స్నాప్‌డ్రాగన్ vs మీడియాటెక్: చిప్‌సెట్ల తయారీలో ముందంజలో ఉన్నది ఎవరు?
స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కోసం సొంత ప్రాసెసర్‌లను క్రమం తప్పకుండా ఉత్పత్తి చేసే ఏకైక ఆండ్రాయిడ్ తయారీదారులలో హువాయి మరియు శామ్‌సంగ్ సంస్థలు ఇద్దరు ఉన్నారు. మిగతా అన్ని సంస్థలు తమ మొబైల్ చిప్ అవసరాల కోసం క్వాల్కమ్ మరియు మీడియాటెక్ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటెల్ మరియు ST-ఎరిక్సన్ యొక్క నోవాథోర్ వంటి సంస్థలు చిప్‌సెట్ల తయారీ నుంచి ఉపసంహరించుకున్న తరువాత ఈ రెండు కంపెనీలు చాలా సంవత్సరాలుగా మూడవ పార్టీ చిప్‌సెట్ ప్రొవైడర్లుగా ఉన్నాయి.

CPU టెక్నాలజీ
CPU ల విషయానికి వస్తే క్వాల్కమ్ దాని స్వంత క్రియో కోర్లను కలిగి ఉంది. అయితే 2017 నుండి సంస్థ సెమీ-కస్టమ్ డిజైన్లపై స్థిరపడింది. ఇవి స్టాండర్డ్ ఆర్మ్ సిపియు కోర్లపై ఆధారపడి ఉంటాయి, విద్యుత్ వినియోగం మరియు పనితీరు కోసం కొన్ని సర్దుబాటులు ఉంటాయి. ఇంతలో మీడియాటెక్ దాని ప్రాసెసర్ల కోసం స్టాండర్డ్ ఆర్మ్ సిపియు కోర్లను క్వాల్కమ్ మాదిరిగానే సవరించకుండా ఉపయోగిస్తుంది. క్రొత్త స్నాప్‌డ్రాగన్ ఇటీవల విడుదల అయిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 మాదిరిగానే క్వాల్‌కామ్ ఆర్మ్ సిపియు కోర్లను ఉపయోగిస్తుంది.

GPU టెక్నాలజీ
GPUs అనేవి క్వాల్కమ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం. అడ్రినో గ్రాఫిక్స్ టెక్నాలజీ AMD యొక్క హ్యాండ్‌హెల్డ్ గ్రాఫిక్స్ చిప్ వ్యాపారాన్ని క్వాల్కమ్ కొనుగోలు చేయడం ద్వారా ఇది లభించింది. అలాగే మీడియాటెక్ సంస్థ తన కొత్త హెలియో P 90 లో ఆర్మ్ పార్ట్స్‌కు బదులుగా ఇమాజినేషన్ టెక్నాలజీస్ GPUలను ఉపయోగించుకుంది. మునుపటి హై-ఎండ్ చిప్‌ల కంటే కంపెనీ పెద్ద గ్రాఫికల్ అప్‌గ్రేడ్‌ను క్లెయిమ్ చేస్తోంది.

మెషిన్ లర్నింగ్ టెక్నాలజీ
క్వాల్‌కామ్ సాంప్రదాయకంగా షడ్భుజి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) ను ఇటీవలి సంవత్సరాలలో మెషిన్ లర్నింగ్ టెక్నాలజీ కోసం ఉపయోగించుకుంది. DSP సాధారణంగా ఆడియో, ఫోటోగ్రఫీ మరియు కనెక్టివిటీకి సంబంధించిన పనులను నిర్వహిస్తుంది. కాని సంస్థ మెషిన్ లర్నింగ్ కోసం చిప్‌ను CPU మరియు GPU తో పాటు ట్యూన్ చేస్తుంది. మరోవైపు మీడియాటెక్ హేలియో P60 చిప్‌సెట్‌ను ప్రారంభించడంతో మిడ్-రేంజ్ ఫోన్‌లకు అంకితమైన AI ప్రాసెసింగ్ యూనిట్ (MPU) ను ప్రవేశపెట్టింది. APU స్మార్ట్ సీన్ రికగ్నిషన్, మెరుగైన ముఖ గుర్తింపు మరియు మరిన్ని మధ్య-శ్రేణి ఫోన్‌లకు అందిస్తుంది.

క్వాల్కమ్ మరియు మీడియాటెక్ చిప్‌లను వినియోగిస్తున్న డివైస్ లు
మీడియాటెక్ యొక్క చిప్‌లతో నోకియా1, నోకియా 3 మరియు 3.1, మరియు రెడ్‌మి 6 మరియు 6a వంటి ఎంట్రీ లెవల్ ఫోన్‌లు విడుదల అయ్యాయి. వాస్తవానికి సంస్థ యొక్క హెలియో A22 మరియు P22 చిప్స్ ప్రారంభ సమయంలో క్వాల్కమ్ యొక్క చిప్‌ల కంటే తక్కువకు లభిస్తాయి. క్వాల్‌కామ్ సంస్థ ఇప్పటికీ ఎంట్రీ లెవల్ ఫోన్లకు స్నాప్‌డ్రాగన్ 212 మరియు స్నాప్‌డ్రాగన్ 425 వంటి చిప్‌లపై మొగ్గు చూపుతుంది. కానీ సంస్థ యొక్క కొత్త స్నాప్‌డ్రాగన్ 429 మరియు స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌లను అందించవచ్చు. క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 400, 600, మరియు 700 సిరీస్‌లు మరియు జనాదరణ పొందిన హీలియో P60 మరియు MT6750 సిరీస్ ని మిడ్-రేంజ్‌లో ఎక్కువగా చూస్తారు. ఇవి నోకియా 5.1 ప్లస్, రియల్‌మి 1, ఒప్పో ఎఫ్ 9, LG Q7 మరియు ఎల్‌జి ఎక్స్ పవర్ 2 ఫోన్‌లలో వినియోగిస్తున్నారు. క్వాల్కమ్ చిప్‌లు మిడ్-రేంజ్ ఫోన్‌లు అయిన నోకియా 7 ప్లస్, షియోమి Mi A2, షియోమి రెడ్‌మి నోట్ 5 , మరియు రియల్మే 2 ప్రో లలో వినియోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications








