మీడియాటెక్ కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ లాంచ్ అయింది!! GPU పనితీరు మరింత మెరుగ్గా

|

ప్రముఖ చిప్ సెట్ మేకర్ మీడియాటెక్ ఇప్పుడు కొత్తగా మరొక 5G ఆన్-చిప్ ప్రాసెసర్‌ను విడుదల చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ పేరుతో లభించే ఈ చిప్ ప్రధానంగా క్వాల్‌కామ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో పోటీపడనున్నది. GPU మరియు CPU పనితీరును పెంచడానికి మీడియాటెక్ యొక్క కొత్త చిప్‌సెట్‌లో భారీ మార్పులు చేయబడ్డాయి. కంపెనీ యొక్క తాజా స్మార్ట్‌ఫోన్ సిస్టమ్-ఆన్-చిప్ (SoC) ప్రాసెసర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఇది గరిష్టంగా 320MP కెమెరాస్ మరియు 180Hz ఫుల్ HD+ డిస్ప్లే ఫీచర్లను డైమెన్సిటీ 9000+ SOC చిప్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో సరికొత్త బ్లూటూత్ మరియు Wi-Fi కనెక్టివిటీ మద్దతును కూడా చేర్చబడింది. అలాగే హై-స్పీడ్ డేటా యాక్సెస్‌ని అందించడానికి డైమెన్సిటీ 9000+లో అంతర్నిర్మిత 5G మోడెమ్ కూడా ఉంది. దీని యొక్క స్పెసిఫికేషన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ స్పెసిఫికేషన్‌లు

మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ స్పెసిఫికేషన్‌లు

మీడియాటెక్ సంస్థ యొక్క కొత్త చిప్ డైమెన్సిటీ 9000+ SOC యొక్క స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది ఆర్మ్ యొక్క v9 CPU ఆర్కిటెక్చర్‌లో భాగమైన డైమెన్సిటీ 9000లోని కోర్ యొక్క 3.05GHz క్లాక్ స్పీడ్‌తో పోల్చితే అల్ట్రా-కార్టెక్స్-X2 కోర్ 4nm డైమెన్సిటీ 9000+లో 3.2GHz వద్ద క్లాక్ చేయబడింది. ఈ కొత్త చేరికతో CPU పనితీరును 5% కంటే ఎక్కువ కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ SoC

మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ SoC కొత్త చిప్ LPDDR5X ఇన్‌బిల్ట్ RAMని కలిగి ఉంటుంది. 8MB L3 CPU కాష్ మరియు 6MB సిస్టమ్ కాష్‌కు ఇంటిగ్రేటెడ్ మెమరీ మద్దతును ఇస్తుంది. APU 590, 5G అప్లికేషన్ ప్రాసెసర్ యూనిట్, ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ (AI) అప్లికేషన్‌లను ఉపయోగించడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మూడు సూపర్ కార్టెక్స్-A710 కోర్లు (2.85GHz వరకు) మరియు నాలుగు సమర్థవంతమైన కార్టెక్స్-A510 కోర్లు (1.8 GHz వరకు) కూడా చేర్చబడ్డాయి. Arm Mali-G710 MC10 కూడా ఈ సిస్టమ్‌లో భాగం మరియు ఇది GPU పనితీరును 10% వరకు మెరుగుపరుస్తుంది.

చిప్‌సెట్‌
 

ఈ తాజా చిప్‌సెట్‌ 144Hz WQHD+ లేదా 180HZ ఫుల్-HD+ ప్యానెల్‌ డిస్‌ప్లేల అనుకూలత కోసం మైరావిషన్ 790 మద్దతుతో లభిస్తుంది. అలాగే అనుకూల స్క్రీన్‌లతో సమకాలీకరించడానికి మరియు 4K60 HDR10+ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇవ్వడానికి ఈ చిప్ మీడియాటెక్ యొక్క ఇంటెలిజెంట్ డిస్‌ప్లే సింక్ 2.0 మరియు అత్యంత ఇటీవలి Wi-Fi డిస్‌ప్లే టెక్నాలజీలను కూడా అనుసంధానిస్తుంది.

