గూగుల్, యాపిల్‌లకు వేల కోట్ల జరిమానా.. ఈమె కారణం

|

టెక్నాలజీ దిగ్గజాలైన యాపిల్, గూగుల్‌లకు లక్షల కోట్ల జరిమానాను విధించి సిలికాన్ వ్యాలీ కంపెనీలకు కంటి మీద కునుక లేకుండా చేసిన యూరోపియన్ కమీషన్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ కమీషన్‌కు నేతృత్వం వహిస్తోన్న మార్గ్రీత్ వెస్టాజర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోన్న కంపెనీల పై కఠిన చర్యలకు సిద్దమవుతోంది.

Meet Denmarks Iron Lady who could cost Google $6.6 billion

గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఏకంగా 2.4 బిలియన్ యూరోల జరిమానాను విధించింది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.17,570 కోట్లు. గూగుల్ దీని పై యూరోపియన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. మరోవైపు ఐఫోన్‌ల తయారీ కంపెనీ యాపిల్‌కు కూడా యూరోపియన్ కమీషన్ గట్టి షాకే ఇచ్చింది.

ఐర్లాండ్‌తో ఒప్పందం చేసుకుని, తద్వారా చాలా వరకు అంతర్జాతీయ అమ్మకాలను అక్కడి నుంచే నిర్వహిస్తూ బిలియన్ డాలర్ల కార్పొరేట్ పన్నులను యాపిల్ ఎగ్గొడతూ వచ్చిందని యూరోపియన్ కమీషన్ తన విచారణలో నిగ్గు తేల్చింది. ఇందుకు గాను 13 బిలియన్ యూరోల జరిమానాను విధించింది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారు లక్ష కోట్లు.

అమెరికా బహుళజాతి దిగ్గజాలను ఆకర్షించటం కోసం యూరోపియన్ దేశాల్లో ఒకటైన ఐర్లాండ్ చాలా సంవత్సరాలుగా ఇష్టానుసారం పన్ను ప్రోత్సాహకాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే చట్టవ్యతిరేకంగా
యాపిల్‌కు ఐర్లాండ్ ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను కల్పించిందని యూరోపియన్ కమీషన్ తన విచారణంలో నిగ్గు తేల్చింది.

శాంసంగ్‌కు పట్టిన గతే ఆపిల్‌కు, షాకిచ్చిన iPhone 8, iPhone 8 Plus !శాంసంగ్‌కు పట్టిన గతే ఆపిల్‌కు, షాకిచ్చిన iPhone 8, iPhone 8 Plus !

స్వీట్ హార్ట్ డీల్స్‌గా పిలవబడే వీటి కారణంగా యాపిల్, యూరోప్ వ్యాప్తంగా చేస్తోన్న ఇతర వ్యాపారాలకు సంబంధించి చాలా తక్కువ పన్నున చెల్లిస్తూ వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఐర్లాండ్ ప్రభుత్వంతో కుదర్చుకున్న డీల్‌లో భాగంగా యూరోప్‌లో దాదాపు తన వ్యాపార లాభాలన్నింటిపైనా యాపిల్ పన్నులను ఎగ్గొంట్టిందని యూరోపియన్ కమీషన్ ఆరోపించింది.

ఐర్లాండ్‌లోని క్లార్క్ సిటీ కేంద్రంగా యాపిల్ సంస్థ 1980 నుంచి తన యూరోప్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అక్కడి కంపెనీకి దాదాపుగా 5,000 మంది ఉద్యోగులున్నారు. యాపిల్ తన అంతర్జాతీయ అమ్మకాలను ఐర్లాండ్ కేంద్రంగా నిర్వహించటం ద్వారా బిలియన్ల యూరోల కొద్ది కార్పొరేట్ పన్నులను ఎగొట్టినట్లు ఆరోపణలు రావటంతో యూరోపియన్ కమీషన్ రంగంలోకి దిగి పన్ను ఎగవేత అంశం పై దర్యాప్తు నిర్వహించింది.

తన థండర్ బోల్ట్ నిర్ణయాలతో ప్రపంచదేశాల దృష్గిని ఆకర్షించిన మార్గ్రీత్ వెస్టాజర్ 2014లో మొదటి సారిగా యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమీషనర్‌గా నియమితులయ్యారు. ఈ కమిషన్‌లోని 28 కమీషనర్‌లలో అత్యుతం ప్రాచుర్యం పొందిన వ్యక్తిగా మార్గ్రీత్ గుర్తింపు పొందారు. యూరోపియన్ కమీషన్‌కు సంబంధించి ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లోని బిర్లేమాంట్ బిల్డింగ్‌లో ఉంది.

ఈ కార్యాలయం మిగిలిన కార్యాలయాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా డిజైన్ చేయబడింది. యూరోపియన్ కమీషన్‌ కార్యాలయంలోని గోడలు పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ అలానే డానిష్ కళాకారుడు క్రిస్టినా గోర్డాన్ పెయింటింగ్‌లతో పిన్ చేయబడి ఉంటాయి. ఈ ప్రాంగణంలో మార్గ్రీత్ వెస్టాజర్‌కు కేటాయించబడిన డెస్క్ బ్రసెల్స్ స్కై లైన్ వైపుగా ఉంటుంది. యూరోప్ దేశాల సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్నమార్గ్రీత్ వెస్టాజర్ ఈ ఛాంబర్‌లో నిత్యం బోర్ట్ ఎగ్జిక్యూటివ్‌ల మీటింగ్‌లను నిర్వహిస్తుంటారు.

మార్గ్రీత్ వెస్టాజర్ 1968, ఏప్రిల్ 13న గ్లోస్టుప్, జీలాండ్‌లో జన్మించారు. కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె రాజకీయవేత్త కూడా. డానిష్ సోషల్ లిబరల్ పార్టీ తరుపున 2001 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగారు.

క్యాబినేట్‌లో 2011 నుంచి 2014 వరకు డెన్మార్క్ ఆర్థిక వ్యవహారాలు మరియు అంతర్గత వ్యవహారాల శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2014, ఆగష్టు 31న అప్పటి డెన్మార్క్ ప్రధాని తోర్నింగ్ - ష్మిత్, మార్గ్రీత్ వెస్టాజర్ ను డెన్మార్ యూరోపియన్ యూనియల్ కమీషనర్ గా నామినేట్ చేసారు.

2012లో యూరోప్ దేశాలను రుణ సంక్షోభం ముంచెత్తటంతో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు దేశ ఆర్థిక వృద్ధి కూడా భారీగా పతనమవటంతో సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ మినిస్టర్స్‌తో కలిసి మార్గ్రీత్ వెస్టాజర్ 33 కీలక మీటింగ్‌లను నిర్వహించి పరస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసారు.

ఇటీవల ఏపీఎఫ్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర వివరాలను మార్గ్రీత్ వెస్టాజర్ వెల్లడించారు. యూరోప్‌ను ముంచెత్తిన రుణ సంక్షోభం, ఆ తరువాత చోటుచేసుకున్న బెక్సిట్ వంటి పరిణామాలతో తాను మానసికంగా మరింత బలపడినట్లు మార్గ్రీత్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Margrethe Vestager, the woman who costs Google, Apple billions. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X