MediaTek సంస్థ కొత్తగా 5G చిప్‌ను లాంచ్ చేసింది!! ప్రీమియం ఫోన్‌ల కోసం...

|

ప్రముఖ చిప్‌మేకర్ మీడియా టెక్ సంస్థ ఇప్పుడు కొత్తగా డైమెన్సిటీ 9000 5G పేరుతో కొత్త చిప్‌సెట్‌ను ప్రకటించింది. ఈ కొత్త చిప్‌సెట్‌ను ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించడం కోసం లాంచ్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇది ప్రస్తుతం క్వాల్‌కామ్ ఆధిపత్యంలో ఉంది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో యొక్క N4 చిప్‌మేకింగ్ ప్రక్రియను ఉపయోగించి ఈ కొత్త డైమెన్సిటీ 9000 5G చిప్ ను తయారు చేసారు. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించిన ప్రపంచంలోనే మొదటి చిప్ ఇదే అని తైవాన్ కంపెనీ Hsinchu పేర్కొంది. ఈ కొత్త చిప్స్ చిన్నవిగా ఉండడమే కాకుండా వేగంగా ఉంటాయి అని సంస్థ పేర్కొంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

MediaTek డైమెన్సిటీ 9000 5G చిప్

MediaTek డైమెన్సిటీ 9000 5G చిప్

ప్రస్తుతం ప్రపంచంలో మీడియా టెక్, క్వాల్‌కామ్ మరియు Samsung Electronics ముగ్గురు చిప్ తయారీదారులు మాత్రమే 5G స్మార్ట్‌ఫోన్ కోసం చిప్‌సెట్‌లను తయారు చేస్తున్నారు. వీరిలో మీడియా టెక్ సంస్థ డైమెన్సిటీ 9000 5G చిప్ తో పాటుగా ఆర్మ్-కార్టెక్స్ X2 నుండి శక్తివంతమైన కొత్త కంప్యూటింగ్ కోర్‌ను ఉపయోగించిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. సొంతంగా ఫోన్‌లను తయారు చేస్తున్న విభాగంలో నాల్గవ స్థానంలో Huawei సంస్థ ఉంది. అయితే ఇది గత రెండు సంవత్సరాల ముందు US మార్కెట్ నుండి బయటకు నెట్టబడింది.

Bharti Airtel 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు వాటి పూర్తి వివారాలుBharti Airtel 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు వాటి పూర్తి వివారాలు

MediaTek
 

US మార్కెట్ నుండి Huawei సంస్థ నిష్క్రమణ తరువాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల పెనుగులాటను సెట్ చేయడమే కాకుండా చైనీస్ బ్రాండ్ కలిగి ఉన్న వాటాను స్వాధీనం చేసుకోవడానికి వారిని అనుమతించింది. ఇప్పటికే MediaTek యొక్క చిప్‌లను ఉపయోగించే వాటిలో Xiaomi, Vivo మరియు Oppoతో సహా ఈ మార్కెట్ వాటా కోసం చాలా మంది పోటీదారులను లెక్కించింది. అయినప్పటికీ ఈ బ్రాండ్‌లు తమ తక్కువ మరియు మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల కోసం మాత్రమే దాని చిప్‌లను ఉపయోగిస్తాయి మరియు వారి హై-ఎండ్ పరికరాల కోసం Qualcomm Snapdragon చిప్‌లను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. కొత్తగా లాంచ్ చేయబడిన డైమెన్సిటీ 9000 చిప్ 5G విభాగంలోని క్లాస్‌లో మొదటిది. అంతేకాకుండా ఇది తమ ఫ్లాగ్‌షిప్ పరికరాలలో దాని ఆఫర్‌లను ఉపయోగించడానికి ఇష్టపడే కస్టమర్‌లను ఆకర్షించే లక్ష్యంతో ఉంటుంది అని MediaTek సంస్థ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డేవిడ్ పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ పనితీరును పెంచడానికి పాటించవలసిన చిట్కాలు...స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ పనితీరును పెంచడానికి పాటించవలసిన చిట్కాలు...

