Home
News

MediaTek నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల కోసం కొత్తగా రెండు హీలియో చిప్సెట్లు లాంచ్!!

ప్రజాదరణ పొందిన ప్రముఖ చిప్మేకర్ మీడియాటెక్ ఇటీవల కొత్తగా రెండు కొత్త చిప్సెట్లను విడుదల చేసింది. ముఖ్యంగా మిడ్-రేంజ్ విభాగంలోని స్మార్ట్ ఫోన్ల కోసం మీడియాటెక్ సంస్థ హీలియో G96 మరియు హీలియో G88 SoC చిప్సెట్లను ప్రకటించింది. మీడియాటెక్ హీలియో G96 చిప్ 120Hz ఫుల్-HD + డిస్ప్లే మరియు 108MP కెమెరా ఫీచర్లతో విలీనం చేయవచ్చు. అంతేకాకుండా ఇది డ్యూయల్ 4G సిమ్ కార్డులతో 4G LTE ని మద్దతు ఇస్తుంది.

మీడియాటెక్

మరోవైపు మీడియాటెక్ హీలియో G88 చిప్ కూడా 90hz రిఫ్రెష్ రేటు ఫుల్ HD + డిస్ప్లే 64MP కెమెరా మరియు 4G వోల్ట్ ఫీచర్లతో విలీనం చేయవచ్చు. ఈ రెండు SOC లు మీడియాటెక్ యొక్క హైపర్ఎంజైన్ 2.0 లైట్ గేమ్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా రాబోయే బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ విభాగంలోని ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్లలోని SOC లలో ఈ చిప్ కనిపించనున్నది.

మీడియాటెక్ హీలియో G96 చిప్ ఆఫర్

మీడియాటెక్ హీలియో G96 చిప్ ఆఫర్

మీడియాటెక్ Helio G96 చిప్ యొక్క ఫీచర్స్ గురించి లోతుగా పరిశీలిస్తే కనుక ఈ చిప్ ఫుల్-HD + రిజల్యూషన్ తో 120hz వరకు గల డిస్ప్లేలకు మద్దతును అందిస్తుంది. అలాగే ఇది DDIC సప్లై, C-PHY లేదా D- PHY ఇంటర్ఫేస్తో LCD మరియు AMOLED డిస్ప్లేలకు మద్దతును కలిగి ఉంటుంది. అలాగే ఇది 2.05GHz వరకు పనిచేయగల రెండు ఆర్మ్ కార్టెక్స్-A76 CPU లకు మద్దతును ఇస్తుంది. అలాగే LPDDR4X మెమొరీ మరియు UFS 2.2 స్టోరేజ్ లకు కూడా మద్దతును కలిగి ఉంది. ఇది అత్యంత వివరణాత్మక ఫోటోలను తీయడానికి ఇది 108MP కెమెరాలకు మద్దతు ఇస్తుంది. దీనితో పాటుగా ఫాస్ట్ CAT-13 4G LTE వరల్డ్ మోడ్ మోడెమ్ ఇంటిగ్రేషన్, డ్యూయల్ 4G సిమ్ మరియు వోల్ట్ మరియు విల్ట్ సేవలను అందిస్తుంది. ఇది మీడియెక్ యొక్క మేడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంజిన్ మరియు నెట్వర్కింగ్ ఇంజిన్తో అగ్రస్థానంలో నిలిచింది.

మీడియాటెక్ హీలియో G88చిప్ ఆఫర్

మీడియాటెక్ హీలియో G88చిప్ ఆఫర్

మీడియాటెక్ హీలియో G88 SoC చిప్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 90hz రిఫ్రెష్ రేటు డిస్ప్లేల మద్దతుతో వస్తుంది. అలాగే ఆక్టా-కోర్ CPU తో రెండు ఆర్మ్ కోర్ CPU తో పాటు 2.0GHz వరకు పనిచేసే రెండు ఆర్మ్ కార్టెక్స్-A75 CPU లకు మద్దతును కలిగి ఉంటుంది. ఈ చిప్ డ్యూయల్-కెమెరా సెటప్ లలో 64mp వరకు మెయిన్ కెమెరాకు మద్దతును కలిగి ఉంటుంది. అలాగే కెమెరా నియంత్రణ యూనిట్ లేదా CCU, ఎలక్ట్రానిక్ ఫోటో స్థిరీకరణ లేదా EIS మరియు రోలింగ్ షట్టర్ కంపెన్సషన్ (RSC) టెక్నాలజీలకు మద్దతు అందిస్తుంది. Helio G88 వాయిస్ అసిస్టెంట్స్ కోసం ఇంటిగ్రేటెడ్ వాయిస్ ని అందిస్తుంది.

మీడియాటెక్ హీలియో

మీడియాటెక్ హీలియో యొక్క రెండు కొత్త చిప్ లు మృదువైన గేమింగ్ అనుభవాన్ని ఎనేబుల్ చెయ్యడానికి తెలివిగా CPU, GPU, మరియు మెమొరీని తెలివిగా నిర్వహించాలని భావిస్తున్న మీడియాటెక్ యొక్క హైపర్ఎంజైన్ 2.0 తరం టెక్నాలజీకి రెండు Socs అందించబడిందని కంపెనీ జోడించింది. బ్యాటరీ లైఫ్ ను విస్తరించడానికి అధిక FPS గేమ్ ప్లేలో శక్తి ఆదా చేసే విషయాల్లో ఇది సహాయపడుతుందని కూడా ఇది పేర్కొంది. ఈ టెక్నాలజీ Wi-Fi మరియు 4G కనెక్షన్ యొక్క తెలివైన అంచనాను ప్రారంభించడానికి అనువుగా ఉన్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
MediaTek Helio G88, G96 Chips Launched For Midrange Smartphones: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X