Wi-Fi 6E

మీడియాటెక్ సంస్థ యొక్క కొత్త చిప్ డైమెన్సిటీ 9000+ SOC చిప్‌సెట్‌లో ముఖ్యంగా అంతర్నిర్మిత 5G మోడెమ్ ను కలిగి ఉంది. ఇది R16 ULకి మద్దతును ఇవ్వడమే కాకుండా 3CC క్యారియర్ అగ్రిగేషన్‌ని ఉపయోగించి సబ్-6GHz బ్యాండ్‌లో గరిష్టంగా 7Gbps డౌన్‌లింక్‌ను అందిస్తుంది. అదనంగా డ్యూయల్-యాక్టివ్ 5G/4G SIM కార్డ్ అనుకూలత అందుబాటులో ఉంది. Wi-Fi 6E మరియు బ్లూటూత్ v5.3 సామర్థ్యాలు కూడా మీడియాటెక్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలి అన్ని GNSS ప్రమాణాలు డైమెన్సిటీ 9000+ ద్వారా కూడా మద్దతు ఇవ్వబడ్డాయి.

మీడియాటెక్ Helio G96

మీడియాటెక్ Helio G96 చిప్ యొక్క ఫీచర్స్ గురించి లోతుగా పరిశీలిస్తే కనుక ఈ చిప్ ఫుల్-HD + రిజల్యూషన్ తో 120hz వరకు గల డిస్ప్లేలకు మద్దతును అందిస్తుంది. అలాగే ఇది DDIC సప్లై, C-PHY లేదా D- PHY ఇంటర్ఫేస్తో LCD మరియు AMOLED డిస్ప్లేలకు మద్దతును కలిగి ఉంటుంది. అలాగే ఇది 2.05GHz వరకు పనిచేయగల రెండు ఆర్మ్ కార్టెక్స్-A76 CPU లకు మద్దతును ఇస్తుంది. అలాగే LPDDR4X మెమొరీ మరియు UFS 2.2 స్టోరేజ్ లకు కూడా మద్దతును కలిగి ఉంది. ఇది అత్యంత వివరణాత్మక ఫోటోలను తీయడానికి ఇది 108MP కెమెరాలకు మద్దతు ఇస్తుంది. దీనితో పాటుగా ఫాస్ట్ CAT-13 4G LTE వరల్డ్ మోడ్ మోడెమ్ ఇంటిగ్రేషన్, డ్యూయల్ 4G సిమ్ మరియు వోల్ట్ మరియు విల్ట్ సేవలను అందిస్తుంది. ఇది మీడియెక్ యొక్క మేడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంజిన్ మరియు నెట్వర్కింగ్ ఇంజిన్తో అగ్రస్థానంలో నిలిచింది. మీడియాటెక్ హీలియో G88 SoC చిప్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 90hz రిఫ్రెష్ రేటు డిస్ప్లేల మద్దతుతో వస్తుంది. అలాగే ఆక్టా-కోర్ CPU తో రెండు ఆర్మ్ కోర్ CPU తో పాటు 2.0GHz వరకు పనిచేసే రెండు ఆర్మ్ కార్టెక్స్-A75 CPU లకు మద్దతును కలిగి ఉంటుంది. ఈ చిప్ డ్యూయల్-కెమెరా సెటప్ లలో 64mp వరకు మెయిన్ కెమెరాకు మద్దతును కలిగి ఉంటుంది. అలాగే కెమెరా నియంత్రణ యూనిట్ లేదా CCU, ఎలక్ట్రానిక్ ఫోటో స్థిరీకరణ లేదా EIS మరియు రోలింగ్ షట్టర్ కంపెన్సషన్ (RSC) టెక్నాలజీలకు మద్దతు అందిస్తుంది. Helio G88 వాయిస్ అసిస్టెంట్స్ కోసం ఇంటిగ్రేటెడ్ వాయిస్ ని అందిస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్‌సెట్‌ ఫీచర్లు

మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్‌సెట్‌ ఫీచర్లు

తైవానీస్ చిప్ మేకర్ ప్రారంభించిన మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్‌సెట్‌ అనేది ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ 6nm ప్రాసెస్ ఆధారంగా తయారుచేసింది. అదనంగా ఇది 2.5GHz వద్ద పనిచేసే రెండు ARM కార్టెక్స్-A78 పనితీరు కోర్లను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ తయారీదారు దీని యొక్క కోర్ల వివరాలను ప్రకటించలేదు. అయినప్పటికీ ఇది 6 ARM కార్టెక్స్-A55గా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాసెసర్ ARM Mali-G610 GPUతో జత చేయబడి ఉండడమే కాకుండా మీడియాటెక్ యొక్క HyperEngine 5.0కి మద్దతుతో వస్తుంది. అలాగే మెరుగైన గేమింగ్ పనితీరు కోసం అదనపు ఆప్టిమైజేషన్ టూల్స్ మరియు ఫీచర్లను వినియోగదారులకు అందిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
MediaTek Dimensity 9000+ New SOC Chipset Launched With Inbuilt LPDDR5X RAM, Improved CPU, GPU Performance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X