చిప్‌సెట్‌

ఈ ప్రీమియం విభాగంలోకి ప్రవేశించడానికి తమకు బలమైన సైన్యం అవసరమని మీడియా సమావేశంలో ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒక ఉత్పత్తి సరిపోదని మరియు డైమెన్సిటీ 9000 5G లాంచ్ కేవలం ప్రారంభ స్థానం మాత్రమేనని ఆయన తెలిపారు. ముఖ్యంగా MediaTek గత ఏడాది మొదటిసారిగా $10 బిలియన్ల ఆదాయాన్ని సాధించింది. కొత్త చిప్‌సెట్‌ల ప్రారంభంతో కంపెనీ ఈ ఏడాది $17 బిలియన్ల ఆదాయాన్ని చేరుకోవాలని చూస్తోంది. 4G చిప్‌లు $10కి విక్రయించబడినందున 5G చిప్‌లు $30 లేదా $50కి విక్రయించబడతాయని భావిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారా?? ఓ లుక్ వేయండిఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారా?? ఓ లుక్ వేయండి

మీడియాటెక్ హీలియో G96,G88చిప్

మీడియాటెక్ హీలియో G96,G88చిప్

మీడియాటెక్ Helio G96 చిప్ యొక్క ఫీచర్స్ గురించి లోతుగా పరిశీలిస్తే కనుక ఈ చిప్ ఫుల్-HD + రిజల్యూషన్ తో 120hz వరకు గల డిస్ప్లేలకు మద్దతును అందిస్తుంది. అలాగే ఇది DDIC సప్లై, C-PHY లేదా D- PHY ఇంటర్ఫేస్తో LCD మరియు AMOLED డిస్ప్లేలకు మద్దతును కలిగి ఉంటుంది. అలాగే ఇది 2.05GHz వరకు పనిచేయగల రెండు ఆర్మ్ కార్టెక్స్-A76 CPU లకు మద్దతును ఇస్తుంది. అలాగే LPDDR4X మెమొరీ మరియు UFS 2.2 స్టోరేజ్ లకు కూడా మద్దతును కలిగి ఉంది. ఇది అత్యంత వివరణాత్మక ఫోటోలను తీయడానికి ఇది 108MP కెమెరాలకు మద్దతు ఇస్తుంది. దీనితో పాటుగా ఫాస్ట్ CAT-13 4G LTE వరల్డ్ మోడ్ మోడెమ్ ఇంటిగ్రేషన్, డ్యూయల్ 4G సిమ్ మరియు వోల్ట్ మరియు విల్ట్ సేవలను అందిస్తుంది. ఇది మీడియెక్ యొక్క మేడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంజిన్ మరియు నెట్వర్కింగ్ ఇంజిన్తో అగ్రస్థానంలో నిలిచింది. మీడియాటెక్ హీలియో G88 SoC చిప్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 90hz రిఫ్రెష్ రేటు డిస్ప్లేల మద్దతుతో వస్తుంది. అలాగే ఆక్టా-కోర్ CPU తో రెండు ఆర్మ్ కోర్ CPU తో పాటు 2.0GHz వరకు పనిచేసే రెండు ఆర్మ్ కార్టెక్స్-A75 CPU లకు మద్దతును కలిగి ఉంటుంది. ఈ చిప్ డ్యూయల్-కెమెరా సెటప్ లలో 64mp వరకు మెయిన్ కెమెరాకు మద్దతును కలిగి ఉంటుంది. అలాగే కెమెరా నియంత్రణ యూనిట్ లేదా CCU, ఎలక్ట్రానిక్ ఫోటో స్థిరీకరణ లేదా EIS మరియు రోలింగ్ షట్టర్ కంపెన్సషన్ (RSC) టెక్నాలజీలకు మద్దతు అందిస్తుంది. Helio G88 వాయిస్ అసిస్టెంట్స్ కోసం ఇంటిగ్రేటెడ్ వాయిస్ ని అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
MediaTek Company Launched Dimensity 9000 5G New Chipset For Premium Android Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X