చైన్నై హిరోలు!

By Super
|
Meet the countrys youngest apps programmers

చన్నయ్: ఆ త్రండి ప్రోద్బలం తన చిన్నారులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.. స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్ వంటి టెక్ రారాజులను ఆదర్భంగా తీసుకుని ఆ యువకిరణాలు రాణిస్తున్నతీరు ఆదర్శప్రాయం. వివరాల్లోకి వెళితే.. చెన్నయ్‌కు చెందిన శ్రావణ్ (10), సంజయ్(12)లు దేశవ్యాప్తంగా యువ అప్లికేషన్ డవెలపర్లగా గుర్తింపుతెచ్చుకున్నారు. ఇప్పటికి వీరు వృద్ధి చేసిన మూడు అప్లికేషన్‌లను ఆపిల్ ఎంపిక చేసి.. ఐప్యాడ్, ఐఫోన్‌లలో డౌన్‌లోడింగ్‌కి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ అప్లికేషన్‌లను ఇప్పటి వరకు 10,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ బుడతలు వృద్ధి చేసిన మొదటి అప్లికేషన్ ‘క్యాచ్ మీ కాప్’(Catch Me Cop). ఈ గేమింగ్ అప్లికేషన్ ఉత్కంఠభరితమైన అనుభూతికి లోను చేస్తుంది. మరో అప్లికేషన్‌ను చిన్నారుల కోసం డిజైన్ చేశారు. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో చిన్నారులు ఆల్ఫాబెట్లతో పాటు ప్రార్థనా గీతాలను నేర్చుకోవచ్చు.

తండ్రి కుమారన్ ఐటీ నిపుణుడు:

వీరి తండ్రి అయిన కుమారన్ వృత్తిరిత్యా ఐటీ నిపుణులు కావటంతో తన పిల్లలకు చిన్నతనం నుంచే కంప్యూటర్ పట్ల అవగాహన కల్పించాడు. దింతో కంప్యూటింగ్‌ను హబీగా ఎంచుకున్న ఆ చిన్నారులు టెక్నాలజీ విభాగంలో రాణించగలుగుతున్నారు.

స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్ ఆదర్శంగా:

ఐటీ దిగ్గజాలైన స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్‌లను ఆదర్శంగా తీసుకుని తాము ముందుకు సాగుతున్నట్లు శ్రావణ్ , సంజయ్‌లు వెల్లడించారు. ప్రపంచపు తేలికైన టాబ్లెట్‌ను రూపొందించే లక్ష్యంగా తాము శ్రమిస్గున్నట్లు ఈ బాల మేధావులు తమ మనసులో మాటలను బయటపెట్టారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X