లో గణనీయమైన వృద్ధిని పెంచుకోవడంపై దృష్టిని పెట్టింది. సెమీకండక్టర్ తయారీదారు తన యొక్క అభివృద్ధిలో భాగంగా మీడియాటెక్ డైమెన్సిటీ 1050 అనే కొత్త చిప్‌సెట్‌ను ప్రారంభించి దాని పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ ప్రాసెసర్ మీడియాటెక్ 1100 చిప్‌సెట్ యొక్క బాయిల్డ్-డౌన్ వెర్షన్‌గా ప్రారంభించబడింది. ఇది డ్యూయల్ mmWave మరియు సబ్-6GHz 5G కనెక్టివిటీని కలిగి ఉన్న కంపెనీ యొక్క మొదటి ప్రాసెసర్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్‌సెట్‌ ఫీచర్లు

మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్‌సెట్‌ ఫీచర్లు

తైవానీస్ చిప్ మేకర్ కొత్తగా ప్రారంభించిన మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్‌సెట్‌ అనేది ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ 6nm ప్రాసెస్ ఆధారంగా తయారుచేసింది. అదనంగా ఇది 2.5GHz వద్ద పనిచేసే రెండు ARM కార్టెక్స్-A78 పనితీరు కోర్లను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ తయారీదారు దీని యొక్క కోర్ల వివరాలను ప్రకటించలేదు. అయినప్పటికీ ఇది 6 ARM కార్టెక్స్-A55గా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాసెసర్ ARM Mali-G610 GPUతో జత చేయబడి ఉండడమే కాకుండా మీడియాటెక్ యొక్క HyperEngine 5.0కి మద్దతుతో వస్తుంది. అలాగే మెరుగైన గేమింగ్ పనితీరు కోసం అదనపు ఆప్టిమైజేషన్ టూల్స్ మరియు ఫీచర్లను వినియోగదారులకు అందిస్తుంది.

 

స్మార్ట్‌ఫోన్‌(ఐఫోన్&ఆండ్రాయిడ్‌) లో ఏదైనా వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయడం ఎలా?స్మార్ట్‌ఫోన్‌(ఐఫోన్&ఆండ్రాయిడ్‌) లో ఏదైనా వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయడం ఎలా?

 

 

మీడియాటెక్ డైమెన్సిటీ 1050
 

మీడియాటెక్ డైమెన్సిటీ 1050 కొత్త చిప్ ప్రాసెసర్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD+ రిజల్యూషన్ స్క్రీన్‌లతో వస్తుంది. డివైస్ డిస్‌ప్లేలో హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ AV1 వీడియో డీకోడింగ్, HDR10+ ప్లేబ్యాక్ మరియు డాల్బీ విజన్‌కు చిప్‌సెట్ మరింత మద్దతునిస్తుంది. ఇది సబ్-6GHz (FR1) స్పెక్ట్రమ్‌లో 3CC క్యారియర్ అగ్రిగేషన్‌ను మరియు mmWave (FR2) స్పెక్ట్రమ్‌లో 4CC క్యారియర్ అగ్రిగేషన్‌ను అందిస్తుంది. అదనంగా LTE + mmWave అగ్రిగేషన్‌తో పోలిస్తే 53% వరకు వేగవంతమైన డౌన్‌లింక్ స్పీడ్‌లను అందజేస్తుందని పేర్కొంది. డైమెన్సిటీ 1050 SoC సూపర్‌ఫాస్ట్ Wi-Fi కనెక్టివిటీ కోసం Wi-Fi 6E మరియు 2×2 MIMO యాంటెన్నాకు కూడా మద్దతు ఇస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ

మీడియాటెక్ డైమెన్సిటీ 1050 కొత్త చిప్ mmWave 5G మరియు సబ్-6GHzలను నెట్‌వర్క్ బ్యాండ్‌లను మిళితం చేస్తుంది మరియు ఆక్టా-కోర్ CPUతో అల్ట్రా-సమర్థవంతమైన TSMC 6nm ఉత్పత్తి ప్రక్రియపై నిర్మించబడింది. డైమెన్సిటీ 1050 చిప్‌సెట్ మరియు దాని ఉప-6GHz మరియు mmWave టెక్నాలజీల కలయికతో ఎండ్-టు-ఎండ్ 5G అనుభవాలు, నిరంతరాయమైన కనెక్టివిటీ మరియు రోజువారీ వినియోగదారు డిమాండ్‌ను తీర్చడానికి అత్యుత్తమ పవర్ ఎఫిషియన్సీని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్‌సెట్‌లు

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్‌సెట్‌లు

అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ క్వాల్‌కామ్ టెక్నాలజీస్ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 మరియు స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 వంటి రెండు అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌లను ప్రకటించింది. ఇవి ప్రస్తుతం ఉన్న ప్రీమియం మరియు హై-టైర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ ఫోన్‌లలో ఉపయోగించనున్నారు. ఇప్పుడు ఉన్న ఫోన్లలో కంపెనీ అందిస్తున్న స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌కు అప్‌గ్రేడ్‌గా తాజా స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 తాజా చిప్‌సెట్ అనేది అందుబాటులోకి వస్తుంది. కౌంటర్ పాయింట్ మరియు IDC నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ SoC పరిశ్రమ షేర్‌లో గ్లోబల్ లీడర్ గా ఉన్న క్వాల్‌కామ్ టెక్నాలజీస్ తన యొక్క తాజా రెండు కొత్త చిప్‌సెట్‌ల పనితీరు ఏవిధంగా ఉండనున్నాయో అని ఆసక్తిని రేపుతున్నది.

Best Mobiles in India

English summary
MediaTek Company Announced 5G Enabled Dimensity 1050 New Chipset Processor: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X